నెల్లూరు

నిజమైన హీరోలు వికలాంగులే (స్పందన )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం మెరుపులో పెండ్యాల గాయిత్రి గారు అద్భుతంగా మలిచిన కథ సారీ వాస్తవ దృశ్యరూపం ఎస్కార్టు. ఈ కథ చదవడానికి పెద్దదిగా వున్నా చదువుకుంటూ పోతే అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపించింది. ముఖ్యంగా రచయిత ఎంచుకున్న విషయం ఎంతో గొప్ప అంశం. ముఖ్యంగా కథలను పలు రకాలుగా రాస్తూ వుంటారు కవులు. అయితే ప్రత్యేకంగా వికలాంగులపై మాత్రమే కథ రాయాలనే తలంపే ఈ కథ విజయానికి కారణం. సమాజంలో వికలాంగుల అవకాశాలను ఎలా సకలాంగులు వాడుకుంటున్నారో ఆవేదనభరితంగా చూపిన తీరు బాగుంది. చిన్నచిన్న లోపాలున్నంత మాత్రాన వికలాంగులను చిన్నతనంగా చూడొద్దు అనే అంతర్గత సందేశాన్ని కథలో చొప్పించారు. మనం కాస్త చేయూతనిస్తే వికలాంగులే నిజమైన హీరోలుగా రాణిస్తారు. కథ చాలా సందేశాత్మంగా సాగింది. గాయిత్రి గారికి ధన్యవాదములు.
- పాశం సాయిరాజా, ఎన్.బి. కె. ఆర్., విద్యానగర్
- స్ఫూర్తిరేఖ (పి.హెచ్.), ఒంగోలు

ఫాదర్స్‌డే కవితలన్నీ బాగున్నాయి
గతవారం మెరుపులో ప్రచురించిన ఫాదర్స్‌డే కవితలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా గోవిందరాజు సుభద్రాదేవి గారు రాసిన నాన్నకు ప్రేమతో కవితలో ఓ ఆడపిల్ల తన తండ్రి గురించి పడే ఆవేదనను వర్ణించిన తీరు ఆకట్టుకుంది. అలాగే నాన్న ఓ ఆత్మయోగి, నాన్న కవితలు కూడా బాగున్నాయి.
- అనసూయమ్మ, కచ్చేరిమిట్ట,కావలి
- హైమావతి తలపుల, పీలేరు
- సుగుణ ఆచారి, సెయింటాన్స్,మార్కాపురం

యోగా డే కవిత ఆకట్టుకుంది
చిన్నచిన్న పదాలతో యోగా గొప్పతనాన్ని చాటిన కవిత యోగా. యోగా గురించి ఎప్పుడు ఎవ్వరూ రాసిన అది కొత్తగానే వుంటుంది. మోహన్‌రాజు గారు తనదైన శైలిలో యోగాడే కవితను రాశారు.
- శ్రీ్ధర్, దూర్జటినగర్, గూడూరు
- సుబ్రమణ్యం, ఆర్‌సిరోడ్డు, తిరుపతి
***

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net