ఉత్తర తెలంగాణ

పల్లా దుర్గయ్య సాహితీ సమాలోచనం 25న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న ఉ. 10 గంటలకు స్థానిక భగవతి హైస్కూల్‌లో డా. పల్లా దుర్గయ్య సాహితీ సమాలోచనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.అనంతాచార్య, దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. సాహితీవేత్తలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, డా. సంగనభట్ల నర్సయ్య, ఆచార్య ఎస్.వి.రామారావు, డా. పల్లా శ్యాంసుందర్, గిరిజా మనోహర్‌బాబు. గండ్ర లక్ష్మణరావు తదితరులు పాల్గొనే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి రసమయ బాలకిషన్, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, పల్లా వెంకటరమణ తదితరులు అతిథులుగా హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు
నవలల పోటీ ఫలితాలు
ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన ప్రథమ నవల పురస్కార నవలల పోటీ ఫలితాలను అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు ప్రకటించింది. వరంగల్‌కు చెందిన వరిగొండ కాంతారావు రచించిన ‘సాహచర్యం’ నవల ప్రథమ బహుమతికి ఎంపిక కాగా, కృష్ణాజిల్లా కానూరుకుకు చెందిన శీలం విజయనిర్మల రచించిన ‘తొలకరి చినుకులు’ నవల ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ఈ పురస్కారాలను డిసెంబర్ 24వ తేదీ శనివారం సాయంత్రం 6 గం.కు హనుమకొండలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు ట్రస్టు కార్యదర్శి డి. స్వప్న ఓ ప్రకటనలో తెలిపారు.
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net