రాజమండ్రి

ప్రపంచకం రూపాయి కథ!! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణేతిహాసాల భారతంలో
నలకూబరుడికి కథ ఉంది!
మానవేతిహాసంలో - రూపాయి - రూపాల్లో
నల్లకుబేరుల కథలు కోకొల్లలు!
హతవిధీ - పాపాయిల్లా (దో)దాచుకున్నందుకు
పాపాల్లా - పెనుభూతంలా వెంటాడుతున్న సందర్భాలు
తెలుపు నలుపు వర్తమానం - మనిషికి వెతల కథల్నిస్తోంది!!
మార్తున్న ప్రపంచకంలో మొన్నటి బ్రెగ్జిట్‌లు -
ట్రంప్‌కార్డులు చర్విత చరణాలైనాయి
అదీ - ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది!
దానిపేరే - రూపాయి - యూరో - డాలరు డాట్‌కామ్ ఆట!
నేలమాళిగల్ని తవ్వి తలకెత్తుకునేందుకు
త్రవ్వుగోలాలు - హవాలా గందరగోళాలు
పట్టు పరుపుల అరల్లోని ధూళిదూసరితాలు
దుమ్మురేపిన కట్టలు - కట్లపాముల్లా కన్పడుతున్నాయి
నిశ్చింతల్ని - నిద్రలకు దూరం చేసిన - కన్రెప్పలు
అరాత్రికం జాడలు - నీడల్లా - నిజాల్ని
ఆదాన ప్రదానాల స్వచ్ఛందాల్ని
ప్రకటించుకోవడానికి అన్ని రహదారుల్లోనూ
బారులు - తీరుతూనే ఉన్నాయి

శ్రమించిన సంపద
శ్రమపడకుండా చేర్చుకున్న సంపదలు
తెలుపు - నలుపుల సమరంలో గెలుపోటముల్లోకి
ఎన్ని నదుల సంస్కృతుల్నించి కాపాడుకుంటూ
కాలనాళికల్ని ఆకళింపు చేసుకున్నామోకదా?!
వస్తుమార్పిడులు - తోలునాణేలు
కాలం సంపుటాల్లోకి చరిత్రని
తిరగరాయిస్తూన్న సందర్భాలౌతున్నాయి

మానవ సంబంధాలు డబ్బు గాలులకే
కొట్టుకుపోతున్నాయి
మనిషి తనంకోసం మరెక్కడ వెతకాలి?!

-వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు, సెల్: 9441148158
**

మధురమైన ఆలోచనలు

ప్రకృతి లోగిళ్లలో తామరల అందాలతో
పిల్లగాలులు పారవశ్యమైన ఈ అందాల అరణ్యంలో
వాన జల్లులై తడిపిన ఈ ప్రకృతి జల్లులతో
ఆకాశమంత తోరణముల వలె కట్టిన పక్షుల కిలకిలారాగాలతో
సాగర తీరాన కొలువై ఉన్న కెరటాల ధ్వనులలో
నిశీధిలో అంబరమంతా నిండిన తారలలో
ఇన్ని అందాలు భూమిలోనున్నవని తెలుసుకున్న నాలో
అబ్బురపరిచే ఈ అందాలను సోయగాల నడుమనున్న
నాకు ఎన్నో ఎనె్నన్నో మధురమైన ఆలోచనలో..

- వి వరలక్ష్మి, రాజమహేంద్రవరం
**

క్రిమిహారిణి

ఒక పురుగు తిరిగినట్టుగా
నా దేహమంతా విషం చిమ్ముతూ తిరుగుతున్నావు
క్షణక్షణం విస్ఫోటవౌతూ
కణిజాలాన్నంతా ఆక్రమించే కేన్సర్‌లా కుతకుతలాడుతున్నావు
నీ పురుగుల సంతతిని పెంచేందుకు పథకాలు రచిస్తున్నావు

నేను పేదవాడినని బీదవాడినని
ఆకలి అరుపులు అరుస్తున్నావు
నేను వెనకబడిన వాడినని
అర్చకుడినని ప్రగల్భాలు పలుకుతున్నావు

నా దేహమంతా ఆక్రమించి, నా దేశమంతా ఆక్రమించి
విదేశీ విష సంస్కృతీ కేతనాన్ని రెపరెపలాడించాలనుకుంటున్నావు
నీలాంటి పురుగుల నెంతోమందిని చూశాను
యుగయుగాల నా చిరంతన ప్రయాణంలో
నీలాంటి విష కీటకాల నెన్నిట్నో నిర్జించాను
సనాతన అమృత భాండాన్ని పదిలంగా పట్టుకుని
ఈ ప్రపంచానికి రుచి చూచిస్తూ వచ్చాను
అన్నిట్ని అందర్నీ ఒకేత్రాటికి గుచ్చగల సత్తావున్న
ఆ జీవామృతం ప్రపంచం
చిరంతనంగా సంతోషంగా నిలవాలంటే
అందరి గొంతుకలలోనూ పోయాల్సిందే!
చివరికి నీ నోట్లో కూడా

- డాక్టర్ మోపిదేవి విజయగోపాల్, సెల్: 9490679570