నెల్లూరు

నేనూ నీలాంటి మనిషినే (కవిత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూస్తూన్నా, చూస్తూన్నా, చూస్తూ చస్తూనే ఉన్నా
మరిచిపోయిన మనువుకాలం నాటి ధర్మాలను
మరల మరల వల్లెవేస్తూ, మానని గాయంలా రేపుతూ
నా విలువల వలువల్ని ఊడదీసి
విలాసాల వీధుల్లో విపణి బొమ్మను చేశారు
నేనుకూడా రక్త మాంసములతో కూడిన మనస్సు ఉన్న
పదార్థాన్ని అన్న విషయాన్ని ఉప్పుపాతరేసి
అవసరాల కోసం అత్యాచారాలను నిస్సుగ్గుగా చేస్తున్నారు
నేను అబలను అంటూ మాటిమాటికి
నా ఆత్మాభిమానాన్ని
దెబ్బతీస్తూ నీ కాలికింద చెప్పులా ఉంచేస్తున్నావు
సమస్త ప్రపంచం పుట్టుక, పోషణ నా ద్వారానే అయినా
నేను ఎప్పుడూ గర్వంగా తలెత్తలేదు
గోరుముద్దల నాటినుండి అనగా అనగా ఒకరాజు
రాజుకు ఏడుగురు కొడుకుల కథలే తప్ప
రాజుకు గల కూతురు కథ ఎవ్వరూ నేర్పించనే లేదు
నీకు అమ్మాయి అంటే అంత అలుసు
నీ లోదుస్తుల నుండి, నీవు వాడుకొనే స్ప్రే మొదలు
నీ గడ్డం గీసుకున్నపుడు కూడా నేనే మోడల్‌ని
నీ చంకలోసువాసన కోసం పరిమళాన్ని అద్దుకుంటే
నీతో పడుకోవడం కోసం నేను వెంపర్లాడే యాడ్లు
సరికొత్త ఫ్యాషన్ అంటూ
మూడేళ్ల పాపకు వేసే గౌనును
రెండు పదుల పడుచుకేసి పిల్లినడకలు నడిపిస్తున్నారు
టు పీస్‌లు, సింగ్‌ల్ పీస్‌లు, బికినీలు ఆపై న్యూడ్‌లు
నేను మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లెలు లాంటిదాన్ని అయినా
మీ కనురెప్పల కింద కామపు సిసి కెమేరాలు
నా దేహంలోని అంగాంగాన్ని అంగుళం అంగుళం
క్షణక్షణము స్కానింగ్ చేస్తూనే ఉన్నాయి
నేను నిరంతరం గమనిస్తూ అసహ్యించుకుంటూనే ఉన్నాను
నాకు ఎన్నోసార్లు గొంతెత్తి అరవాలనిపిస్తుంది
లోపల అస్థిపంజరం నీకు నాకు ఒక్కటేరా అని

అంతులేని అంతర్జాలంలో లెక్కలేని సైట్లలో
కబేళాకు పోయే పశువుల కన్నా హీనంగా
నా రహస్యాన్ని విశృంఖలత్వం చేసి పారేస్తున్నారు
ఓలి, కప్పం, రుణం, పరిధి ఏవేవో వింత పేర్లుతో
శీలం అనే శూలాన్ని నాకు మాత్రమే గుచ్చివేసి
మీరు మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు
అమానుష సంఘటనల రాత్రుళ్లకి మసి దీపపు
గబ్బిలాల లాగా ఎగబడుతున్నారు
ఇంట్లో, బళ్లో, గుళ్లో, బస్సుల్లో, రైళ్లలో ఏమని చెప్పను
వావి లేదు, వరుస లేదు, చిత్తకార్తె కుక్కల్లా కరుస్తుంటే
ఎన్నిచోట్ల నేను నా రక్షణ కోసం
నా చుట్టూ పట్టుపురుగులా
గూళ్ళు కట్టుకోను, అమీబాలా ఒదిగిపోను
ఓరే బాబు, నీవు మగాడివి అని నేను తల్లినైతేనే
గుర్తించేది
నీ మగతనం కోరిక నీ భార్య అనురాగములో తీర్చుకో
అంతేగాని కనబడే అతివలందరితో కాదు
నేను తిరగబడితే ఆదిపరాశక్తిని అవగలను
దుర్గుణాలను దునుమాడే దుర్గను కాగలను
నీ వికారపు అంగాలన్నీ ఉత్తరించి
బృహన్నలను చేయగలను
అంతదాకా తెచ్చుకోకు నేస్తం
నాకేమి అలివిమాలిన స్వేచ్ఛ వద్దు
ఆకాశంలో సగం వద్దు
నేను కూడా మనిషినే అని గుర్తిస్తే చాలు

- గర్నెపూడి వెంకటేశ్వరరావు, మార్టూరు
చరవాణి : 8341169772

**
స్పందన

దేవుడిచ్చిన వరం
గతవారం మెరుపులో రచయిత జ్ఞానేశ్వర్ గారు అందించిన దేవుడిచ్చిన వరం...కథ చాలా బాగుంది. కథలో విశ్వమోహన్, ఆదిత్య మధ్య కుదిరిన సంభాషణలు అద్భుతంగా కథను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా ఇద్దరు తమ భావాలను పంచుకోవడం గొప్ప అనుభూతిని కలిగించింది. నిజంగా ఈ జీవితం దేవుడిచ్చిన ఓ వరం. మంచి కథను అందించిన రచయిత జ్ఞానేశ్వర్ గారికి అభినందనలు.
- రాప్రోలు సుబ్బారావు, కనిగిరి
- దాయన లక్ష్మీకాంతం, ఏర్పేడు
- వీర భాస్కరరావు, సైదాపురం

నూతన సంవత్సర కవితలు బాగున్నాయి
గతవారం మెరుపులో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మెరుపు కవులు రాసిన కవితలన్నీ బాగున్నాయి. పదిహేడుకు స్వాగతం అంటూ శింగరాజు శ్రీనివాసరావు గారు, నూతన శుభాకాంక్షలు అంటూ హస్తిమోహన్‌రాజు గారు, వసంత శోభతో వర్థిల్లాలంటూ కుర్రా ప్రసాద్‌బాబు గారు, విశ్వజన సంబరమా..నీకిదే స్వాగతం అంటూ వెంకటేశ్వరరాజుగారు, కాలానికి మరో కొత్త సొబగు అంటూ పాకాల రవీంద్రబాబు గారు రాసిన కవిత.. ఇలా అన్ని కవితలతో క్రొంగొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన తీరు బాగుంది.
- వెంకటరమణయ్య, గూడూరు
- మామిడిపల్లి లలతి, నెల్లూరు
- సజ్జల హిమప్రియ, సింగరాయకొండ
- జ్యోతుల నరసయ్య, కాళహస్తి

**
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
merupunlr@andhrabhoomi.net