విజయవాడ

మానవతే తరగని నిధి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రిన్స్ ద గ్రాండ్’ ఇంటర్నేషనల్ హోటల్ కమ్ లాడ్జి 5వ అంతస్తును పోలీసులు చుట్టుముట్టి విజల్స్‌తో హోరెత్తించారు. నిత్యం అత్యంత రద్దీగా వుంటే బిగ్‌బజార్ వద్ద జనం క్యూలో చికాకుగా తిరుగుతూ తమాషా తిలకిస్తున్నారు. మహిళల ముఖాలకు ముసుగులు తగిలించి బిలబిలమంటూ రోడ్డు మీదకు వచ్చి, అప్పటివరకు ముసుగులో వున్న బోడిగుండు వ్యక్తిని పోలీసు అధికారి ప్రజలకు చూపించాడు. ‘మీకు గౌరవప్రదమైన ఉద్యోగం కల్పించి మహారాణులుగా చేసి ప్రిన్స్ హోటల్స్‌ను తలదనే్న వైస్రాయి హోటళ్లలో కాపురాలు పెట్టించి స్వర్గసీమలో విహరింపచేస్తాం’ అంటూ మహిళలతో ఘరానా వ్యాపారం చేస్తున్న ఒకప్పటి సినిమా ప్రొడ్యూసర్ ఈ పెద్దమనిషి’ అని చెపుతూ గట్టి బందోబస్తు మధ్య మహిళలు సహా పోలీసు వాహనంతో తీసుకెళ్లాడు.
పోలీసు స్టేషన్‌లో మహిళలకు వేసిన ముసుగులు తొలగించి బోడిగుండు వ్యక్తిని పోలీసు అధికారి ప్రశ్నించడం ప్రారంభించాడు.
‘ఈ పాతిక మంది ఆడవాళ్లను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్ గుండూ భాయ్?’ అంటూ చాకచక్యంగా కౌనె్సలింగ్ ప్రారంభించాడు యువ పోలీసు అధికారి.
‘అయ్యా! మహిళలను సరఫరా చేసే ఏజెంట్ల ద్వారా వీరిని పట్టుకొచ్చాను సార్’ అన్నాడు గుండు వ్యిక్తి.
పోలీసు అధికారి ఒకరు కుర్చీలో నుంచి లేచి, యుక్త వయసులో వున్న ఒక అందమైన అమ్మాయి దగ్గరకొచ్చి నిల్చున్నాడు. ఆమె భయపడుతూ ‘పెద్దాపురం సమీపంలోని గ్రామం నుండి మహిళా మండలి నాయకురాలు నన్ను ఒక మధ్యవర్తికి అప్పగించింది సార్’ అని చెప్పింది.
‘నీకు పెళ్లయ్యిందా?’ అడిగాడు అధికారి.
‘అయ్యింది సార్! ఎయిడ్స్‌తో మా ఆయన చచ్చిపోయాడండీ’ చెప్పిందామె.
అలా వరుసగా మహిళలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు అధికారి రాబట్టాడు. బోడిగుండు మనిషి మహిళలకు డబ్బులేమైనా ఇచ్చాడేమో తెలుసుకునేందుకు అందరినీ వరుసగా ఒక్కొక్కరిని పోలీసు మర్యాదలతో వాకబు చేశాడు.
‘ఇప్పుడే అన్నం తిందామని అందరం ఒకేచోట కూర్చున్నాం సార్. ఇంతలో పోలీసులు వస్తున్నారు, సర్దుకోండి.. అంటూ ఈయన మమ్ములను భోజనం తిననియ్యలేదు సార్’ అంటూ బిక్కముఖంతో చెప్పింది ఓ మధ్యవయస్కురాలు. పోలీసు అధికారుల సమక్షంలోనే మహిళలంతా భోజనం చేశారు.
‘మీ అందరికీ ఏదోఒక పని కల్పిస్తామనీ, విదేశాల్లో ధనవంతులుగా మారుస్తామని మాయమాటలతో మభ్యపెట్టాడు కదూ!’ అడిగాడు పోలీసు అధికారి.
ఇంతలో ఒక అమ్మాయి ధైర్యంగా లేచినిల్చుని ‘నేను నాటకాల్లో వేషాలు వేస్తూ పొట్టపోసుకుంటున్నాను సార్. కల్తీసారా తాగి నా భర్త ప్రభుత్వ ఆసుపత్రిలోనే చనిపోయాడండీ. శవాన్ని బైటకు తీసుకు రావడానికి గేటు కాపలావాళ్లకు తబ్బులు ఇవ్వలేక అక్కడే వదిలిపెట్టాం సార్’ అంటూ ఏడుస్తూ వివరించింది. పోలీసు అధికారి ఆమెను ఓదార్చాడు.
మహిళలందరినీ పోలీసు వ్యానులో ఎక్కించి రాజానగరంలోని మహిళా ప్రత్యేక కోర్టుకు తరలించారు. మహిళలపై పోలీసులు తయారుచేసిన చార్జిషీటును సీనియర్ మహిళా జడ్జికి సమర్పించారు.
‘డబ్బుకు ఆశపడి మీరంతా చట్టం నిషేధించిన వ్యభిచార వృత్తిలోకి దిగారు. ఇలా తేలికగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏమిటి?’ అంటూ జడ్జి ప్రశ్నించారు.
‘మాకు బతుకుదెరువు చూపిస్తానంటూ ఈ బోడిగుండు మనిషి నమ్మించాడు మేడమ్. విదేశాలకు తరలిస్తుండగా పోలీసులు మమ్ములను పట్టుకున్నారండీ’.. అంటూ అందరూ పెద్దగా రోదిస్తూ చెప్పారు.
‘మహిళా హక్కుల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేకంగా రూపొందింన నిబంధనల ప్రకారం మహిళలు గౌరవంగా జీవనం గడపడం కోసం ప్రభుత్వం వృత్తివిద్యలు నేర్పించాలి. అసహాయులు ఎవరి పైనా ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతిగృహల్లోనే నివసించే సౌకర్యం కల్పించాలి. మహిళలకు ప్రభుత్వమే బతుకుదెరువు చూపించాలి’ అంటూ మహిళల హక్కులను వివరించారు.
‘అమ్మగారూ! నేను నాటకాలు వేస్తూ పాటలు పాడుతూ బతుకుతున్నాను. మీరు అంగీకరిస్తే ఒక పాట పాడతాను’ అని అభ్యర్థించింది. మహిళా న్యాయమూర్తి అనుమతించారు.
‘మచ్చలేని మహిళల జీవితానికి
మానవత్వమే తరగని ఆస్తి
అదే మన జీవిత పరమావధి’.. అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. మహిళల మనోవేదన న్యాయమూర్తిని కదిలించింది. న్యాయమూర్తి ఆదేశం మేరకు పోలీసులు బాధిత మహిళలను ప్రభుత్వ రక్షిత గృహాలకు తరలించారు.

డిఆర్ రాజ్‌పాల్, తెనాలి, గుంటూరు జిల్లా. చరవాణి: 9502632202