రాజమండ్రి

చిన్ని ఆశ ! ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడతెగని ఆలోచనా తరంగాలు
పుంఖాను పుంఖాలుగా
హృదయ తీరాన్ని
కల్లోల పరుస్తుంటే..
కలత చెందుతు
కలవరపడుతూ
కలలు కనడం
మానివేస్తున్నప్పటికీ..
వేదనకు అంతులేదు!
ప్రతి రేయి కళ్లు చెమర్చే రోదనే
నన్ను వెంటాడుతుంటే...
ఏమి చేయను?
ఎలా ముందుకు సాగను?
పనులలో అవరోధాలు
నడకలో అడ్డంకులు
నన్ను వెక్కిరిస్తుంటే..
ఎలా అడుగేయను?
అయినా...
ఆత్మస్థైర్యమే ఆయుధంగా మలుచుకుని
ఎప్పటికైనా
విజయం వరిస్తుందన్న
చిన్ని ఆశతో..
ముందుకు సాగుతా!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
సెల్.నం.7702261031
**

హృదయార్ద్రత

మదిలో కాంతి
మోములో వెలిగిస్తే
మనిషి మనుగడ
జ్వాలా మానం

చిల్లర గొడవలతో
మనసును చిన్న బుచ్చమా?
బతుకంతా
కాంతి విహీనం

చెమ్మగిల్లే కళ్లు
హృదయార్ద్రతకు సాక్ష్యం
కన్నీరు లేని
సమాజానికది సాదృశ్యం!
- అమృత్
94948 42274
**
కవి కిరణాలు

అందమైన హర్మ్యాలలో అందాన్ని చూసేది మీరు
పునాదుల్లో ఇంకిన శ్రమ జీవి స్వేదాన్ని చూసేది కవి
చిన్నారి చిరునవ్వులు చూసి మురిసేది మీరు
తల్లిపడిన పురిటినొప్పులు చూసి తల్లడిల్లేవాడు కవి
కడలి కెరటాలను చూసి ఆనందిస్తారు మీరు
కడలి కడుపులోని బడబాగ్ని గురించి ఆలోచిస్తాడు కవి
పూల పరిమళానికి పరవశిస్తారు మీరు
పూబాల గుండెల్లో దిగే సూదిపోటుకు విలపించేవాడు కవి
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకునేది మీరు
ఏమిటీ బ్రతుకులని యోచించేవాడు కవి
వాస్తవాలకు అద్దం పట్టేవాడు
అన్యాయం అక్రమాలకు అడ్డు నిలిచేవాడు
నిదురపోతున్న వ్యవస్థను మేల్కొలిపేవాడు
సత్ సమాజం కోసం ఆరాటపడేవాడు
జగతికి వెలుగులు పంచాలని తపించేవాడు
భువిలోని రవి - కవి

-హైమవతీ సత్య, వేల్పూరు, తణుకు తాలూకా, సెల్: 9014396007
**

మహిళ విశ్వరూపం

ఆధునిక మహిళ లలితా స్వరూపిణి
సహస్రబాహు! సహస్రాక్షి!
ఆలోచనలో, అవగాహన, ఆచరణలో
నాటి నుండి నేటి దాకా మహిళా శక్తిరూపం
రెండు చేతులతో, పది పనులు
ఒక మెదడు వంద ఆలోచనలు
ఒక చూపు వెయ్యి లక్ష్యాల గురి
సకల కళా ప్రవీణ

ఇంటి పనులు, బయట ఉపాధి బాధ్యతలు
ఏక కాలాన సమన్వయం, మేథోయోధురాలు
కాలానికన్నా ముందుండి
లక్ష్య సాధనలో ముందడుగు వేస్తూ
తనకంటూ ఒక ఉనికి, నలుగురిలో గుర్తింపు
ఇష్టమైన కళలో నైపుణ్యం, ఆధునిక మహిళోన్నతం!
భర్తకనురాగాన్ని పంచుతూ
పిల్లలకు ప్రేమ అందిస్తూ
అత్తమామల సేవ చేస్తూ
బంధువర్గాలకు తల్లో నాలుకలా
సంపాదనలో తోడునందించి
సమాజానికుపయోగపడ్తూ
వివక్షతనధిగమిస్తూ ప్రణాళికలు రచిస్తూ
ఊహా రచనలు చేస్తూ
ఆధునిక మహిళ అనంత రూపాలతో
బహుముఖ ప్రజ్ఞాశాలిలా దర్శనం!
సీతలా సహనం, రుద్రమలా పౌరుషం
ఐటిలో మేటిగా, సాంకేతిక రంగాన్ని శాసిస్తూ
కార్పొరేట్ రంగ ఏలికలా, దేశానికి పాలికయై
బ్యాంకుల చైర్‌పర్సనై
సమాజానికి మార్గదర్శిగా
మానవతామూర్తులుగా
సంగీత, సాహిత్య, సరస్వతీ స్వరూపాల్లా
ఆధునిక మహిళ విశ్వరూపం

- యు శైలజ, రాజమహేంద్రవరం, 9440247596
**

ఆకాంక్ష

మారుతున్న కాలంలో
కరుగుతున్నది మానవత్వం
తరుగుతున్నది మనోధైర్యం

పేదాగొప్ప వివక్ష
కట్టిస్తున్నది కక్ష
నేడు మహిళకు లేదు రక్ష
ఏ తప్పూ లేకుండానే శిక్ష
ఎవరూ చేయరు దీనిపై సమీక్ష
న్యాయం కోసం ఏళ్లూ పూళ్లూ ప్రతీక్ష
ఏ బుద్ధుడో, మహాత్ముడో
మళ్లీ వచ్చిపెడితే అహింసా భిక్ష
ఇస్తే శాంతి దీక్ష
జగమంతా మంచీ, మమతా
మళ్లీ విలసిల్లాలని నా ఆకాంక్ష

- పంపన సాయిబాబు
సెల్: 9652801014