నెల్లూరు

సత్యానే్వషణ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా రోజులకి సదానందకి తన చిరకాల మిత్రుడు, చిదానందం యింటికి వెళ్లాలనిపించింది.
అంతే ఆదివారం ఉదయం చిదానందం యింట్లో ప్రత్యక్షమయ్యాడు.
ఎదురుగా...చిదానందం పద్మాసనంలో కూర్చుని.. చుట్టూ అయిదారు పత్రికలు వేసుకుని తపోదీక్షతో మునిగి ఉండడం చూశాడు.
కూర్చీ లాక్కుని అతన్ని ఎందుకు డిస్ట్రబ్ చేయడం అనుకుంటూ.. ఎదురుగా కూర్చున్నాడు.
అంతే ఒక్కసారిగా.. పేపర్ చేతిలోకి తీసుకుని.. ఒక్కసారి కళ్లు మిటకరిస్తూ.. ఒక్కోసారి ఇకిలిస్తూ.. ఒక్కోసారి హుంకరిస్తూ తనలో తానే నవ్వుకుంటూ.. పెద్దగా హాహాకారాలు చేస్తున్న చిదానందాన్ని చూసే సరికి సదానందంకి ఠారెత్తింది.
అంతలోనే పేపర్ మార్చుకుంటూ, బోర్లా పడుకుని, కాసేపు నిటారుగా నిలబడి, రకరకాల ఫీట్స్ చేస్తూ ఏడుస్తూ..నవ్వుతూ దగ్గరగా కొన్నింటినీ, దూరం నుండి కొన్నింటినీ, చూసి చూసి, కొన్ని చింపేస్తూ, కొన్ని కాలితో తనే్నస్తుంటే.. సదానందకి వీడికి పిచ్చి ఎప్పుడు పట్టిందబ్బా..నాకు తెలియదే అనుకున్నాడు.
వంట యింటి వైపు చూసాడు... నింపాదిగా..వాడి శ్రీమతి కాఫీ కప్పులతో వస్తూ...
‘ఏంటన్నయ్య గారూ.. ఎప్పుడొచ్చారు.. ఈయన ఇప్పుడిపుడే వికారాల్లోంచి బైటకి రాడు కానీ.. కాఫీ తాగండి’ అంటూ కప్పు అందించింది.
‘అదేంటమ్మా నాకు చెప్పనే లేదు.. ఏంటి వీడికి ఈ రోగం... పిచ్చికుక్క కరిచాడా ఏంటి?’
‘ఏం చెప్పమంటారు అన్నయ్య గారూ.. ఈ మధ్య ఒక్కో రాజకీయ పార్టీ పెట్టిన దినపత్రికలు కొని అన్నీ ముందరేసుకుని... జవాబులు వెతుకుతూ ఈ విధంగా నాకు పిచ్చి పట్టిస్తున్నాడు మీ స్నేహితుడు.
***
అవునా.. నాకు తెలియదు. ఈ మైకం లోంచి ఎలా వాడిని తీసుకురావాలి బైటకి.
ఏం లేదండీ.. అన్నయ్య గారూ.. చెవిలో తాజా వార్త..తాజా వార్త అని అరిస్తే అమాంతం బైటకి వస్తాడు.
బాబోయ్.. ఔనా.. అంటూ గుటకల్లో కాఫీ తాగేసి..
‘‘్ఫ్లష్ న్యూస్..్ఫ్లష్ న్యూస్.. తాజావార్త’’ అంటూ చెవిలో అరిచాడు.
ఉలిక్కిపడి చిదానందం కళ్లు తెరిచాడు.. తెరిపారా చుట్టూ చూసి సదానందం ఎప్పుడొచ్చువురా.. అంటూ కుశల ప్రశ్నలు వేయడం మొదలు పెట్టగానే - ఆశ్చర్యపడడం సదానందం వంతయింది.
‘‘ ఒరేయ్..రావడం..కాఫీ తాగడం..నీ విన్యాసాలు.. అసలేంటిరా నీ సంగతి అరగంట నుంచి చూస్తున్నా..’’
ఇవన్నీ.. ఇన్ని పేపర్లు నీకు అవసరమా ఏంట్రా...
‘‘ ఒరేయ్ నీకేం తెలియదు.. ఈ పేపర్‌లో ఉంది ఆ పేపర్‌లో వుండదు.. ఏది నిజం.. అందుకే అన్ని చదివి వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవాలని’’
‘‘ అందుకా జుట్టు పీక్కుంటూ..పీక్కుంటూ.. నీ జుట్టు పావు ఎకరం..పోయింది’’ ఇది గమనించావా.. అయినా ‘‘ ఒరే..దీనివల్ల నీకేంటిరా.. ఉపయోగం? నువ్వు ఏ పార్టీవాడవు కాదూ..’’
‘‘నేను సామాన్య పౌరుడిని.. పౌరుడిగా నా బాధ్యత యిదిరా’’
‘‘ ఏడిసావ్’’
‘‘ ఉండు..అమ్మో టైమ్ 7.30 అయ్యింది. నన్ను డిస్ట్రబ్ చేయకు.. అమ్మో.. లైవ్ షో..అమ్మనేని ప్రోగ్రామ్..కాసేపు ఒపెన్ యువర్ మైండ్ అంటూ పి.కె.రావు ఎనాలసిస్ ఇలా టీవీ ఛానళ్లను మార్చి మార్చి చూస్తున్న చిదానందాన్ని చూసి..వీడికి పిచ్చి ముదిరింది బాబోయ్..పిచ్చాస్పత్రిలో చేర్పించాలో ఏంటో..దేవుడోయ్.. అనుకున్నాడు సదానందం.
టీవీ చర్చావేదికలో లీనమైన చిదానందం.. తొడకొడుతూ.. బహిరంగ చర్చకు రారా.. దమ్ములుంటే ఋజువు చేయండీ.. మా నీతిని.. సారీ.. సారీ అవినీతిని’’ అంటూ సదానందం పీక పట్టుకుని చెప్పండి.. చెప్పండి.. మీకే సవాల్ అంటుంటే విడిపించుకోవడానికి తల ప్రాణం తోకకొచ్చింది సదానందంకి.
మీ యిద్దరూ.. తన్నుకుంటూ ఉండండి. ఇంతలో బ్రేక్..అంటూ అమ్మినేని అంటుండగానే.. సదానందం అదృష్టం బాగుంది. కరెంటు పోయింది. చిదానందం మైకం నుంచి బైటకి వచ్చాడు.
‘‘ఓసే బ్రేక్‌లో కాస్త కాఫీ నీళ్లు పొయ్యి..మళ్లీ ఈ ఆదివారం స్పెషల్ కార్యక్రమాలుంటాయి’’ అన్నాడు.
‘‘ఒరేయ్.. ఒరేయ్.. ఆదివారం ఇలా ఆనందిస్తున్నావా పిచ్చి తండ్రీ..నాకన్నా..’’
... ఇంతలో టిఫిన్లు ట్రేలో పెట్టి తెచ్చి ముందు పెట్టింది.
‘‘అన్నయ్య గారూ.. తొందరగా తినండి..మనం ఇంకా మార్నింగ్ 9, ఆఫ్టర్‌నూన్ న్యూస్, ఈవినింగ్ షోస్ చూడాలండీ.. కొద్దిగా బలం కోసం.. తినండి’’
‘‘ఏం చేస్తాం తల్లీ.. ఇటు పడేయ్ తినేస్తా.. ఓ పని అవుతుంది’’ అంటూ ఆదుర్దాగా టిఫిన్ లాగించాడు సదానందం.
అంతలోనే కరెంటు రానే వచ్చింది.
రిమోట్ లేకుండానే టివి మొదలైంది.
రంగురాళ్లతో..మీ జాతకం టీవి యాంకర్ పళ్లు యికిలిస్తూ మీ జాతకం స్వర్గతుల్యం కావాలంటే మీ పీడలన్నీ విరుగుడవాలంటే.. ఈ రంగురాళ్లు చూడండి..కొనండి..్ధరించండి అంటూ ఊదరగొడుతుంది.
ఇపుడు బంబం బోలేనాధ్..చీటి ప్రాశస్త్యం వివరిస్తారు అంది. ఆయన గొప్ప జ్యోతిష్య చక్రవర్తి.
‘‘మీకు పెళ్లి కావాలా..పిల్లలు కావాలా.. ఉద్యోగం కావాల..డబ్బులు రెట్టింపు రెట్టింపుగా కావాలా.. తప్పక సంప్రదించండి. ఈ బంబం బోలేనాథ్.. చెబుతున్నాడు నమ్మండి. ఈ రంగురాళ్లు మీ జీవితాలని రంగులమయంగా చేస్తాయి. త్వరపడండి. రంగురాళ్లకి నా దూరవాణిని సంప్రదించండి.
***
ఉదయం 9.30 అయ్యింది.
‘ఎ’ ఛానల్‌లో న్యూమరాలజీ - ‘‘అంకెల్లో అదృష్టం కనుక్కోండి’’ అంటూ అల్లిబిల్లి ఆంజనేయులు, అంకెల గారడీ మీ జీవితానికి ఓ వెలుగువడి’’ అంటుంటే
ఆసక్తిగా ..స్పెల్లింగ్ రాస్తున్నాడు చిదానందం.
***
12 గంటలు సరిగ్గా..
జింబారే టీవీలో
సినిమాలు, రాజకీయాలు అన్నీ ఛానల్సూ తిప్పి తిప్పి తాజాగా నటి ‘‘పూజా’’ తెరమీద కనిపించగానే జింబారే టీవీలో ఆపాడు.
అంతలోనే రచ్చరంబోలా మొదలైంది మరో టీవీలో..
మరో టీవీలో భవిత కార్యక్రమం మొదలైంది..
ఈ కార్యక్రమాల్లో మహిళలను మోసం చేసిన వారిని, భర్తలను ఏడిపిస్తున్న ఆడవాళ్లను నిగ్గుతీస్తున్నారు, అరుస్తున్నారు, కరుస్తున్నారు.. ఏడిపిస్తున్నారు.
వీళ్లందరూ.. యిచ్చే పరిష్కారాలు..మార్చి మార్చి చూసి చిదానందం ఆనందపరవశుడై ఇంతకీ.. వీళ్లు సమస్యల పరిష్కారానికి ఏం చెప్పారబ్బా..అంటూ ఆలోచనలోపడ్డాడు.. చిదానందం.
మధ్యాహ్నం అయ్యింది.
ఆహా.. అభిరుచి ఛానల్ చూస్తూ.. ఇదిగో శ్రీమతి గారూ నేను ఈరోజు ఇప్పుడు ఇందులో చెప్పే వంటే చేసి నా స్నేహితుడిని.. ఆనందంలో ముంచుతా..’’ అన్నాడు.
‘‘ఎందుకూ...నేను గుమ్మడికాయ కూర పులుసు, చారూ, వేపుడూ, వడియాలు రెడీ చేశాను’’ అంది శ్రీమతి.
‘‘ఊరుకో..చాలు నీ ఓల్డ్ డిషెస్..రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడి వద్దు వద్దు’’
అంతలోనే.. వగలుపోతూ వంటిల్లు డ్రాయింగ్ రూమ్ అనేలా ఉండే..వంట గదిలో.. ఒక యాంకర్ నగలు దిగేసుకుని, పట్టుచీరతో, నల దమయంతి ప్రత్యక్షం అయింది. ఈ రోజు
‘‘మన ఆహా.. ఓహో.. అభిరుచి’’లో ఒక కొత్త వంట చేస్తాను.. మీరు మొదలుపెట్టండి.
కావలసినవి...
కాసిన్ని బియ్యం..రాగులు, జొన్నలు, బంగాళదుంపలు, చేమదుంపలు, పచ్చిమిరపకాయలు, మీ దొడ్లో తాజాగా కాసిన గరిక.. రుచికి కొత్తిమీర, అల్లం, బెల్లం, వాసనకి కొద్దిలా మసాలా పొడి, ఉప్పు, కారం.
ఇవన్నీ నానబెట్టుకుని తర్వాత వేయించుకుని తర్వాత కుక్కర్‌లో పెట్టి అరగంటకి తీయాలి.
అంతే.. మీ యింటినిండా ఘుమఘుమలు.
తాజా తాజా ‘‘గరిక..కిచిడీ..’’ తయార్.
‘‘ రుచి చూడండి’’ అంటూ పక్కనే పళ్లికిలిస్తున్న పాపారావుకి ప్లేట్‌లో పెట్టింది ఆ యాంకర్ వంకర్లు తిరుగుతూ...
వాడి మొహంలో..పాపారావు మొహంలో రంగులు మారినాయి
‘‘అయ్యో..అయ్యో..సారీ..సారీ ఈరోజు ఈ స్పెషల్ వంటకం మీ దొడ్లో ఉన్న పశువులకి..అండీ అంటూ కుక్కర్ చంకలో పెట్టుకుని టాటా బైబై చెబుతూ వచ్చేవారం..మరొక వంటకంతో అంటూ మాయమైంది.
పెద్దగా నిట్టూర్చాడు సదానందం.
ఇంక ఈరోజు టివి, మన టివి. అందరి టివి, గజనీ టివి, ఎ-జడ్ టివిలో కార్యక్రమాల్ని చూశాక ఆఖరుగానేమో ముక్తీ ఛానల్ చూస్తున్నాడు చిదానందం.
హిమాలయాల నుంచి ఆత్మజ్ఞానం పొందాను నేను అంటూ గడ్డం బాబా ప్రత్యక్షమై నాది గోచీ ఆశ్రమం, నా మీద గుండు స్వామి ఏవో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు - అతనికి ‘వేదం’ తెలుసా అసలు - ఉపనిషత్తులు తెలుసా అంటూ నిలదీస్తున్నాడు.
ఇంకో ఛానల్‌లో ‘గోచీ’ బాబాది అదంతా అబద్ధం.. జనాల్ని పక్కదార్లు పట్టిస్తున్నాడు. అతను అన్నీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడు. మార్చి మార్చి చూస్తున్న చిదానందాన్ని లాగి ఒకటివ్వాలని.. అయినా ఆపుకుని టిపి ఆపేశాడు.
‘‘ ఒరే నీకిదేం పోయేకాలం రా.. నీ దినచర్యని గమనిస్తే నాకు పిచ్చి పడుతోంది’’
వార్తాపత్రికలు ఎవరి సిద్ధాంతాలు వాళ్లు ప్రచారం చేసుకుంటూ వాళ్లకి ప్రయోజనం యిచ్చే వార్తలని పెంచుకుని, తగ్గించుకోవడం పరిపాటయ్యింది ఈ కాలంలో.
ఇంక టీవీల్లో చూపించే రంగురాళ్లతో జీవితం మారదు. అమ్ముకునే వాళ్లు కోటీశ్వరులవుతారు.. మనం మాత్రం బికారులవుతాం.
అంకెల్లో అదృష్టం లేదు. స్వయంకృషితోనే మన జీవితాలు బాగుపడతాయి కానీ హీరోయిన్లు వచ్చి మన జీవితాలు బాగు చేయగలరా..వాళ్లు పరిష్కారాలు చేయగలరా?
టీవీ షోలకు అమ్ముకోకూడదు. మన రహస్యాలని బహిరంగ చేయకూడదు. వాళ్లు వాళ్ల సంసారాలు దిద్దుకుంటే..సమాజ సేవ చేసినట్టేరా..
ఇంక స్వామిజీల సంగతికొస్తే.. ఆత్మజ్ఞానం పొందినవాళ్లు హిమాయాల్లో ఉంటారు. ఎసి ఆశ్రమాల్లో, అందమైన భక్తురాళ్లతో ఉండరు. సొంత ఛానల్ పెట్టరు. అందరిలో ఒకే ఆత్మ అయితే వీళ్లలో వీళ్లు ఎందుకు తన్నుకుంటారు. పాలాభిషేకానికి లక్షలు, లక్షలు తీసుకోరు. మనిషిలోని బలహీనతలని క్యాష్ చేసుకుంటున్నారు.
ఆత్మలోనే మనం దైవం చూడడం నేర్చుకోవాలి. ఇలాంటి స్వామిజీలతో తిరిగితే ధనమును, ప్రాణాలు పోతాయి అంతే.
వార్తయినా, వేదం అయినా సత్యం ఒకటే. అభూత కల్పనలు, ఆకర్షణలకి లోనయి కన్ఫ్యూజన్ వద్దు. వీక్షణతో సత్యానే్వషణ చేయి.
ఓం శాంతి - శాంతి - ఓం శాంతి.
అతని అపర శ్రీకృష్ణుడి అవతారం చూసి చిదానందం సదానందాన్ని కౌగిలించుకుని ఔనురా..జ్ఞానోదయం అయింది అంటూ టివిని ఒక తన్ను తన్నాడు.
ఇదంతా చూసిన శ్రీమతి హమ్మయ్యా..అనుకుంది.
**
- మోపూరు పెంచల నరసింహం
- గోవిందరాజు సుభద్రాదేవి
చరవాణి : 9346393501

- మోపూరు పెంచల నరసింహం