విశాఖపట్నం

గౌరవం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం నా అరచేతిలో
నేను స్మార్ట్ఫోన్ గుప్పిట్లో

ఫేస్ టు ఫేస్ అయితే నో లుక్స్
ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ అబ్బో చాలా లైక్స్

నా టైం బాలేదు అన్నాడు మొహంలో దైన్యం
ఇంకా చాలా టైం ఉంది అన్నాను కన్పించింది ధైర్యం

ప్రజాస్వామ్యానికి బలం ఓటు
కానీ నోటు దానికి పొడిచింది వెన్నుపోటు

ఫెయిర్ అండ్ లవ్‌లీ రాసి చర్మానికి అద్దావు అందం
మనసుకు ఏం పూస్తావు చాలా నల్లగా ఉంది

చదవడానికా ప్రైవేట్ స్కూలుకు వెళతావా?
చదువు చెప్పడానికా సర్కారు బడైతేనే వెళతా

మనం అనే భావన ఆనంద పర్వం
నేనే అని విర్రవీగితే కోల్పోవడమే సర్వం

- చావలి శేషాద్రి సోమయాజులు,
సెల్ : 9032496575.

**
మహిలో
వెలసిన మల్లి

స్ర్తిలు కొప్పులో ముడుచుకునే మల్లి
శివునికిష్టమైనది మల్లి
వసంతంలో మల్లి
విరివిగా పూసే మల్లి
మల్లిని పండించే మానవాళికి
సిరులనొసగే మల్లి
మగువలు మక్కువ చూపే మల్లి
శుభకార్యాలకు మల్లి
విరివిగా ఉపయోగపడే మల్లి
సువాసనలు వెదజల్లే మల్లి
చూడచక్కనైన మల్లి
మహిలోన మహిళలు
మరువలేని మల్లి
మా తెలుగు తల్లికి
మల్లెపూదండ
జాతీయ గీతంలో
జగతికెక్కిన మల్లి
పూలజాడీలోని మల్లి
ప్రఖ్యాతిగాంచిన మల్లి
అర్చనకు మల్లి
అలంకరణకు మల్లి
పెండ్లి పేరంటానికి మల్లి
ఇలలో పూసే మల్లి
మనస్సుకింపైన మల్లి
తెలతెల్లని మల్లి
మనసును ఆహ్లాదపరిచే మల్లి
నమ్మి పండిస్తే రైతు
సిరులు కురిపించు మల్లి
మరుమల్లెలా మనసును
తేటగా మలచుకుంటే
అంతా సానుకూలమే
వరించు విజయహారమే

- చెన్నా లక్ష్మణరావు,
పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 8985914109.
**

నేటి నారి

అధర్మం, అన్యాయం, అక్రమం
కాదు మగాడికే సొంతం
మాటల్తో ముంచేస్తారు
చూపుల్తో పడేస్తారు
కొంగుకి ముడేసుకుంటారు
కట్నకానుకలు తీసుకురారు
అత్తింటి ఆస్తుల్ని పుట్టింటికి తరలిస్తారు
కాదంటే కాపురం చేయరు
కస్సుబస్సులాడతారు
మాతృదేవోభవ మాటక మారుతున్న అర్ధం
ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధించాక
భర్త అవసరం లేదనుకుంటారు
భర్త, పిల్లలే ముఖ్యం
మిగిలినవన్నీ అనవసరం
ఆరడగుల చీరతో అందం అద్భుతం
పిచ్చివస్త్రాలతో జీవితం అస్తవ్యస్తం
నాడు భారత నారికి ప్రపంచంలో అగ్రస్థానం
నేడు మన దేశ నారికి విశ్వంలో స్థానం అథమం
న్యాయమే మను ధర్మశాస్త్రం
విదేశీ అనుకరణలతో జీవితం నరకం
సాంప్రదాయాలతో జీవనం స్వర్గం
చరిత్రలో చిరస్థాయిగా ఉందాం
విదేశీ విష సంస్కృతిని విడిచిపెడదాం
భారతీయ సంస్కృతిని పరిరక్షిద్దాం!

- పల్లంటి వెంకట రామకుమారరావు,
చినవాల్తేరు, విశాఖపట్నం.
సెల్ : 9441344503.
**

సానుకూల దృక్పథం

కీడెంచి మేలెంచడం కాదు
ఎప్పుడూ మేలే జరుగుతుందని ఆశించు
మనస్సు, మెదడు చైతన్యవంతం అవుతుంది
చేసే పని మీద దృష్టి కేంద్రీకృతం అవుతుంది
విజయం సిద్ధించి, శిఖరాగ్రాలు సొంతమవుతాయి!

- నీహారికా సాయి,
విశాఖపట్నం.