ఉత్తర తెలంగాణ

పల్లె వెలుగులు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధ అమరనాథ్‌కు స్వయానా మేన కోడలు. తల్లి లేని పిల్ల, మూడు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమర్ అక్క మాధవి క్యాన్సర్ వ్యాధితో కనుమూస్తే తను భార్య అంజలితో కలిసి వెళ్లి తన ఇంటికి తెచ్చుకొని స్వంత కూతురులా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అత్తయ్య మామయ్యలు అప్పుడప్పుడే కళ్లు తెరిచిన ఆ పసిదానికి అమ్మా నాన్నలయ్యారు. బుద్ధిమంతురాలిగా పెరుగుతున్న రాధపై ఈగ కూడా వాలనివ్వరు ఆ ఆలుమొగలు. రాధకు నాలుగేళ్లు వచ్చేసరికి అంజలికి గర్భం. పండంటి కొడుకు పుట్టాడు. పెళ్లైనంక చాలా కాలం తరువాత కలిగిన మొట్టమొదటి సంతానం కనుక వారి సంతోషానికి అవధుల్లేవు, ఊరంతా పిలిచి పెళ్లి వైభోగంలా పురుడు సందడి చేశారు. కాలచక్రం తిరుగుతుంది. పిల్లలిద్దరూ అక్కా తమ్ముల్లా చూడ ముచ్చటగా పెరిగి పెద్దవుతున్నారు.
స్కూల్ వదిలిన రాధ ఇంటర్ కై కాలేజీలో చేరింది. యుక్తవయసు వచ్చినా రాధకు చదువు మీదనే ధ్యాస. డాక్టర్ కావాలనే పట్టుదలతో మంచి ర్యాంకు తెచ్చుకొని మెడిసిన్లో ఫ్రీ సీటు సంపాదించింది. హైదరాబాద్‌లో మంచి కళాశాలలో చేరింది. అమర్ రాధని ఆడపిల్లల హాస్టల్‌లో చేర్పించాడు. మొదట కొంత కొత్త కొత్తగా, బెరికిగా అనిపించినా రోజులు గడుస్తున్న కొలది అమ్మా, నాన్నలను వదిలి వుండడం అలవాటు జేసుకుంది. మొదట్లో నాన్న వారానికోసారి వచ్చి వెళ్లేవాడు. తరువాత తరువాత రావడం తగ్గించాడు.
ఓ ప్రత్యేకత..గుర్తింపు కొరకు ఎప్పుడు కష్టపడే మనస్తత్వం తనది. అమ్మా, నాన్నలకు తను ఓ గొప్ప డాక్టర్ కావాలనే కల, అ నెరవేర్చాలని రాధ అహర్నిశలు కృషి! ఐదేళ్లు అలవోకగా గడిచిపోయాయి. ఫలితాల్లో ఫస్టు ర్యాంక్ సాధించింది. మూడు బంగారు పతకాలు కూడా తన ఖాతాలో చేరాయి. అనుకున్నది సాధించాలనే తపనో..ఏమో, ఆ వయసులో ఎంతో మంది ఆ కాలేజి అబ్బాయిలు ఎంత ప్రయత్నించినా ఎవరి వైపు తను మొగ్గలేదు. లక్ష్య సాధన తప్ప వేరే ధ్యాసే లేదు రాధకు, హాస్టల్ ఖాలీ చేసి తన ఊరికి వెళ్లిన మరునాడు ఉదయం ఎనిమిది గంటలకే..
‘హాయ్! దిస్ ఈజ్ గోపి! మీ పేరు రాధ అనుకుంట. ఎప్పుడో చిన్నప్పుడుమిమ్మల్ని మన స్కూళ్లో చూసినట్టు గుర్తు. అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటి ముందు కూర్చొని న్యూస్ పేపర్ తిరగేస్తున్న రాధ తలెత్తి చూసింది. తలెత్తి అటు వైపు చూసిన రాధకు..ఆశ్చర్యం! ఎక్కడా, ఈ మధ్యన ఎప్పుడు వినని గొంతు. గుర్తు తెచ్చుకోవటానికి రాధ ప్రయత్నించింది, కాని లాభం లేకపోయింది.
‘నేను మా అత్తయ్యతో అమెరికాకు వెళ్లిపోయాను. ఆ తరువాత మనం కలువలేదు అక్కడే మెడిసిన్ పూర్తి చేశాను. మాది మీ పక్క ఊరేనండి. నిన్ననే ఇండియాకు తిరిగొచ్చాను. రాధ ఏదో అడిగే లోపలే మళ్లీ చెప్పాడు గోపి. అమెరికాలో చదివొచ్చినా మనిషి చూస్తే చాలా మర్యాదగా హుందాగా వున్నాడు. అయినా ఇంటి ముందుకు వచ్చి గ్రీట్ చేసిన వ్యక్తిని అంతే మర్యాదగా..చాలా చిన్నప్పుడు గదా! గుర్తు రావడం లేదు. ఫరువాలేదు..్ఫ్లజ్ రండి..కూర్చోండి! లేచి నిలబడి ఎదురుగా వున్న కుర్చీ వైపు చూపించింది. ‘ఏమ్మా రాధా! బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు. ఎవరే అతను? అడిగేశాడు అమర్ ప్రశ్న మీద ప్రశ్న.
‘నాన్నా, ఇతను గోపి అని..ఇంకా ఏదో చెప్పే లోపలే..కొంచెం తొందరలో ఉన్న అమర్ ఏమి వినిపించుకోలేదు. అప్పటికే దగ్గరగా వచ్చిన రాధతో మెల్లగా..
‘ఓ అలాగా! అయితే..మీరు మాట్లాడుతూ వుండండి..అమ్మకు చెప్పి టిఫిన్, టీ లాంటివి ఇవ్వు. నేను పక్క ఊర్లో నా ప్రాణ స్నేహితుడు శంకరం.. అదేశంకరం మామయ్య నీకు తెలుసమ్మా..వాడి ఇంటికోసారి వెళ్లి వస్తానమ్మా వాళ్ల ఊరు మహా ఉంటే ఓ రెండు కిలోమీటర్లు, మోటర్ సైకిల్ పై పది నిమిషాల ప్రయాణం. వాడి ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో పై చదువులు ముగించుకొని వచ్చిండట. అమెరికాలో వాడి చెల్లెలు దగ్గర పెట్టి చదివించాడు గదా. ఎప్పుడో పదేళ్ల కింద వాన్ని చూశాను. ఇప్పుడు గుర్తు పట్టలేనమో, ఓ సారి పలకరించి వస్తానమ్మా!
సరే, నాన్నా!
అమర్ గబగబా మోటర్ సైకిల్‌పై వెళ్లిపోయాడు. మరు నిముషమే రాధ గోపి వైపు తిరిగి..
‘గోపి గారు, ప్లీజ్ కం ఇన్సైడ్. విల్ హావ్ సం బ్రేక్ఫాస్ట్, టీ అండ్ చాట్!’
‘ఓ..్థంక్స్! హాఫ్, ఐ ఆమ్నాట్ ట్రబులింగ్ యు!’
ఇద్దరు లోపలికి వెళ్లి అంజలి చేసి పెట్టిన వేడి వేడి దోసలు తింటూ కాసేపు వాళ్ల స్కూల్ కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట గడిపేశారు. ఇంతలోనే మోటర్ సైకిల్ తిరిగొచ్చిన చప్పుడు. అమర్‌తో పాటు వెనకే శంకరం.
‘ఓ.. డాడ్! మీరిక్కడ?’ ఇప్పుడు ఆశ్చర్యపోవడం గోపి వంతు!
అవును, నువ్విక్కడికొచ్చావని తెలిసి నేనే అమర్ మామయ్య వెంబడివచ్చాను. కాసేపట్లో మన డ్రైవర్ కాక తెస్తాడు. ఆ తరువాత భోజనానికి ఇంటికెల్దాం. అంతవరకు మీరు మాట్లాడుకోండి. ఈ లోపల మామయ్య నేను కాఫీ తాగుతాం. అంటూ ఇద్దరు స్నేహితులు ఇంటిలోపలికి వెళ్లిపోయారు. ఇక్కడ పిల్లలు, అక్కడ పెద్దవాళ్లు చాలా విషయాలు చర్చించుకున్నారు. ఓ గంట తరువాత గోపి, శంకరం వెళ్లిపోయారు.
ఓ వారం రోజుల తరువాత ఆ రెండు ఊళ్లకు కళ్యాణ శోభ..గోపి, రాధల పెళ్లి! చాలా శోభాయమానంగా, ఏదీ తగ్గకుండా ఆడంబరంగా పెళ్లి జరిపించారు. మొదటి రాత్రి గోపి వాళ్లింట్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాధ, గోపీలు ఇద్దరినీ గదిలో వేసి తలుపేసారు. గోపి రాధను సమీపించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. అంతలోనే రాధ అతనికి దూరం జరుగుతూ.. మీరు మన పెళ్లికి పెట్టిన షరతులను మర్చిపోయినట్టున్నారు. మన రెండు గ్రామాల మధ్య నెలకొల్పాల్సిన హాస్పిటల్ సంగతి గాలికొదిలేసారా? అంది. ‘లేదు రాధ! మరచిపోవడము. మాట తప్పటం నా రక్తంలోనే లేదు. మనమనుకున్న ప్రకారం నేను అమెరికా తిరిగి వెళ్లను. ఇక్కడే మన రెండు ఊళ్ల మధ్యలో ఓ పెద్ద హాస్పిటల్ కడదాం. మనతో బాటు కొంత మంది స్పెషలిస్టు లను ఇక్కడకు రప్పించి చుట్టుపక్కల వున్న పల్లె జనాలకు మంచి వైద్యమందిద్దాం. దీనికి మా నాన్న, మీ నాన్న ఇద్దరు ఒప్పుకున్నారు. నేను రేపే సిటీకి వెళ్లి ఓ మంచి ఆర్కిటెక్ట్‌ను సంప్రదిస్తాను. ఓ రెండు నెలల్లో ముహూర్తం పెట్టి పునాది రాయి వేద్దాం. ఇక రెండవది. మనం అనుకున్నట్టు అదే రోజు మనకు శోభనం రాత్రి! గోపీ పెళ్లికి ముందు రాధకిచ్చిన మాట ప్రకారం గంభీరంగా వివరిస్తూ రాధను దగ్గరికి తసీకున్నాడు. సంతోషంతో కళ్ల నిండా నీళ్లు సుళ్లు తిరుగుతుంటే రాధ ఇక ఆపుకోలేక గోపి కౌగిట్లో ఒదిగిపోయింది.
‘కానీ రాధా, బయట ప్రపంచానికి మాత్రం మన శోభనం ఈ రోజే! అన్నాడు గోపీ.
పెద్దలు ‘హానీమూన్’కు అంతా సిద్ధం చేసారు. కానీ రాధ, గోపీలు ఇద్దరు ఒప్పుకోలేదు. ఇపుడు కాదదు తరువాత..ఓ రెండు నెలలు గడిచాక అమెరికా వెళ్తాం హానీమూన్‌కి అని ఏదో ఒక కారణం పెద్దవాళ్లకు చెప్పి దాటించేశారు.
**

ఆచార్య కడారు వీరారెడ్డి హబ్సిగూడ, హైదరాబాద్ సెల్.నం.9392447007