నెల్లూరు

నీతోనే నేను కథ బాగుంది (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో రేవతి గారు గొప్పగా మలిచిన నీతోనే నేను కథ చాలా బాగుంది. కథ చాలా చిన్నది కానీ అందులో దాగివున్న సందేశం ఎంతో గొప్పది. వాస్తవానికి దగ్గరగా, నేటి ఆధునిక సమాజంలో ప్రతి వంద ఇళ్లల్లో 70 ఇళ్లల్లో పరిస్థితి ఇలాగే ఉంది. వయస్సుమళ్లిన తల్లిదండ్రులను చూడాలనే తపన కుమారుల్లో ఎంతో కొంత దాగివున్నా వారి కుటుంబ పరిస్థితులరీత్యా చూడలేకపోతున్నారు. తల్లిదండ్రుల బాధలు వర్ణణాతీతంగా వున్నా చూసీచూడనట్లు తప్పించుకుంటున్నారు. కొందరు కోడళ్లు కూడా అత్తమామలను చీడపురుగుల్లా చూడడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది. కథలో చెప్పినవిధంగా అమ్మా నేను అసమర్థుడిని, నిన్ను నేను చూసుకోలేకపోతున్నాను, నాకంటే బయటివాళ్లే నయం అంటూ బాధపడి చివరికి ఆమె ఒడిలోనే ఆమెతోపాటూ కన్నుమూసిన కుమారుని దుస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. ఓ మంచి కథను అందించి ఆలోచింపజేసిన రచయిత్రి రేవతిగారికి కృతజ్ఞతలు...
- అనసూయ రావిపాటి, అద్దంకి
- వై.వి.వెంకటేశ్వరరావు, తిరుపతి
- కోయిల మంజునాధశర్మ, ఎ.టి.అగ్రరం,నెల్లూరు

గొప్ప అర్థాన్నిచ్చిన పరిశ్రమించు
ప్రతి మనిషి ఎలా ఉండాలో చక్కగా వివరించిన కవిత పరిశ్రమించు. రచయిత జ్ఞానేశ్వర్ గారు చిన్నచిన్న పదాలతో గొప్పగొప్ప అర్థాలతో కవితను రాసిన తీరు సూపర్. మనం చేసే పనిని ఫలితం ఆశించకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వెతుక్కుంటూ వస్తుందనే గొప్ప సందేశాన్ని గొప్పగా అందించిన రచయితకు అభినందనలు
- సన్నిధానం శాస్ర్తీ, తిరుచానూరు
- పద్మలత, గూడూరు
**

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net