నెల్లూరు

స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరి పెన్నమ్మ తల్లి కవిత సూపర్
మెరుపులో చాలాకాలం తరువాత సుదీర్ఘమైన కవితను అందించారు షారోన్ బేగం గారు. ఓ నదిని ఎలా పూజించాలో తెలిపారు. నిజంగా పెన్నానది ఎంతో గొప్పది. ఎక్కడో పుట్టి మన జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. ఆ తల్లి గొప్పతనాన్ని వర్ణిస్తూ ప్రస్తుతం ఆ నది దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు. కవితలోని ప్రతి అక్షరం పెన్నానది గొప్పతనాన్ని తెలిపేందుకు పోటీపడ్డాయి. నిజంగా ప్రతి ఒక్కరూ మన నదుల గొప్పతనాన్ని తెలుసుకుని వాటి పరిరక్షణకు పాటుపడాలి.
- వేల్పుల చంద్రశేఖర్, ఉదయగిరి
- నిత్యనూతల లక్ష్మిప్రియ, పొదలకూరు

ఎంతైనా మన ఊరే మనకు గొప్ప
గతవారం మెరుపులో మార్టూరి శ్రీరాంప్రసాద్ గారు రాసిన మా ఊరు గుండ్లాపల్లి కవిత చాలాబాగుంది. మన ఊళ్లో సంగతులను మనం ఎప్పటికీ మర్చిపోలేం. కవిత చదివినప్పుడు మా ఊరు ఓసారి వెళ్లాలనిపించింది.
- సోమసుందరం, మేదరమెట్ల
- హేమలత శేఖర్, వరదయ్యపాళెం

నయనం బాగుంది
గుర్రాల రమణయ్య గారు ఏ కవిత రాసిన గొప్ప అనుభూతి కలుగుతుంది. గతంలో ఆయన రాసిన కవితల మాదిరిగానే ఈ వారం రాసిన నయనం కవిత సూపర్. కళ్లలో ఇన్ని భావాలుంటాయా అనేలా సాగింది కవిత. నిజంగా మన కళ్లు ఎన్ని ప్రయోగాలు చేస్తాయో కవితలో చక్కగా కళ్లకు కట్టినట్లు చూపిన తీరు హెట్సాప్. రమణయ్య గారికి ధన్యవాదములు.
- రావి పద్మావతి, ఒంగోలు
- సుజాత పుప్పూడి, (ఆన్‌లైన్ ద్వారా)
**
రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
**
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net