ఉత్తర తెలంగాణ

మురళీమోహనం! (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాత ఇనుము, పాత పేపర్లు కొంటాం’ తోపుడు బండిని తోసుకొంటూ వెళ్తున్న లలిత గొంతు రోడ్డు మీద పరుగెడుతున్న వాహనాల శబ్దంతో పోటీపడుతోంది. అప్పటికే నాలుగు వీధుల్లో నాలుగు చక్రాల బండిని తోసుకెళ్తూ నాలుగైదు ఇళ్లల్లో పాత ఇనుము, పాత పేపర్లు కొనేసింది. బండి కింద నవారు మంచము లాగున్న దానిమీద సంవత్సరం కొడుకు హాయిగా నిద్రబోతున్నాడు. ముంగురులు సవరించుకొంది. అప్పటికే సూర్యుడు నడినెత్తిమీద కొచ్చిండు. కొంగుతో నుదుటి చెమట అద్దుకుంది. తక్కెడ, బాట్లు ఎడమ పక్క అందుబాట్లో ఉన్నాయి!
పొట్టతిప్పలుకు జెర్రిపోతుల నాడించాలన్నట్టు ఊరంతా తిరిగి పాత సామాగ్రి కొని వాటిని ఎగుమతి చేసే డీలరుకు అమ్మేస్తుంది. చెమటోడ్చిన సంపాదన తృప్తిగా ఉంటుంది. ఏ పనీ చెయ్యకపోతే ఇనుముకు చిలుములా ఆరోగ్యానికి రోగాలు అంటుకుంటాయి. బండికింది అశోక్ చిన్నారి కొడుకు ఏడుస్తూ లేచి కూచున్నాడు. లాలించి బండిమీద కూచోబెట్టింది. రోజట్లాగే ఆ గల్లీలోకెళ్లి పైన కప్పున్న ఎత్తు అరుగుల మీద కూచుంది. ఆ అరుగుల ఇల్లుకు ఎప్పుడూ తాళమేసి ఉంటుంది. అరుగు మీది నీడలో బాబును కూచోబెట్టి టిఫిన్ బాక్సు విప్పింది. బాబుకు తినిపించింది. తాను గుడిసె హోటళ్లో టీ తాగి వచ్చి కూచుంది. రోజు ఉషోదయానే్న లేచి ఇంటి పనుల్లో సంగడి బొంగరంలా తిరుగుతుంది. వంటచేసే అశోక్‌కు పాలు పట్టి, తాను భోంచేస్తుంది. కొడుక్కోసం టిఫిన్ బాక్సు తయారు చేస్తుంది. బాటిల్‌లో నీళ్లు నింపుతుంది. నిద్రబోతున్న కొడుకును బండి మంచమీద పడుకోబెట్టి బయలుదేరుతుంది.
కొద్దిసేపు విశ్రాంతి కోసం గోడకొరిగి కూచుంది. అశోక్ బడిలో ఆడుకుంటున్నాడు. మనసు తెరమీద గతం కదుల్తోంది...
తిండికోసం తండ్లాడుతున్న అమ్మానాన్నలు కంపెనీ లేబర్ నారాయణతో పెండ్లి చేసి చేతులు దులుపుకున్నారు. అత్తా మామలు లేరు. రెండు సంవత్సరాల్లో అశోక్ పుట్టిండు. ముత్యాల మూట దొరికినట్టు నారాయణ మురిసి పోయిండు. తానుగూడా ఏదన్నా పని చేస్తానంటే నారాయణ వద్దన్నాడు. ఇంటి ముందున్నోళ్లు తమ పండ్ల తోపుడు బండి అమ్ముతామన్నారు. నారాయణ కొత్త సైకిల్ మీద డ్యూటికెళ్లిండు. తానే బలవంతంగా తోపుడు బండి ఆ రోజే కొనిపించింది.
మర్నాటి నుండి నారాయణ సైకిల్‌మీద డ్యూటీకి, తాను బాబును తీసుకుని బండి తోసుకుంటూ వెళ్లడం అలవాటైంది. ఆరు వారాలు గడిచాక..నారాయణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిండు, సైకిల్‌ను ఏదో లారీ గుద్దేసి వెళ్లిందంటా. ఎంత ఏడ్చినా నారాయణ తిరిగి రాలేదు. కంపెనీ వారే అంత్యక్రియలు చేయించి వెళ్లిపోయిండ్రు, ఓ వెయ్యి రూపాయలు తన చేతిలో పెట్టిండ్రు. లోకమంతా చీకటిగా కనబడింది. చిన్నారి అశోక్ కోసం బతకాలనుకుంది. ఓ రోజు ఓ దుర్మార్గుడు వచ్చి తన మీద చెయ్యేసిండు. లబలబలాడింది. వాడకట్టు వాళ్లొచ్చి వానికి దేహశుద్ధి చేసి పంపించిండ్రు. పోలీసు రిపోర్టు ఇద్దామంటే తానే వద్దన్నది..
‘లలితా.. ఓ లలితా!’ గొంతు పెద్దగా విన్పించింది. ఈ లోకంలోకొచ్చింది. తన ముందు పాత ఇనుము, పేపర్లు కొనే డీలరు కొడుకు మురళి. ‘ఏంది బాబూ?’ కొంగు సవరించుకుంది.
‘గిక్కడ కూచుని ఏమాలోచిస్తున్నావ్?’
‘నా కతంతా మీనాన్నకు, మీకు చెప్పినగదా! ఏదో గుర్తుకొచ్చింది’. అరుగు దిగి బండి వద్దకెళ్లింది. మురళి యువకుడు. తల్లి లేదట. నోటి నిండా మాట్లాడి తోచిన సాయం చెయ్యడం ఆయనకు అలవాటు! సాయంత్రం బండితో మురళి దుకాణానికెళ్లింది. కాస్సేపు కూచొమ్మన్నారు. తండ్రీ కొడుకులిద్దరున్నారు. మిగతా బండ్ల వారి సరుకులు కొని చివరికి తన పాత ఇనుము, పేపర్లు తీసుకుని పైసలిచ్చిండ్రు. లోపల ఆఫీసుల మురళి తండ్రి ‘లలితమ్మా! ఓసారి ఆఫీసులోకి రామ్మా!’ పిలిచాడు. ఎవరి మనసులో ఏముందో? బాబుతో సహా వెళ్లింది. విధి లేదు. పులి ముందు కుందేలు పిల్ల లెక్కనిల్చుంది. మురళి గూడా లోపలికొచ్చిండు. కూచొమ్మన్నారు. కుర్చీ చూపించిండ్రు. ముండ్లమీద కూచున్నట్టు కూచుంది. చిన్నారి అశోక్ ఎదురు కుర్చీలో కూచున్న మురళి ఒడిలో కేరింతలు కొడుతున్నాడు. మురళి తండ్రి (డీలరు) ‘మా మురళికింకా పెండ్లి చెయ్యలేదమ్మా’ ప్రస్తావించిండు. ‘అట్లానా?’ అన్నది తాను. మురళి నవ్విండు.
‘నీ కతంతా మాకు తెల్సు. మురళికి తల్లిలేదు. మమ్ముల్ని మంచిగా చూసుకునే అమ్మా మీతో వాని పెండ్లి చెయ్యాలి. నీకు శాంతముంది. మంచి గునముంది. నువు సరేనంటే నిన్ను పెండ్లి జేసుకుంటడు. నేనే పెండ్లి చేయిస్తా. నీ కొడుకు నా మనవడైతడు.’
ఆకలితో అలమటిస్తున్న మనిషికి కోడి పలావు చేతికొచ్చినట్టనిపించింది. చూపులు మురళి మీద వాలినై. అతడు చిరునవ్వుతో ‘నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం లలితా! బలవంతం లేదు. అంతా నీ ఇష్టం’ అంటూ అశోక్‌ను ముద్దాడిండు.
లలిత ఎదపొదలో సంతోషం. ‘నా కొడుకు అదృష్టవంతుడు’ అంటూ లేచి వెళ్లి డీలరు పాదాలకు నమస్కరించింది. మురళి మనసులో మల్లెల వాన కురిసింది.