నెల్లూరు

చదువు - సంధ్య ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలు వేడి, రాత్రిపూట చలి. పొద్దునే్న తొందరగా లేవాలంటే ఎవరికైనా బద్దకమే. చలికి తట్టుకోలేక వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న సంధ్యకి అత్త గట్టిగా పిలుస్తున్నా మెలకువ రాలేదు. నేరుగా సంధ్య ఉన్న గది వద్దకు వచ్చిన అత్త సుజాత తలుపు మీద తడుతూ ‘‘సంధ్య, సంధ్య.. లేచి ఇంటి ముందర నీళ్లు చల్లి ముగ్గు వెయ్యమ్మా..’’ అంది ఆ పిలుపుకి ఉలిక్కిపడిన సంధ్య తన మనసులో ‘‘పెళ్లయి నెల కూడా కాలేదు అప్పుడే పనులా’’ అనుకుంటూ దుప్పటి తొలగించి లేచింది. పక్కన పరుపుపై భర్త సురేష్ కనపడలేదు. సమయం చూసింది ఆరుగంటలైంది. ఈ చలికి ముందే లేచి ఎక్కడికి వెళ్లాడో అనుకొంటూ తలుపుతీసి వెలుపలకి వచ్చింది.
అత్త సుజాత పక్కకు జరిగింది. అప్పుడే బయట గేటు తోసుకుంటూ తన భర్త రమేష్ లోపలికి వస్తుండటం కనపడింది.
సంధ్య చీపురు తీసుకుని ఊడ్చేందుకు గుమ్మం దగ్గరకు వచ్చింది. రమేష్ వేపపుల్లతో పళ్లు తోముకుంటూ పెరటిగదిలోకి వెళ్లి మూడుసార్లు నీరు పుక్కిలించి ఉమ్మి, టవల్‌తో ముఖం తుడుచుకుంటూ వచ్చాడు.
సంధ్య చెత్త తోస్తుండటంతో బకెట్ తీసుకొని తల్లి సుజాతతో కలిసి పాలు పితికేందుకు ఆవు వద్దకు చేరుకున్నాడు సురేష్. పాలు పితికి ఒక చెంబు నిండుగా తీసుకొని సుజాతమ్మ ఇంట్లోకి రాగా మిగిలిన పాలు తీసుకొని సురేష్ డెయిరీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు.
నీళ్లు చల్లి ముగ్గు వేసిన సంధ్య గబగబా వంటగదిలోకి దూరింది.
‘‘అత్తా నిన్నటివరకు నేను బెడ్‌కాఫీ తాగిన తర్వాత పనులకు నడుస్తూ ఉంటే, ఈరోజు మాత్రం ముందే నన్ను నిద్రలేపేశారు ఎందుకు’’ సంధ్య అత్తను ప్రశ్నించింది.
‘‘చూడమ్మా పక్కింటి సరోజ కోడలు పెళ్లయిన వారానికే పనులు చేయడం మొదలుపెట్టింది. నీవా బాగా చదువుకున్న దానివి. అయినా అత్తారింట్లో పనులు చేయాల్సిందే కదా. అందుకే నెలరోజుల తర్వాత నీకు పనులు చెప్పాను’’ అంది సుజాతమ్మ.
‘‘సరేలే అత్తా నువ్వు పక్కకు జరుగు నేనే కాఫీ పెడతా’’ అని సంధ్య పొయ్యి వద్దకు వచ్చింది.
అప్పటికే కాగుతున్న కాఫీని గ్లాసులోకి వంచింది. తలా ఓ గ్లాసు తీసుకున్నారు. ఇంకా కొంచెం కాఫీ మిగలడంతో తెలిసిన వాళ్లెవరైనా వస్తే ఇవ్వొచ్చనుకొని ఇంకో గ్లాసులో పోసి పెట్టింది.
పల్లెల్లో అలా ఎవరో ఒకరు ఇళ్లకు రావడం, కాఫీ తాగడం గతంలో సంధ్య గమనించింది.
అనుకున్నట్లుగానే సంధ్య దూరపు బంధువు ఒకామె అలా వెళుతూ కనపడటంతో సంధ్య గబగబా వచ్చి ‘‘రాజమ్మత్తా బాగున్నావా, రా..రా..’’ అంటూ లోపలికి పిలిచింది.
రాజమ్మ వచ్చింది. రాగానే ఆమె చేతిలో కాఫీ గ్లాసు ఉంచారు.
కాఫీ తాగుతూ ‘‘ఏమ్మా నీ మొగుడు ఎంత వరకు చదువుకున్నాడు, ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా’’ అని సంధ్యను రాజమ్మ ప్రశ్నించింది.
‘‘అబ్బే పదివరకు చదువుకున్నాడత్తా, సేద్యం దండిగా ఉంది, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు’’ సంధ్య చెప్పడంతో.
‘‘ఎంత సేద్యం ఉంటే ఏం లాభంలేమ్మా, వానలు పడకపోతే, కరవొస్తే అప్పుడేం చేయాలి, అదే ఒక చిన్న గవర్నమెంటు ఉద్యోగమున్నా సరే నెలొస్తే జీతం వస్తుంది’’ రాజమ్మ వత్తి పలికింది.
అంతవరకు బాగా మాట్లాడిన సంధ్య ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది.
‘బిఇడి చేసిన తనకు పది చదివిన వాడు మొగుడుగా వచ్చాడే’ అని మనసులో కొద్దిగా నామోషీగా అనిపించింది. తన కోడలి మనసులోని భావాలు ఇట్టే కనిపెట్టిన సుజాతమ్మ వెంటనే కలుగచేసుకుని ‘‘సంధ్యా నువ్వు వెళ్లి స్నానం చేసి పూజ చేసిరా.. ఈలోగా నేను టిఫిన్ చేసి ఉంచుతా’’ అంది.
సంధ్య లోపలికి వెళ్లగానే రాజమ్మ కాఫీ గ్లాసు పక్కన పెట్టి బయటకు నడిచింది.
స్నానాల గదిలోకి వెళ్లిన సంధ్యకు మనసు మనసులో లేదు. ‘‘తన చదువుకు తగ్గవాణ్ణి చేసుకొని ఉంటే ఈరోజు ఈ పల్లెలో చాకిరీలు చేసేదాన్ని కాదేమో. హాయిగా ఇంట్లో పని మనిషితో పనులు చేయించుకొనేదాన్ని. ఏం చేద్దాం. నిరుపేద కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు బిఇడి చదివించారు. అదే గొప్ప నాకు’’ అని మనసులో ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది.
స్నానం అనంతరం పూజ గదిలోకి పోయి ‘‘స్వామి ననె్నందుకు ఇక్కడికి కోడలిగా పంపావు, చిన్న ఉద్యోగస్తుడికైనా ఇచ్చి చేసేలా మావాళ్ల మనసు మార్చి ఉండకూడదా, అంతా నా దురదృష్టం, మీరేం చేస్తారులే’’ అని వాపోయింది.
ఆరోజు నుంచి సంధ్య ఒక్కసారిగా ముభావంగా మారిపోయింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. తన మానాన తను పనులు చేసుకోవడం అలవాటు చేసుకొంది.
ఇలా ఆరునెలలు గడిచాయి. ముభావంగా ఉన్న సంధ్యను తల్లిదండ్రుల వద్దకు పంపించారు అత్తమామలు.
ఎప్పుడూ చలాకీగా ఉండే తమ కూతురు ఎందుకు ముభావంగా వుందో, అత్తగారింట్లో ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా, లేదంటే భర్తతో ఏమైనా వాదులాడుకొని వచ్చేసిందా అని సంధ్య తల్లిదండ్రులు చర్చించుకున్నారు.
రెండురోజుల తర్వాత సంధ్య తల్లి శాంతి కూతురు వద్దకు వచ్చి వివరాలు ఆరాతీసింది. ‘‘్భర్త ఏమైనా అన్నాడా’’ అంటే లేదని చెప్పింది. ‘‘అత్తమామలు సాధిస్తున్నారా’’ అని అడిగితే ‘‘ ఊహూ’’ అనింది.
అంతలో వియ్యంకుడి నుంచి ఫోన్ రావడంతో శాంతి ఫోన్ తీసింది. ఆయన జరిగింది చెప్పాడు. ‘‘అమ్మాయి ఎక్కువగా చదువుకున్నా తాము తక్కువ చేసి చూడలేదని చెప్పుకొచ్చారు. భర్త తక్కువగా చదువుకోవడం ఆమెకు నామోషీగా ఉన్నట్లుగా ఉంది, మీరే సర్ది చెప్పి పంపండమ్మా’’ అని ఆయన చెప్పి ఫోన్ కట్ చేశాడు.
ఇంత చిన్న విషయాన్ని సంధ్య అంత సీరియస్‌గా తీసుకోవడం, పైగా అత్తమామలు, భర్త బాగా చూసుకుంటున్నా ఇలా ప్రవర్తించడంతో శాంతికి కోపం వచ్చింది.
అంతలో పక్కింట్లో ఉన్నట్లుండి ఏడుపులు మొదలయ్యాయి. అవి అంతకంతకు పెరిగాయి. ఏమై ఉంటుందోనని శాంతి, సంధ్యను పిలుచుకొని ఇంటి బయటకు వచ్చింది. పక్కింటికి నడిచారు.
‘‘పక్కింటి లలిత భర్త మహేష్ ఉద్యోగం చేసుకొని ఇంటికి వస్తుంటే అతని స్కూటర్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో చనిపోయాడట. ఈ విషయం తెలిసి అంతా ఏడుస్తున్నారు’’ అని ఎదురుగా వచ్చిన ఒకావిడ వీళ్లకు చెప్పింది.
‘‘అయ్యో పాపం నెలకు 40వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగే, ఇలా అర్ధాంతరంగా చనిపోయాడా’’ అని శాంతి చెబుతూ సంధ్యను వెనక్కి పిలుచుకుని తిరిగి ఇంట్లోకి వచ్చేసింది.
‘‘ఎంత ఉద్యోగం ఉంటే ఏమి, ఎంత జీతం వస్తే ఏమి? చనిపోతే జీవితమంతా బాధపడాల్సిందే కదా, అదే వ్యవసాయం చేసుకొనే వాళ్లయితే ధైర్యంగా కష్టపడి పనులు చేసుకోగలుగుతారు. లలిత ఏ పనీ చేయలేదు.. ఎలా బతుకుతుందో ఏమో’’ అని సంధ్య వాళ్ల వెనకింటి సుబ్బమ్మ అంటుండగా సంధ్య చెవిలో ఈ మాటలు పడ్డాయి.
వెంటనే ఇంట్లోకి వెళ్లింది. ఆలోచించింది.
‘‘అరె ఎంత పొరపాటు చేశా, ఎంతోమంది అత్తమామలు, భర్తలు ఆడవాళ్లని వేధిస్తుంటే తనను బాగా చూసుకొనే వారిని వదలి వచ్చేశానే, చదువుతో ఏం పని, గుణం బాగా ఉండాలి, భర్త మంచోడై భార్యను బాగా చూసుకోగలిగితే చాలు’’ అని సంధ్య మనసులో అనుకుంది.
వెంటనే సూట్‌కేసు సర్దుకుంది.
‘‘అమ్మా నే వెళ్లొస్తా’’ అంది.
ఆశ్చర్యపోయిన శాంతి తన కూతురుకు భగవంతుడు బుద్ది ప్రసాదించాడనుకుని ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ‘‘సరే అమ్మా జాగ్రత్తగా కాపురం చేసుకో, నీవు బాగా చదువుకున్న దానివి, నీకు నేను చెప్పలేను’’ అంది.
అంతలో భర్త సురేష్ రావడంతో అతని మోటారుబైక్ ఎక్కి ‘‘మన ఇంటికి వెళదాం పదండి అంది’’ సంధ్య తల్లికి టాటా చెబుతూ..

- కటారి రామయ్య, సదుం చరవాణి : 9704025771