రాజమండ్రి

సాత్విక భావనా సౌందర్యం ‘సౌభాగ్య’ సమీక్షణం (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా కవి జీవితంలో అతి మధురమైన సంఘటనలు - పుస్తకావిష్కరణలు, సమీక్షలు వల్లనే జరుగుతుంటాయి. అదీ ఒక కవి, సమీక్షకుడు మరో కవి పట్ల అతని కవిత్వాన్ని విశే్లషిస్తూ వెలువరించిన పుస్తకం ఇరువురికీ ఉభయతారకంగా లబ్ద ప్రతిష్టతల్ని తీసుకుని రావటం విశేషం.
‘సౌభాగ్య’ కవిగా, రచయితగా, శతాధిక గ్రంథకర్తగా తెలుగు నేలకు సుపరిచితుడయ్యారు. అలాగే దాట్ల దేవదానం రాజు కవిగా, కథకునిగా, చరిత్రకారునిగా రెండున్నర దశాబ్దాలుగా సాహితీ కృషి కొనసాగిస్తున్నారు.
అక్షరాల్ని వత్తి / అతిసుదారంగా పదం చేసి / ఒకింత భావుకత రాని / శిల్పిలా తదేక వీక్షణంతో / బొమ్మ చెక్కితే / ఆర్ద్రమై సాకారమైతే / కవిత్వవౌతుంది // అంటారు దాట్ల దేవదానంరాజు. మరి ఈ కవిని, భావనా బలాన్ని ఒడిసి పట్టుకున్న ‘సౌభాగ్య’ కవిత్వ రూపకం, వాక్య నిర్మాణ శిల్పం సౌమ్యాక్షరాలు సౌందర్య - సాత్విక శిల్పిగా చూపారు. పదాల అల్లికలో తన సిద్ధహస్తతను పలు సందర్భాల్లోని వివరణలు, మొత్తం 25 అర్థవంత అధ్యాయాలుగా విశే్లషించడం చూస్తాము. అసలు దాట్ల రచనల్లోని అనుభవసారళ్యాన్ని అంతర్ముఖత్వాన్ని, తన్మయగీతాలుగా అభివర్ణించిన పాదాల్ని ఊటంకించారు.
సౌభాగ్య అన్నట్టుగా కాళిదాసు మాటల్ని- ‘అతి పరిచయంత్ అవగ్నా’ నిత్యం చూస్తున్నవాటిని మనుషులు అంతగా పట్టించుకోరు. కాని కవిగా దేవదానంరాజు- చలిమంటను సృష్టి విలాసాల్ని, విభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఈ పంక్తుల్ని గమనిద్దాం. - నల్లటి ఒక లాంటి కొలిమి / ఎర్రగా రాజుకుంటున్న నెగడు / వేకువన ఉకలు / ఉత్ప్రేరకాల ఉద్దీవనాలే / శీతల పవనం ఒక లాంటి చీకటి / ముసుగు కప్పుకోగానే / మరో లోకం / దుప్పటి కింద దాగిన కలలు / గడ్డ కట్టిన ఛాయలే
ఇలాంటి మార్మిక విశే్లషణలు, నైరూప్య భావనా చిత్రణలు అసాధారణ కవులకే సాధ్యం అంటారు సౌభాగ్య. ఒక కవి స్వప్నాలు, మంటల మాధుర్యాలు కవిత్వ పరుసవేది లక్షణాలు ఊటంకించడం జీవితాన్ని కవిత్వంతో అనునయించుకోగల వాళ్లకే సాధ్యపడుతుంది. కళ్ల ముందు నిలిచిన వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయినప్పుడు, అదీ తన తండ్రైనప్పుడు కవి ఆవేదనల్ని ఎలా ఆవిష్కరించాడో సమర్ధవంతంగా సౌభాగ్య విశే్లషించారు.
జీవన విషాదంలో అనివార్యమైన అంకం
కదలిక ఆగిపోయిన / పురాస్మృతి / మానాన్న పూలదండల ఫొటోగానో / వారసత్వాన్ని మిగల్చడం గానో / అమ్మ రోదనల విషాదంగానో మారిపోయాడు
తండ్రినిచ్చిన సృష్టికర్త ఇచ్చిన శూన్య విషాదం
ప్రత్యామ్నాయాన్నివ్వలేదన్నది అక్షర సత్యం
‘అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజాపతో’
భర్తృహరి అన్నట్టు మకుటంలేని మహారాజుగా రాజ్య కవితా సంపదల్ని, కవితా నిర్మాణ రహస్యాల్ని కోట బురుజులుగా దాట్ల నిర్మించుకున్నారు. ఓషో అన్నట్లు - కవి మనసు పులకించే మనోహర చర్య కవితా లక్ష్యం సిద్ధించినట్లే కదా అన్న విశే్లషణ బాగుంది.
కవి జ్ఞాపకాల గురించి చక్కటి అంశాలు ప్రస్తావించడం జరిగింది. వాచ్య, సూచ్య ప్రమేయాలు, ఉపమలు, జీవితాల్ని ఆవిష్కరించడంలో పలు కవితలు ఆకట్టుకున్నాయి. అన్నీ మధుర జ్ఞాపకాలు కావు కదా! కాలం మాత్రమే సుఖాల్ని దుఃఖాల్ని మనసులో మణుల్లా దాచి ఉంచడం, లేక మరుగున పడేయటం జరుగుతుంటుంది అన్న కవి భావం నిజమే కదా! మొత్తంమీద దాట్ల మనసుకు సంబంధించి భౌతిక, స్పర్శానుభవాలు, పూలరేకుల్ని తాకినట్లుగా, మార్దవం, మహదానందం, మందహాసాల మేలుకలయికలుగా కవిత్వాంశాలు చేశారు.
‘వెనె్నల వెలుగుల్ని మంచి గ్రంథంలా / అరగదీసి రంగరించి / తెలుగింట ముగ్గులా / బొటనవేలు చూపుడువేలు సందున / శబ్దమై జారితే కవిత్వవౌతుంది - ఇలాంటి కవిత్వార్ద్రత, సాకారత, స్థానికత, జాతీయత కలగల్పిన కవి దాట్లను అతని కవిత్వయానాన్ని, ధ్యానాన్ని సమీక్షణంగా అందించిన కవి సౌభాగ్య విశే్లషణ ప్రతిభ కనబరిచారు.
కవిత్వం ఒక తపస్సు / కవిత్వం ఒక దీపస్తంభం - ఒక సమూహం కోసం ఏకాంతంగా ప్రేమించేవాడే కవి. ఇది అక్షరాలా దేవదానంరాజు, సౌభాగ్యలిద్దరికీ అన్వయిస్తుంది.

- వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులు 65-5-20/5, 3వ రోడ్డు మెహర్‌నగర్, కాకినాడ