నెల్లూరు

కోలపల్లి గారి కథ సూపర్ (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపులో అబ్బో.. ఎంత జ్ఞానో! కథ చాలా బాగుంది. కోలపల్లి ఈశ్వర్ గారి నుంచి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. ఆయన కథల్లో హాస్యం ఆనందభైరవి నాట్యం చేస్తుంది. ఈ కథలోనూ అంతే. స్వామిజీ తెలివితేటలు ఎంత గొప్పవో అద్భుతంగా వర్ణించి అందరిని కడుపుబ్బ నవ్వించారు. అందరికి తెలిసిన విషయాన్ని చక్కటి సంభాషణలతో, హాస్యభరితంగా కథను మలిచిన తీరు బాగుంది. ప్రస్తుత సమాజంలో స్వామిజీల పాత్ర కూడా ఇలానే వుందనే చెప్పాలి. మన దగ్గర విషయాలు తెలుసుకుని, వాటికి కొన్ని జోడించి చెప్పడం బాగా నేర్చుకున్నారు. రచయితకు అభినందనలు.
- సుమతి, కావలి
- అయినాబత్తిన ఘనశ్యాం, ఒంగోలు
- రావి పద్మావతి, తిరుచానూరు

గొప్ప కవితను చదివాము
మెరుపులో మార్టూరు నుంచి రచయిత గర్నెపూడి వెంకటేశ్వరరావు గారు ఎంతో గొప్ప అర్ధవంతమైన ‘‘నేనూ నీలాంటి మనిషినే’’ అనే కవితను పాఠకులకు అందించినందుకు ధన్యవాదములు. స్ర్తిలపై ప్రస్తుత సమాజంలో జరిగే అరాచాకాలను కొత్త కోణంలో ఆవిష్కరించారు. అప్పటికీ, ఇప్పటికీ స్ర్తి అవమానానికి గురవుతూనే వుందనే బాధ ఈ సమాజంలో నిజంగా ఎంతమందికి వుంది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గొప్ప కవితను అందించి ఆలోచింపజేసిన రచయిత వెంకటేశ్వరరావు గారికి ధన్యవాములు.
- చివుకుల సుప్రజ, పామూరు
- నీలంకఠ సుబ్రమణ్యం, నాయుడుపేట
**
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net