దక్షిన తెలంగాణ

కవిత్వం సమాజాన్ని ప్రతిబింబించాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ రచయత శీలం జగతీధర్
**

కవిత్వంలో సమాజాన్ని ప్రతిబింబింప జేయాలని ఆకాంక్షించే సీనియర్ రచయిత శీలం జగతీధర్ జగిత్యాల వాసి! రచనా వ్యాసాంగంతో గత కొన్ని దశాబ్ధాలుగా మమేకమైన రచయిత జగతీధర్ వృత్తిరీత్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి హిందీ ఉపన్యాసకులుగా ఉద్యోగ విరమణ చేశారు. తమ విశ్రాంత జీవితాన్ని పూర్తిగా సాహిత్య సృజనకు అంకితం చేసిన ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...

ఆ రచనల పట్ల ఆకర్షితులు కావడానికి మీకు
ప్రేరణనిచ్చింది ఎవరు?
మా నాన్నగారు.. ఆయన స్ఫూర్తితోనే రచనలు ప్రారంభించాను.

ఆ మీరు ఎప్పుడు మొట్టమొదటి రచన చేశారు?
మూడు దశాబ్దాల క్రితమే రచనలు చేయడం మొదలుపెట్టాను.

ఆ మీ మొట్టమొదటి ముద్రిత గ్రంథం ఏది?
‘స్ఫూర్తిప్రదాత’ మా నాన్నగారి జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ రాశాను.

ఆ మీ మిగతా ముద్రిత రచనలు ఏమిటి?
రెండో గ్రంథంగా ‘ఆంజనేయ చరిత్ర’ పేరుతో వెలువరించాను.. అనేక సాహితీ పత్రికల్లో కవితలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, సాహిత్య విమర్శలు రాశాను.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
ఛందోబద్ధ కావ్యాల నుండి మనం చాలా మందిమి నేడు వచనం వైపు మొగ్గుచూపిస్తున్న నేపథ్యంలో..కవిత్వంలో గాఢత కొరవడకుండా చూడాల్సి వుంది. కవిత్వం సమాజాన్ని ప్రతిబింబింపజేయాలి. హృదయాంతరాల్లోంచి పెల్లుబికి వచ్చే భావజాలమే కవిత్వమని నాభావన..

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై మీ
అభిప్రాయం?
ఇప్పుడు వస్తున్న వచన కవిత్వం కొంతవరకు చిక్కగా వస్తున్నప్పటికీ..చాలా మంది కొత్తవారు తమ పేరును అచ్చులో చూసుకోవాలన్న తపనతో..వాక్యాలను పంక్తులుగా పేర్చి దానే్న కవిత్వమని కనీస ప్రమాణాలు పాటించకుండా..శిల్పం..అభివ్యక్తి విషయాల్లో శ్రద్ధ చూపకుండా రాయడం వల్ల సాహిత్య ప్రయోజనం శూన్యమని నా అభిప్రాయం..కవిత్వం సామాజిక చైతన్యానికి దోహదపడేలా ఉంటే బాగుంటుంది.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
అనేక మంది తెలంగాణ కవులు, రచయితల రచనలు మరుగునపడి ఉన్నాయి. వివిధ కారణాల వల్ల వారు, వారి రచనలు వెలుగులోకి రాలేదు.. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ద్వారా ఈ దిశలో కృషి జరిగితే.. కొన్ని రచనలైనా ముద్రణకు నోచుకుంటాయి. అలాగే కవులు, రచయితలు తమ ప్రాంతాల్లో ఇలా వెలుగు చూడాల్సిన రచనల వివరాలు సేకరించి.. వాటిని పరిష్కరించి ప్రచురణకు చొరవ చూపాలి. నేటి కంప్యూటర్ యుగంలో సనాతన గ్రంథాలు మరుగున పడుతున్నాయి. వాటిని కూడా భావి తరాలకు అందించడానికి ప్రయత్నం జరగాలి. తెలుగు భాషలోనే కనీసం పదో తరగతి వరకు విద్యాబోధన జరిగేలా చూడాలి.

ఆ సాహిత్య పురస్కారాలపై మీ
అభిప్రాయం?
పురస్కారాలు అవసరమే..అవి కవులు, రచయితలకు ప్రోత్సాహాన్నిస్తాయి. బాధ్యతను పెంచుతాయి. అయితే పురస్కార ఎంపికలో పారదర్శకత అవసరం.

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేయాలంటే మీ సలహాలు, సూచనలు ఏమిటి?
సాహితీ సంస్థలు గ్రంథావిష్కరణలు..పురస్కార ప్రధానాలకే పరిమితం కాకుండా సాహితీ వ్యాప్తికి కొత్తగా కలం పట్టే వారికి మార్గదర్శకంగా వుండడానికి తక్కువ మంది సభ్యులతో కమిటీ వేసుకోవాలి. సమన్వయంతో కార్యక్రమాలు యోజన చేసి నిర్వహించాలి. అవసరమైతే సమాజంలోని ప్రముఖులను, అనుభవజ్ఞులను సంస్థలో చేర్చుకోవాలి. వారి సేవలను కూడా వినియోగించుకోవాలి.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
కొత్త కవులు, రచయితలు సమాజాన్ని సునిశితంగా పరిశీలించాలి. మన చుట్టూ వున్న సమస్యలను ఆకళింపు చేసుకోవాలి. వాటిని రచనల్లో ప్రతిబింభించి..పరిష్కారమార్గాలను సూచించగలగాలి. వివిధ ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండాలి. ఇతర భాషల సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాలి. కాలక్షేప కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలి. కీర్తి కాంక్షను ప్రక్కన పెట్టి సామాజిక చైతన్యమే ధ్యేయంగా తమ కలాలకు పని కల్పించాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
**
శీలం జగతీధర్
రిటైర్డ్ లెక్చరర్
ఇం.నం.1-2-61/1
జగిత్యాల-505327
సెల్.నం.9849284349
**

సాహిత్య సమాచారం

సాహితీ గౌతమి నూతన కార్యవర్గం
కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శిగా గాజుల రవీందర్, సహాధ్యక్షులుగా రామక విఠలశర్మ, ఉపాధ్యక్షులుగా ఎ. గజేందర్‌రెడ్డి, కూకట్ల తిరుపతి, ఎస్.నాగేంద్ర శర్మ, కార్యదర్శులుగా డా. కె. రామకృష్ణ, బూర్ల వెంకటేశ్వర్లు, ఎస్.గంగాధర్, కోశాధికారిగా గంప ఉమాపతి, ప్రచార కార్యదర్శిగా కొత్త అనిల్‌కుమార్, మహిళా ప్రతినిధులుగా ఇస్రత్ సుల్తానా, డా. అడువాల సుజాత ఎన్నికయ్యారు. వీరితో పాటు పదకొండు మంది కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు. ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
**

పుస్తక సమీక్ష

వైవిధ్యంగా రూపుదిద్దుకున్న పద్యకావ్యం!

ప్రతులకు:
డాక్టర్ వి.రజనీగంగాధర్
11-14-467
తక్షశిల హైస్కూల్‌వద్ద
సిరినగర్ కాలనీ
ఎల్.బి.నగర్,
హైదరాబాద్ - 500074
సెల్.నం.9290680605
**
క్రమంగా పద్య కవులు తగ్గుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల నాలుకలపై నాట్యం చేసే పదబంధాలను, గ్రామ్య మాండలీకాలను, వ్యవహరికాలను పద్య ఛందస్సులో బంధిస్తూ వైవిధ్యంగా ‘కాహళిక’ పద్య కావ్యాన్ని రూపుదిద్ధి..కవి పూసల రజనీ గంగాధర్ ఓ కొత్త ప్రయోగానికి తెరలేపారు. వ్యాకర్తలు లోగడ ప్రయోగించని కొన్ని యతులను స్వతంత్రించి ప్రయోగించినారు. శబ్ధ సౌమ్యముండుటచే ఫ, ఫ, బ, భ,వలకు మమకారంతో యతిని ప్రయోగించారు. అంతేగాక..న,మ,లకునూ యతిని స్వతంత్రంగా సమర్థిస్తూ రాసిన ‘కాహళిక’లో 26 ఖండికల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను జొప్పిస్తూ..పద్యాలను హృద్యంగా అల్లడంలో..కవి సఫలీకృతులైనారు. మాతృ భాషామృతం ఖండికలో..మాతృభాష పునాది పైననే..అనేక భాషలెన్నింటినైనా అమర్చవచ్చని తేల్చి చెప్పారు. ఆంగ్ల భాషపై వ్యామోహంతో..మాతృభాషను మరిచిన వారందరూ మాతృ హంతకులని ఓ పద్యంలో వ్యాఖ్యానించారు.
‘కామయాగం’ ఖండికలో..కవి రాసిన పద్యాలు ఆలోచనాత్మకంగా వున్నాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పట్టాయి. సృష్టికే అందం స్ర్తిమూర్తి అన్నది సత్యమనీ..స్ర్తియే లేకుంటే సృష్టే లేదని నొక్కి చెప్పారు.
ఇంటికి దీపమ్ము ఇల్లాలు అంటూ..ఇంట్లో దాసిగా చూడటాన్ని ఎండగట్టారు. జంతువులు, పక్షులు, చీమలు ప్రకృతి ధర్మం పాటిస్తూ నియమిత రుతువుల్లోనే సంగమిస్తాయనీ..వాటికున్న ఇంగితం మనుష్యులకు లేక..వావి వరసలు మరిచి..చిన్నా..పెద్దా.. ముదుసలి అన్న తేడా లేకుండా..మృగాళ్లుగా మారుతున్న సంఘటనలను ఆయా పద్యాల్లో ఆవిష్కరించిన తీరు బాగుంది.
‘రైతు భారతం’ ఖండికలో కవి రైతన్న వ్యధలను ఏకరువు పెట్టారు.
‘ని శీథి కన్య’ ఖండికలో కవి సరళమైన పదబంధాలతో పద్యాలను అల్లి పాఠకులను మెప్పించారు.
‘జాతస్య మరణం ధ్రువం’ ఖండికలో..కవి తమ తాత్త్వికతను ప్రదర్శించారు.
‘స్వప్నబాలిక’ ఖండికలో సీమంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రదర్శించి విసంధులు, దుష్ట సమాసాలను సందర్భోచితంగా ప్రయోగించారు. ఈ ఖండిలో ఆడపిల్లల వలన కన్న బిడ్డకు..కన్నవారికి వున్న కష్టాలను పద్యాల్లో బంధించారు. ఇలా..వీటితో పాటు, బందీయైన కోయిల, నేను కవి కార్మికున్ని, మహాకవి దాశరథి, అపర చాణక్య పాములపర్తి, పుష్కర కృష్ణ, నటరత్న నందమూరి, రాయల యుగం, పసిడికాంతులు రేపటి పౌరులు, స్వగతం, పితృవందనం, మనుజులంతా ఒక్కటే, కవి కోకిల, ఆత్మఘోష, ఆంధ్రకేసరి, పద్యసౌరభం, మార్గదర్శి మన దామోదరం, పూర్వాంధ్ర వైభవం, కాహళిక, సిరిమువ్వలు, శ్రీ గురుభ్వోనమః, అమ్మ, తదితర శీర్షికలతో రాసిన పద్యాల్లో అలతి అలతి పదాలను ప్రయోగిస్తూ చక్కని భావాలను ప్రకటించారు. కవి డాక్టర్ పూసల రజనీ గంగాధర్ గారి ఈ కొత్త ప్రయోగం పద్యకవుల సంఖ్య పెంచడానికి ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూద్దాం..అంతేగాక ఆయన చేసిన కొత్త ప్రయోగం కాలాన్ని ఎదురొడ్డి నిలుస్తుందని ఆశిద్దాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544