విశాఖపట్నం

హైకూలు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి ఒకటి
గోడతల్లి ప్రసవించింది
కొత్త కేలెండర్ పిల్లని
సంక్రాంతి నెల
పొలానికి వీడ్కోలు చెప్పేయి
చెరుకు తోటలు
కొత్త సంవత్సరారంభం
ఇళ్ల ముంగిళ్ల ముఖాలు
వెలుగుతున్నాయి తెల్లగా
స్నానం చేసిన వాకిలి
మెడలో ధరించింది
ముత్యాల హారం
సూర్యుడు
ఇరేజ్ చేశాడు మంచుని
బయట పడింది కొండ

- మాధవీ సనారా, అనకాపల్లి
కామాక్షి కోవెల వీధి, నిదానం దొడ్డి
అనకాపల్లి-531002
సెల్ : 9440103134.

**

పితృదేవోభవ

నాన్న - ఇలలో ప్రత్యక్ష దైవం
వెన్నలాంటి మనసుగల అమృత హృదయుడు
ఆత్మీయత, ఆప్యాయతల మేళవింపే నాన్న
పెంచి, పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించి
ప్రగతిబాటలో నిడిపించే మహోన్నతుడు నాన్న
నమ్మకానికి మారుపేరు నాన్న
ప్రేమానురాగాలకు మరో పేరు నాన్న
కష్టసుఖాల్లో వెన్నుతట్టి
ఓదార్పు నివ్వగలవాడు నాన్న
జీవన సంద్రంలో గల అలల తాకిడికి.....
కొట్టుకుపోతున్న జీవన నావను
అలవోకగా ఒడ్డుకు చేర్చగల
నేర్పరి నాన్న
నా అన్న పదానికి అర్థం నాన్న
జన్మనిచ్చింది అమ్మే అయినా
జన్మకు సార్థకత చూపిన వాడు నాన్న

- రాయవరపు సరస్వతి
**

జైజవాన్

కన్నవారికీ ఉన్నవారికీ దూరంగా ఉన్నా
దేశమాత రక్షణకై దగ్గర ఉండు
పరాయివాడు మాతృభూమిలో బడాయికొడితే
ఆలోచించక చీల్చి చెండాడు
సరిహద్దులను దురాక్రమణ చేస్తే
శత్రువుల గుండెల్లో నిదురపో
సంధి జరిగిందని పరధ్యానంతో ఉంటే
పగవాడి చేతిలో పరాభవం తప్పదు
అహర్నిశలూ పోరాడే వీరుడా నీకు జోహార్లు
సాహసాలే ఊపిరిగా సాగిపోయే జవానుకు
రుణపడి ఉంది ఈ భారతావని

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖజిల్లా,
సెల్ : 9885090752.
**

వర్షం కురిసిన వేళ

రంగు వేసిన జోడిపిల్ల - రంగుపోయిందని
ఐదేళ్లవాడు - ఓకటే ఏడుపు
మోటారు బండిపై వెళ్తే, తడిసిపోతానని
ఓ ఫ్యాంటు వాలా, అంతులేని ఆవేదన
వర్షంలో - గతుకుల్లో కారు ప్రయాణం
యిబ్బందని - ఓ సూట్‌వాలా ఆక్రోశం
వర్షంలో ఫంక్షన్‌కెళ్తే మేకప్ చెరిగి పోతుందని ఓ సెలిబ్రిటి వాపోత
ఇంటికి సరుకులెలా తేవాలి
వర్షంలో మధ్య తరగతి ఓ పెద్దాయన - ఆలోచన
ఈ రోజు కూలికెళ్లకపోతే
రాత్రి పొయ్యెట్టా వెలిగేనని ఓ రోజు కూలీ బెంగ
వర్షంలో షాపింగ్ చేయడమెలా? ఓ షాపింగ్ పిచ్చాయన బాధ
బాగా వర్షమైతే బడులకు సెలవులిస్తారని పిల్లల - ఆనందం

- శ్రీమతి గంటి కృష్ణకుమారి, బాబామెట్ట,
విజయనగరం. సెల్ : 9441567395
**

ఆదర్శ గ్రంథాలు

వాల్మీకి వ్యాసులార!
కవిపుంగవులారా!
ఓ కవికోకిల లారా!
తాళపత్ర గ్రంథాలను
ఆముద దీపపు వెలుగుల
ఇనుప ఘంటములతో
ఎలా రాసేరో
రామాయణ - భారతాల
భువి కందించారు కదా!
కవిత్రయపు త్రేతాగ్నులు
పోతున్న - శ్రీనాధులు
తెలుగు మహాగ్రంథములను
తెలుగు నేలకిచ్చారే
మహాగ్రంథ రచనలేవి
ఆదర్శ గ్రంథాలే
ఆ మహాత్మల రచనలే
జగతి అంతా వెలుగులీనె

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.