విజయవాడ

మహాయోగీ.. ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ విశ్వమానవుడా
మా వివేకానందుడా!
రామకృష్ణుని ఆత్మవై
భరతమాత ముద్దుబిడ్డవై
విశ్వమానవాళిని జాగృతమొనర్చిన ధీరుడవు
ఖండఖండాంతరాల్లో భారత ఖ్యాతిని
రెపరెపలాడించిన ఆధ్యాత్మిక యోధుడవు

మతమంటే మానవ హితాన్ని కోరేదనీ
వేదాంతమంటే సకలార్థ సాధనమనీ
గీతతో రాతలు మార్చవచ్చనీ
కర్మయోగాన్ని విపులీకరించిన మహారుషివి

విస్తరణే జీవితమనీ
సంకుచితత్వమే మరణమనీ
ప్రేమతత్వమే జీవ చిహ్నమనీ
ద్వేషభావం మరణ సదృశమనీ
దీనజనోద్ధరణే దైవ సమ్మతమనీ
చికాగోలో ఎలుగెత్తి చాటావు
సర్వమతాల సారం ‘కరుణే’నన్నావు

దరిద్రనారాయణ శబ్దాన్ని సృష్టించి
అన్నార్తుల ఆకలి తీర్చని మతాలను నిరసించి
యువశక్తితో దేశాభివృద్ధిని కాంక్షించి
విశ్వానే్న చైతన్యమొనర్చిన తపశ్శాలివి

ఆశ మనకు అస్తమ్రనీ
శ్వాస మనకు శస్తమ్రనీ
భారతదేశం గురుస్థానమనీ
వేదభూమి మనదనీ
విజ్ఞానగని మన నేలనీ
ఈ మట్టిపై జనియించుట యోగమనీ
ఈ నేలపై మరణించుట మోక్షమనీ
దేశభక్తి బోధలతో పులకింపజేసిన బోధకుడివి

బాపూలాంటి వారెందరికో మార్గదర్శివి
ఎందరో నిర్భాగ్యులకు ఆశాజ్యోతివి
జగతికే ఆధ్యాత్మిక ఆకలితీర్చిన మహాయోగివి
దేశ సౌభాగ్యం కోసం నిరంతరం తపించిన స్వాప్నికుడివి

మరోమారు ఈ నేలపై జనియించు
దివి నుండి నీ దీవెనలందించు!

- మద్ది పుల్లారావు,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9951287113
**

జ్ఞానం

జ్ఞానం తపించేవారు ఎక్కువే
పరమార్థం.. క్వశ్చన్ మార్క్
ఉపాధి కోసం మాత్రమేనా?
బతుకు తెరువు.. కండపుష్టి, నైపుణ్యం
జ్ఞానానికి ఆస్తితత్వం.. ఎరుక?
ఏదోఒక పని జీవికకు
ఎలా జీవించాలో ఎందరికి తెలుసు!
ఆర్ట్ ఆఫ్ లివింగ్.. మళ్లీ పేరొకటి
ఆరాటాలు, అలసటలు వృథా..వృథా!
అవసరాలకూ హద్దుండాలి
జ్ఞానానికి పరిమితిలేదు
సృజనలేని జీవితం వృథా.. వృథా
భయం, నిరాశ, విచారం
ఇవేగా మన మానసిక ప్రపంచం
ఉరుకులు పరుగుల జీవితం
మనసు పొరలకు అడ్డుకట్ట
ఆనందానికి దారి సహజ జీవనం
నవ్వొస్తే నవ్వాలి ఏడుపొస్తే ఏడ్వాలి
అహం అడ్డు..
మనకేం కావాలో మనకే తెలీదు
లోకపు చీకటి మనకెందుకు?
పుస్తకాలలోనే ఉండదు జ్ఞానం
జీవితాలను చదవాలి
నీరు, గాలి, చెట్టు, పిట్ట
అంతా ఆనందం
మనసు పొరలు తొలగితే
మస్తకాన మానవీయ స్పర్శ ఉంటే..!

- ముక్కా సత్యనారాయణ,
పెనుగంచిప్రోలు
చరవాణి : 9441120047
**

బాలమురళికి పద్యనివాళులివియె

వినివిని పద్మసంభవుడు విష్ణు కథల్ పలుమార్లు నిత్యమున్
పనివడి పాడ నారదుడపార మనోజ్ఞ రసానుభూతి యే
లనొ విసుగందెనేమొ! సుధలన్ కురిపించెడి బాలకృష్ణు నే
విన, గొనిపోయె; క్షోణిగల పెన్నిధి గానకళా విశారదున్

పోటీ చేయ సమర్థులయ్యెదరె! ఈ పుణ్యావనిన్ పుట్టి బల్
రాటుల్ దేలిన గానకోవిదునకున్, రాగాల రత్నానికిన్
మేటుల్ నారద తుంబురుల్, లయలతో మేల్‌గానమాలాపనన్
సాటి లోకమునందు లేరితనికిన్, సారించి వీక్షించినన్

గానమె రూపమై మురళిగా జనియించెను కృష్ణునంశ, న
ద్దానిని ఆశ్రయించినవి ధన్యతనొందగ వాణివీశా, యిం
పైన విశిష్ట వాద్యములపారము, కూడి స్వరాభిషేకమున్
తానన తానయంచు బహుధా జరిపించె ప్రపంచమంతటన్

బాలుడు కాదతండు ప్రతిభామతి, నాటి త్రివిక్రమాత్మునే
బోలి క్షణక్షణంబెదిగి ముగ్ధమనోహర రాగసంపదల్
హేల గడించి శిష్యతతికిచ్చిన మేటి, మహానుభావుడున్
చాలడె ‘మోహనుం’డొకడు చాటగ నద్దియుదాహరింపగన్

గానమె ప్రాణమై వరలు, గాత్రముకాదులె మూగబోయి ప్ర
స్థానము చేసినట్టిది, విశాల ధరాతలమందు నెందరో
గానకళావిశారదుల గాత్రములే పలుకన్ వశాంకె, హా!
మా నయనాల రాలినవి మల్లడిచే ఝరులౌచు బాష్పమల్

మురళిగానము లేదిక మునుపటివలె
వీణతంత్రులు సైతంబు ‘పెరిగి’పోయి
తలలు వంచి విధికి ప్రార్థనలొనరించు
చుండె మమ్మేలనిచ్చటే యుంచి తంచు!

- కలవకొలను సూర్యనారాయణ, గుంటూరు.
చరవాణి : 9849268659