ఉత్తర తెలంగాణ

గురుదక్షిణ ( బాలల కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోను మ్రోగడంతో - ‘హలో అన్నాడు. 80 ఏండ్ల వయస్సులో వున్న లక్ష్మయ్య సారు వణుకుతున్న గొంతుతో..
‘కలెక్టరును మాట్లాడుతున్న’
‘కలెక్టర్‌గారా.. అయ్యా నమస్తే సార్’
‘మీకు రేపు ఉదయం పది గంటలకు మా ఇంట్లో సన్మానముంది. తప్పక రావాలి’
‘సన్మానమా..ఎందుకు సార్’
‘ఎందుకో మీరొచ్చాక తెలుస్తుంది’ అని ఫోను పెట్టేశారు కలెక్టర్ గారు.
‘సాయిప్రసాద్!’ అని మనుమడిని పిలిచాడు లక్ష్మయ్య సార్.
‘ఏమైంది తాతయ్య’
‘కలెక్టర్ గారి నుండి ఫోను వచ్చిందిరా.. నాకు సన్మానం చేస్తారట. టీచర్స్ డే కాదు..స్వాతంత్య్ర దినోత్సవం కాదు..రిపబ్లిక్ డే కాదు. అదికాక, కలెక్టర్ గారి ఇంట్లోనట. ఉదయం పది గంటలలోపే వాళ్ల ఇంటికి రమ్మంటున్నారు’.
‘వెళ్దాం తాతయ్య. అక్కడకు వెళితేనే గదా..మనకు తెలిసేది. సరే రాత్రయింది. పడుకో తాతయ్య’ అన్నాడు.
ఆవలిస్తూ నిద్రకుప్రకమించాడు లక్ష్మయ్య సార్. ఉదయం నాలుగు గంటలకే నిద్రనుండి మేల్కొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సాయిప్రసాద్‌తో కలిసి బస్సెక్కి ఉదయం పదిలోపు కలెక్టర్ గారి ఇల్లు చేరాడు.
కలెక్టర్ గారు లక్ష్మయ్య సార్‌కు ఎదురుగా వచ్చి నమస్కరించి చేతిలో చేయి వేసి ‘మెల్లగా సార్’ అంటూనే ఎదురుగా గల సింహాసనాన్ని తలపించే కుర్చీలో కూర్చుండ బెట్టారు.
సాయప్రసాద్ దూరంగా వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. అధికార, అనధికారులతో ఆ ప్రాంతమంతా సందడిగా వుంది. ఇదంతా ఎందుకో లక్ష్మయ్య సార్‌కు అర్థవౌతలేదు.
కలెక్టర్ గారు లక్ష్మయ్య సార్ ప్రక్కన గల కుర్చీలో కూర్చున్నారు.
ఆయనకు ఎదురుగాగల టేబుల్ అలంకరించి వుంది. టేబుల్‌పైన కేక్ పెట్టి ఉంది. టేబుల్ పైన గల కేక్‌ను కలెక్టర్ గారు కట్ జేయడముతో ‘హ్యాపి బర్త్‌డే టూ యూ’ అంటూ కరతాళ ధ్వనులతో సభంతా మారు మ్రోగింది.
కట్ చేసిన కేక్ ముక్క కలెక్టర్ గారు మొదటగా లక్ష్మయ్య సార్ నోటికి అందించడంతో..
అప్రయత్నంగా వణుకుతున్న చేతితో లక్ష్మయ్య సార్ కూడా కేక్‌ను కలెక్టర్ గారి నోటికిందించాడు.
అనంతరము కలెక్టర్ గారు లేచి ముందుగా ‘లక్ష్మయ్య సార్ గారికి నమస్కారములు. సభలోని వారికి నమస్సులు. నా విద్యాభ్యాసము నల్గొండ జిల్లాలోని మక్కరాజిపేటలో జరిగింది.
నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు లక్ష్మయ్య సార్ గారి ప్రోగ్రాం చూశాను. ఆయన రిటైర్ అయిన తరువాత ‘బాల వికాసయాత్ర’ అనే పేరిట స్వచ్ఛందంగా అనేక స్కూళ్లకు వెళ్లి కథలు, పాటలు, పద్యాలు వినిపించేవారు. అందులో భాగంగానే మా ప్రాథమిక పాఠశాలకు వచ్చారు.
ముందుగా తనను తను పరిచయము చేసుకున్నారు. ‘పద్యం రస నైవేద్యం’ అని చెప్పడమేకాక, పద్యాల ఆవశ్యకతను చక్కగా వివరించారు. మన పూర్వీకులగు వేమన, జంధ్యాల పాపయ్య శాస్ర్తి పద్యాలు, ఇతర కవుల పద్యాలు కూడా కంఠతావచ్చేవి.
అనంతరము ‘అనగనగ రాగమతిశయిల్లుచునుండు’ అనే పద్యం వినిపించారు. ఈ పద్యం గురించి తెలుపుతూ అనగననగా రాగం వస్తుందని చెప్పడమేకాక, ఇంకా ఈ పద్యం గురించి వివరంగా ఇలా చెప్పారు.
ఆడగా ఆడగా ఆటవస్తుంది. చేయగా చేయగా నృత్యం వస్తుంది. వేయగా వేయగా బొమ్మలు వేయవస్తుంది. రాయగా రాయగా గుండ్రంగా రాయవస్తుంది. ఉపన్యాసము ఇవ్వగా ఇవ్వగా ఉపన్యాసము ఇవ్వవస్తుంది. చదువగా చదువగా చదువువస్తుంది.
అందుకే ‘శ్రద్ధయావర్థతే విద్య’ అన్నారు. శ్రద్ధ ఉండాలే గాని చదువులో సాధ్యము కానిదేది ఉండదు. కావాలనుకుంటే డాక్టరైనా, టీచరైనా, లాయరైనా, కలెక్టరైనా కావచ్చు. ఈ ధరణిలో సాధ్యము కానిదేది లేదు.
ఈ చివరి వాక్యము నన్ను బాగా ఆకర్శించింది. ఇదేకాక, ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని చెప్పేటప్పుడు చక్కగా సాధన ఉంటేనే సాధ్యం అని వివరించారు.
సాధిస్తే కానిదేది లేదని ఎందరో రుజువు చేశారు. వారంతా ఒకనాడు తరగతి గదిలో చదివిన వారే కదా అన్నారు.
ఇలా నా బాల్యంలో చదువుపై ఈ మంచి మాటలు బీజం వేసి, అది మొలకై, మహావృక్షమై నేను కలెక్టర్ అయ్యేటట్లు చేసింది లక్ష్మయ్య సార్. వారిని అందుకే నా పుట్టిన రోజున సన్మానించడానికి నిర్ణయించాను.
సార్ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు’ అని కూర్చున్నారు.
అటెండర్ అందించిన శాలువా లక్ష్మయ్య సార్‌కు కప్పి సన్మానించారు.
పది వేల నూట పదహారు రూపాయలు సమర్పిస్తూ ‘ఇది నా మొదటి వేతనం నుండి మీకు అందిస్తున్న గురుదక్షిణ’ అని లక్ష్మయ్య సార్ చేతికందిస్తూ పాదాభివందనచి చేశారు కలెక్టర్.
లక్ష్మయ్య సార్ కళ్లు ఆనందబాష్పాలతో నిండాయి. అక్కడకు చేరిన వాళ్ల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

- ఎన్నవెళ్లి రాజవౌళి తడ్కపల్లి, సిద్ధిపేట జిల్లా, సెల్.నం.9848592331