నెల్లూరు

ఉపకర్త ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడొక క్రియ
అసామాన్యంగా
అద్భుతంగా జరిగింది
భూమి పూజ చేసిన బుడతడు
బీజావాపనం చేశాడు
వరుణుడు వరమిచ్చాడు
భానుడు భాసించాడు
మట్టిపొరలను చీల్చి
అంకురం చిగురుటాకై
పత్రాల వలువలు తొడిగి
శుక్లపక్ష చంద్రుడై
మొక్క మానై పల్లవించి
కర్భన కోరలు ఛేదించి
కొత్త నీచుల
మాయాజాలంలో
వాదరకు గురికాక
జీవకోటికి మేలును కూర్చి
జగతి ఉపకర్తల కూర్పుతో
ప్రప్రథమంగా పేరెన్నికగన్న
ఓ వృక్షరాజమా!
నీకు నీవే సాటి..
ఓ అనాధ భిక్షువర్షియసి,
అలసిసొలసిన పాంథుడు,
అద్భుత గృహనిర్మాణ గిజిగాడు,
మైనా, మర్కటము, మధుపము
ఒకటా.. రెండా..
ఎన్ని ప్రాణులకో నివాసమై
ప్రకృతిమాతకు పచ్చని చీరగట్టిన
ఓ భూరుహమా..
చేస్తున్నాం నీకు
సాష్టాంగ ప్రణామం..!

- ఆడేరు చెంచయ్య, నాయుడుపేట
చరవాణి : 9492331449
**

కాలం కొత్తదనాన్ని గెలిచారు

ప్రభాతానికి ముందే
సుప్రభాత సేవతో వారి గమనం
నలుగురూ నాలుగు దిక్కుల్లో
మునుల్లా ధ్యానవౌన సముద్రంపై
తేలుతూ వుంటారు

బిడ్డలు మనిషి రూపుదాల్చిన
సరస్వతీ తల్లులువారు

సరస్వతీదేవి ఒక్కరే కదా?

అయినా కన్నవారి కడుపున
ఇద్దరు రత్నాలు వారు

వీణ చేతిలో లేకపోవచ్చు గాని
అక్షరాలు అరగదీస్తూ, స్పృశిస్తూ
సిరలు, ధమనుల ద్వారా మెదడు
పొరల్లో నిక్షిప్తం చేసుకుంటారు

వారి కళ్లను నేలకు అతికించి
దూరదృష్టితో నడుచుకుంటారు
వీరిని చూసినప్పుడల్లా ఈ ఇద్దరు
మా కడుపున ఎందుకు పుట్టలేదా అని
వీధి వీదంతా చిన్ని అసూయ

చింపిరి జుట్టు
చిరిగిన దుస్తులు ఫ్యాషన్
కాదంటారు

కాళ్లకు రాళ్లు తగిలించుకొని
నడవాల్సిన పనేముంది

వాళ్లు పసిపాపలు కారు
పడుచు వయస్సు పిల్లలే అయినా
యవ్వనాన్ని ఎక్వీరియంలో
దాచిన చేప పిల్లలు కాదు

కాలం కొత్తదనాన్ని గెలిచిన
లేలేత పరిమళాల
పూమొగ్గలు వాళ్లు

ఆత్మ విశ్వాసమే
ఆత్మరక్షణా కవచం వీరికి

దేహభాషే ప్రచండం
రేపు తూర్పున ఉదయించే
‘స్ర్తి’ సూర్యులు వీరేనేమో!!

- దుగ్గినపల్లి ఎజ్రాశాస్ర్తీ
ఒంగోలు.
చరవాణి : 8096225974
**

నానీలు

మాటల్లో
తేనె జల్లులు
మనసులో మాత్రం
విషపు గుళికలు

క్షణికావేశం
అనర్ధమే కదా
క్షణమాగితే
సానుకూలమే

కరంటు
మంటలే కాదు
వంటింటి మంటలూ
మింటికెగిశాయి

ముఖంలో
మార్దవానే్న చూశావా
సమస్యల సునామీలు
చూళ్లేదా!

గుర్రాల రమణయ్య,
నెల్లూరు
చరవాణి : 9963921943
**

చిరు కవిత

పరిశ్రమించు
ఆకాశాన్ని చూడు
ప్రతిదినం పగలు-రాత్రికై పయనిస్తుంది
అలుపులేకుండా....
చీమల్ని చూడు
ఎంత చిన్నవైన తమ లక్ష్యం కోసం పయనిస్తాయి
రైతును చూడు
కఠోరశ్రమ చేస్తాడు
ఫలితం చూడకుండా..
జవాన్‌ను చూడు
ప్రాణం పణంగా పెడతాడు దేశం కోసం..
సాలీడు చూడు గూడు అల్లుతూనే ఉంటుంది
ఫలితం చూడకుండా..
తేనేటీగలు చూడు
ప్రతి సెకను తేనే
సేకరిస్తూనే ఉంటాయి..
మరి ఆపాటి శ్రమ లేకపోతే
ఫలితం పొందలేము
స్ఫూర్తిపొందు వీటిని చూసి
నీ గమ్యం ఏమిటో తెలిసిపోతుంది
ఫలితం ఆశించకు
అది ఆశించకనే అందుతుంది నీకు..

- ఎం. ఎస్. జ్ఞానేశ్వర్, మదనపల్లె