విశాఖపట్నం

ఉత్తరాంధ్ర ఉరి తాడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణురియాక్టరు అంటే ఆటంబాంబు
అణువిద్యుత్ కేంద్రం అంటే భారీ ఆటంబాంబు
ఈ కేంద్రాల్లో వృథాగా భారీ రసాయనాలు
ట్రైషియం, స్ట్రోన్షియం, ప్లూటోనియంలు
ఇవి మట్టిలో, గాలిలో కలిసిపోయేవి
రంగు, రుచి, వాసన ఉండనివి
రెండు లక్షల సంవత్సరాల వరకుజీవం
అనంత జీవకోటి నాశనం
అణువులు మనిషిలో చేరితే మరణం
గర్భస్రావం, రక్త క్యాన్సర్, నపుంసకత్వం సహజం
మెదడు, నాడీ మండలానికి అనారోగ్యం
తరతరాలకు ఈ దు:ఖం సాధారణం
అణుప్రమాదం సంభవిస్తే సర్వనాశనం
త్రీమైలు ఐల, చెర్నోబిల్, పుకుషిమ మరణ మృదంగం
అణుప్రమాదం అణుబాంబుతో సమానం
ఆంధ్రపై అణుబాంబు రాబోయే కొవ్వాడ అణుకార్మాగారం
భూకంపాల వల్ల ఈ విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం
శ్రీకాకుళంలో కొవ్వాడ భూకంప పరిధిలో ప్రాంతం
ఒక రియాక్టరుతోనే ప్రమాదం
ఆరు రియాక్టర్లతో మరీ ప్రమాదం
యురేనియం ఉండే ఆస్ట్రేలియాలో ఈ కేంద్రం శూన్యం
మరి ఆంధ్రలో ఎందుకో ఈ చిత్రం?
- పల్లంటి రామకుమారరావు,
సెల్ : 9441344503.
**
అవినీతి అంతం?

ఓటుకు నోటు
ఆరంభం అవినీతి
నేతల నేరాల
నాణ్యత అవినీతి
పని రూటుకు రేటు
అధికారుల అవినీతి
కాల్‌మనీ కోరల్లో
కదిలింది అవినీతి
పనామీ సునామీలు
పాకిపోయిన అవినీతి
స్విస్ బ్యాంకు సొత్తు
సాధిస్తే అంతం అవినీతి
విజయవంతంగా సాగాలి
ఈ మహాయజ్ఞం
అవినీతి రహిత సమాజంతోనే
ఎల్లెడలా పురోగతి
అప్పుడే భూమి భారతి సాధిస్తుంది
అన్నింటా అభివృద్ధి

- సీరపు మల్లేశ్వరరావు
కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
సెల్ : 7680812592.
**
వాణి

శారద శిఖన వేణునాదాలు ఉన్నాయి
కదిపితే ఉవ్వెత్తున లేచి పడతాయి
నవ వసంత కోకిలలా మోగుతాయి
కళలకు తల్లివైనా
చదువులకు కల్పవల్లి
మంచి మనుషులను ఎంచుతుంది
తమ హృదయాల్లో చోటునిస్తుంది
తనకు లేనిది సాంఘికస్థాయి
బ్రహ్మకాలమే తనకు తొలిరేయి
కవితామూర్తులకు పెన్నిధి.

- కుబిరెడ్డి చెల్లారావు
చోడవరం, విశాఖజిల్లా
సెల్ : 9885090752.
**
అమ్మ భాష

కోకిలల
కుహు-కుహు ధ్వనులు
చిలకల
తీయని పలుకులు
పావురాయిల
తీపి మూల్గులు
కాకిపిల్లల
కావు కావులు
కోడి పుంజుల
కొక్కురోకోలు
మైనగోరల-
మంచిమాటలు
తెల్లకొంగల
గుసగుసలు
గుంట నక్కల
ఈలపాటలు
మృగరాజుల
ఘర్జనలను
గజరాజుల
ఘీంకారాలు
ఎప్పుడైనా
మానుకొనునా
పరధ్వనులను
నేర్చునా అని
పక్షులు - మృగాలు చూడు
అమ్మ భాషను
పూజిస్తాయి
ప్రాణులలో
తెలివైనవాడే
అమ్మ భాషను
మరచి నీవు
పరభాషల నేర్వనేల
నరనరాల పల్లవించే
అమ్మభాషను పూజించు
అమరుడలే - జీవించు

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి
అనకాపల్లి
9246666588