రాజమండ్రి

సత్యనిష్ఠతో సాగిన సాధికార పరిశోధన (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయ నాటక ప్రస్థానం

రచన: డాక్టర్ పైడిపాల
పుటలు: 176, వెల: రూ.130/-
ప్రతులకు:
డాక్టర్ పి.ఎస్.రెడ్డి
11-20 కొంకాపల్లి,
అమలాపురం - 533201
సెల్: 9989106162
**
ఆత్రేయపై విద్యార్థి దశలోనే అభిమానం పెంచుకొని ఆయనలాగే గోత్రాన్ని కలంపేరుతో పెట్టుకొన్న డాక్టర్ పి.ఎస్.రెడ్డి ఇటీవల ఆత్రేయ నాటికలు, నాటకాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ‘ఆత్రేయ నాటక ప్రస్థానం’. ఆత్రేయ గురించి ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వెలువడినా, ఎంతో పరిశోధన జరిగినా - ఆయన నాటక సాహిత్యంపై ఈ పుస్తకం రాయవలసిన ఆవశ్యకతను వక్కాణించి నిజాయితీతో తపనతో రాసిన గ్రంథం ఆత్రేయ నాటక ప్రస్థానం. ఆత్రేయపై వైయక్తిక విమర్శలున్నట్టే ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన రచనల్లో కూడా అపవ్యాఖ్యలు, అసత్యాలు దొర్లాయి. ఎత్తిపోతల ఉపరిశోధనల్లో అనేక అపభ్రంశాలు చోటుచేసుకున్నాయి. ఆత్రేయ నాటక సాహిత్యంపై ‘ఆత్రేయ నాటకాలు - పూర్వాపరాలు’ అనే ఎం.్ఫల్ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పరిశోధకునిగా, మనస్విని ట్రస్ట్ ప్రచురించిన ‘ఆత్రేయ సాహితి’ (7 భాగాలు) సహ సంపాదకునిగా (సంపాదకులు: కొంగర జగ్గయ్య), ఆత్రేయ ఆత్మీయ అంతే వాసిగా ఆత్రేయ సాహిత్యంపై సాధికార ముద్ర కలిగిన డాక్టర్ పైడిపాల ఆత్రేయ నాటక సాహితీపై ఒక నిర్ధిష్టమైన, నిష్పాక్షికమైన సమగ్ర గ్రంథాన్ని వెలువరించాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని రాశారు.
ఆచార్య ఆత్రేయ జీవిత రంగంలో ప్రారంభించి, ఆయన పద్యరచన నుంచి నాటక రచనవైపు మళ్లడానికి కారణాలను వివరిస్తూ, ఆయన నాటక రచయితగా ఎదగడానికి రంగస్థలానుభవం ఎలా దోహదం చేసిందో విశే్లషిస్తూ లభ్యమవుతున్న ఆత్రేయ పది నాటకాలను, పదిహేను నాటికనూ మూలాలతో సహా విశదీకరించారు పైడిపాల. జె.బి.ప్రీస్ట్లీ రాసిన ‘లెబర్నమ్‌గ్రోల్’ నాటకానికి ‘కప్పలు’ అనుసరణగా ఆత్రేయ అంగీకరించకపోయినా, ఆ అనుసృజనను పైడిపాల ఆధారాలతో నిరూపించారు. ఇబ్సన్, పి.వి.రాజమన్నార్, బళ్ళారి రాఘవులు నుంచి స్ఫూర్తి పొందిన ఆత్రేయకు వెంకటగిరి అమెచ్యూర్స్, ఆంధ్ర నాటక కళాపరిషత్, ప్రజానాట్యమండలి, ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఆశ్రయమిచ్చి ఎలా విశిష్ట నాయక రచయితగా తీర్చిదిద్దిందీ తెలియజేశారు. ఆత్రేయ ప్రత్యేకతలైన స్వాభావికవాదం, శాంతి మంత్రం మాటల పదును ‘ఎన్జీవో’, ‘్భయం’, ‘పరివర్తన’, ‘విశ్వశాంతి’, ‘అశోక సమ్రాట్’ మొదలైన నాటకాల్లో ఎలా ప్రతిబింబించిందీ, ఆయన ఆధునికాంధ్ర రచన నాటక యుగకర్తగా ఎలా పరిణతి చెందిందీ హృద్యంగా చెప్పారు.
ఆరు అధ్యాయాలున్న ఈ పుస్తకంలో రచయిత ఆత్రేయ. ఆయన అర్ధాంగి జె.వి.పద్మావతి గార్ల ఇంటర్వ్యూలను, ఆత్రేయ ధర్మపత్నికి రాసిన లేఖలను అనుబంధాలుగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2015 సంవత్సరానికి నాటక రంగంపై రచించిన ఉత్తమ పుస్తకంగా ఈ గ్రంథం నంది పురస్కారాన్ని అందుకొంది.
ఆత్రేయ అభిమానులు, నాటక రచయితలు, కళాకారులు తప్పక చదివి దాచుకొనదగిన విలువైన గ్రంధం ఇది.

- రవికాంత్, సెల్; 9642489244
**

కొత్త పుస్తకం

మూఢనమ్మకాలపై అక్షర శరాలు

ప్రతులకు
విశాలాంధ్ర, నవోదయ, నవయుగ పుస్తకకేంద్రాల అన్ని బ్రాంచీల్లో,
నాస్తిక కేంద్రం, బెంజిసర్కిల్, విజయవాడ-10.
సండేమార్కెట్, నెల్లూరు.
**
ఈ సమాజంలో నాలుగు మంచిమాటలు చెప్పేవారే కరవయ్యారు. తమ రచనా చమత్కృతితో నాలుగు మంచి మాటలు చెప్పి సమాజాన్ని ఉత్తేజితులను చేయాలనే సంకల్పం కలవారు బహు అరుదు. అటువంటి వారిలో రాచపాళెం రఘు ఒకరు.
రాచపాలెం రఘు పరిచయం అక్కర్లేని పేరు. సమాజంలో రుగ్మతలనే వస్తువుగా తీసుకుని రచనలు సాగించిన సృజనశీలి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోనేటి రాజుపాళెంలో జన్మించిన రఘు పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు బిఎల్,ఎంఫిల్ చేసి కార్మిక శాఖ ఉప కమీషనర్‌గా పనిచేస్తున్నారు. కార్మికశాఖలో కమిషనర్ హోదాలో పనిచేస్తున్నా సాహిత్యంపై మక్కువతో విశేష ఆలోచనా పరంపర ఆయన్ని రచనాప్రక్రియవైపు దారిమళ్లించాయి. కారల్‌మార్క్స్ రచనలతో ప్రేరేపితుడై, అభ్యుదయ భావాల పుట్టగా ఉన్న రఘు ఇప్పటికే నానీలు, పేరడీలు వంటి ఎనిమిది పుస్తకాలు వెలువరించారు. ఇవికాకుండా రఘకు అనేక పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చి అలరించాయి.
లోకాయత శతకం అనే పేరుతో లోకంలో అన్ని అంశాలను స్పృశిస్తూ మూఢనమ్మకాలపై వాడైన అక్షర శరాలు సంధిస్తూ రఘు ఖండిక సృజించారు. రాచపాళెం మాట రతనాల మూట అనే మకుటంతో నిఖార్సయిన హేతువాది అయిన రఘు వంద పద్యాలను ఖండిక రూపంలో అక్షర బద్ధం చేశారు. అటు వచన కవిత్వం కాని, ఇటు పద్యం రూపంలోకాని లేని నాలుగుపాదాలు కల ఖండిక ఒక మకుటంతో జత కలిపి రసప్లావితంగా శబ్ధసౌందర్యంతో నిండి ఉంది. పేజీకో ఖండిక దానికింద ఒక అర్ధవంతమైన చిత్రం ఈ పుస్తకానికి వనె్నతెచ్చింది. మూఢ నమ్మకాలను మధించి/ముత్యాలు రత్నాలు పేర్చినాను/ఏరుకొనుట విజ్ఞులకు వదిలినాను/ రాచపాళెం మాట రతనాల్‌మూట అంటూ శతకాన్ని ముగించారు. కారల్‌మార్క్స్ ప్రేరణతో సాహితీ సేద్యం చేస్తున్న రఘు తన లోకాయత శతకాన్ని మార్క్స్ సతీమణి జెన్నీమార్క్స్‌కు అంకితం చేయడం గురుదక్షిణ అనచ్చేమో. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, విశ్వాసాలను తర్కిస్తూ ఆవేశపడడం కన్నా ఆలోచించమని తన అభిప్రాయాన్ని విజ్ఞులముందుంచారు. తాను నమ్మిన హేతువాద సిద్ధాంతాన్ని గొప్పగా చూపుతూ, నచ్చని ఆధ్యాత్మిక, దైవ అంశాలన్ని విమర్శిస్తూ లోకాయత శతకంలో అక్షర యజ్ఞం సాగించారు.
ఆలయంలో దొంగలు పడి విగ్రహాలు అపహరణకు గురైన అంశంపై రచయిత అక్షర శర సంధానం ఇలా ఉంది
సర్వాంతర్యామి సామి వుంటే/సామిశిలలు చౌర్యమందుటేల?/సామి రక్షకు రక్షక భటులేల?
మరోచోట అన్నపూర్ణేశ్వరీ అఖిలాండేశ్వరీ/ అంతటా అవతరించి ఉంటే/అందరి ఆకలి మంటలు ఆర్చదేల? అని
మానవతుల మాన చోరుడు/గోకుల గొల్లభామల మరుడు/ పాపాల గోపాలుడు గోవిందుడెట్లు?
అయోధ్యరాముడు ధర్మప్రభువైతే/ఆదిమజాతి ఆడది తాటకిని/హతమార్చుట ఏపాటి ధర్మంబు?
ధర్మసతిని అగ్నిపరీక్ష నిల్పినోడు/గర్భవతిని కానలంపిన కఠినాత్ముడు/ దశరథాత్మజుడు దయామయుడెట్లు?
కలడు కలడని కల్లబొల్లికబురులు/ ఎనె్నన్నో ఎందుకు? ఎన్నడనయినా/ పేదరికం పారద్రోలినాడా?
అని దేవుడు లేడని చెప్పే ప్రయత్నం చేశారు.

- గౌతమి, 9347109377
**
కార్డు కథ

నా చిట్టితల్లి కోరిక

‘నాన్నా!...
చిన్నప్పట్నుంచీ నేను అడిగింది మీరు ఏదీ కాదనలేదు
మీ మీద అలగడం అనేదే నేను ఎరుగను.
అసలు ఆ అవకాశం మీరు ఎప్పుడిచ్చారు? నా నోట్లో మాట, నోట్లో ఉండగానే నా కోరికల్ని ఎదురొచ్చి మరీ తీర్చేవారు.
నేను కోరుకున్న తిండి పెట్టారు.. బొమ్మలు కొనిపెట్టారు...
దుస్తులు సంగతి సరేసరి... ఎనె్నన్ని వెరైటీలో!..
ఫ్యాషన్ ప్రపంచంలో ననె్నప్పుడూ ముందువరుసలోనే ఉంచారు. ఇష్టమైన కాలేజీలో, ఇష్టమైన కోర్సు.. మీకు తలకుమించిన భారమైనా నన్ను తలెత్తుకొనేలా చేశారు.
ఇప్పుడు మాత్రం మీరు ఎందుకు కాదంటారు?...
నాన్నా! ఇది నా పెళ్లి. నూరేళ్ల భవిష్యత్తు.
నా ఇష్టాన్ని కాదనరనే నేను అతని ప్రపోజల్‌ని అంగీకరించాను. నాకంటే మంచి రంగు.. అంతస్తు... ఉద్యోగం.. జీతం.. వీటన్నింటి కంటే నేనంటే ప్రాణం.’
నేను నిద్ర మంచం లేవగానే నా మొబైల్ క్రింత నా చిట్టితల్లి రాసిన ఉత్తరం ఫ్యాను గాలికి రెపరెపలాడుతూ.
చదివినంతనే నా పెదవుల మీద సన్నటి మెరుపు.
‘ఆడపిల్లే’ కావాలని, వ్రతాలు చేయించి మరీ కన్న ‘చిట్టితల్లి’ నూరేళ్ల భవిష్యత్‌ని నిలిపే ఈ కోరికను ఎలా కాదంటాను?
నా చిట్టితల్లి అభీష్టం మేరకే అంతా జరిగిపోయింది.

- యదుశ్రీ చైతన్య
201, లక్ష్మీటవర్స్
కెనాల్‌రోడ్, పెనుగొండ
ప.గో.జిల్లా
సెల్: 9030360988
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన

కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net