ఉత్తర తెలంగాణ

ఉపాధ్యాయుడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే
మనో గగనాన్ని పరికిస్తే
ఒక అద్భుత కాంతిపుంజం
ఆవిష్కృతమవుతుంది
అమృత శాంతికలశం
ప్రత్యమవుతుంది
ఆ దివ్య దీపమే ఉపాధ్యాయుడు
నిత్య చైతన్య స్వరమే ఉపాధ్యాయుడు
అనురాగరాగాల చల్లదనం పంచే అమ్మ
ఆత్మీయతా కాంతులు పంచే నాన్న
కరుణామృతాన్ని నిరంతరం పంచే దైవం
ఆ మూడు రూపాలకు ప్రతిరూపం అతడు!
అచేతనాన్ని కదిలించే
నవ్య చైతన్య ప్రవాహం
అజ్ఞానాన్ని పారద్రోలే
అనంత కాంతి తరంగం

- వెల్ముల జయపాల్ రెడ్డి
వల్లంపట్ల, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9441168976
**

ఆశాజీవి

నిప్పును ముట్టుకుంటే తప్పు అని తెలుసు
అయినా దానిని మనము వాడుతుంటాము
అది మనకు అవసరం కనుక!
తప్పును చేయటం మంచిది కాదని తెలుసు
అయినా తప్పు చేస్తూనే ఉంటాము!!
పరిస్థితులతో రాజీపడాలి కనక?
ఎంత సంపాదించినా చివరికి మిగిలేది శూన్యం
అయినా మనిషికి తాపత్రయం
మనిషి ఆశాజీవి కనక!!

- కోరుకంటి శశికిరణ్మయి
జ్యోతినగర్, కరీంనగర్
సెల్.నం.9440287740
**
మంచి పత్రికలు

మన ఆకృతిని
ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా
ప్రతిబింబించే అద్దాలతో పాటుగా
ఆకృతిని అతి చిన్నది గానూ,
మరీ పెద్దది గానూ,
భయద వికృతంగానూ,
పగిలిపోయి భాగ భాగాలు గానూ..
ఇట్లా రకరకాలుగా చూపించే
అద్దాలు ఎన్నో ఉండవచ్చు గాక!
మనం వీటిలో
ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబించే
అద్దాలనే ఇష్టపడతాం!
విస్తృతంగా విస్తరించి ఉన్న
సువిశాల ప్రపంచాన్నీ,
దాని యొక్క అంతరంగాన్నీ
చాక చక్యంగా గ్రహించి చూపించే
ప్రత్యేకమైన, అద్భుతమైన
అద్దాల వంటివి పత్రికలు!

- రఘువర్మ
జగిత్యాల, సెల్: 9290093933
**

ప్రేమంటే..!

ప్రేమంటే..
కలిసిన రెండు మనసులకు
అమృతం లాంటిది!
కల్మషం, స్వార్థం, ద్వేషాలకు
అతీతమైంది ప్రేమ!
ప్రేమంటే..
యువతీ యువకుల మధ్య
పురుడు పోసుకునేదే కాదు..
తల్లి దండ్రులు తమ
పిల్లల పట్ల చూపించే
అనురాగమూ ప్రేమే!
మానవత్వంతో..
పదిమందిని ఆదరించడమూ ప్రేమే!
దివ్యాంగుల పట్ల..
మమతను పంచడంలో ప్రేముంది!
ఏ ప్రేమైనా..
నిజాయితీ పునాదిపైనే నిలబడుతుంది!
నా మట్టుకు నేను..
మానవాళి మనుగడకు
దోహదపడేదే..
అసలైన ప్రేమగా భావిస్తాను!
దానికోసమే..
అనుక్షణం తపిస్తాను!

- ఎస్.్భరతి మూర్తి, మంచిర్యాల, సెల్.నం.9949777657
**
ఆధారం

నింగిలో ఎగిరే గాలిపటం
అందరికీ అందంగా వుంటుంది!
కానీ దానికె
ప్రాణాధారమైన దారం ఎవ్వరికీ
కన్పించదు!
నీటిలోని కలువ అందరినీ అలరిస్తుంది
ఆ కలువకు ఆధారమైన కాడ మాత్రం
ఎవ్వరికీ కన్పించదు!
చిరునవ్వే
మనముఖానికి శోభనిస్తుంది!
కానీ..
ఆ చిరునవ్వు వెనుక వున్న
అంతరంగం ఎవ్వరికీ తెలియదు!
కొవ్వొత్తి ఇంటినిండా..
కాంతులు వెదజల్లుతుంది
కానీ..
అది లేకుంటే
ఇక చీకటేనని తెలిసేది ఎందరికీ?

- సంగీతం శ్రీలేఖ
కరీంనగర్, సెల్.నం.8331956602
**

అమ్మా!

అమ్మా.. అమ్మా...
నినె్నక్కడని వెతకాలి?
నేనొక్కడినే ఎలా ఉండేది?
ఆకలిని తీర్చుకున్న
కన్నీటినే కడుపునింపుకుంటినమ్మా!
నీ ఒడిలో నిద్రించ నోచుకోక..
నేల మీదనే.. సేద తీరాను!
వేడి గాలి తాకుతుంటే..
అమ్మ జోల పాటగా భావించాను
ఎక్కడున్నావమ్మా!
ఇప్పటికైనా.. కరుణించ వస్తావా?

- శ్రీపాద వేంకటరాజం
జగిత్యాల, సెల్.నం.8977711465