విశాఖపట్నం

పూలవృష్టి ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపుగా పెరిగిన కొమ్మల్లోంచి
గుత్తులు గుత్తులుగా
భూత భవిష్యత్ వర్తమానాలనే
త్రికాలాలను సూచిస్తూ
మొగ్గలై పూవులై వడలిన పూరేకులై
నేలంతా పరుచుకుని పరిమళాలను వెదజల్లుతూ
నీలమేఘశ్యాముని మెడలో
తెలతెల్లని పూమాలగా మురిసిపోయే వేళ
దారమే అవసరం లేని కాడలని మడచి
మాలగా అల్లిన రోజులు
మరి నేడు ఈ పూవులిపుడు పనికి రావటగా
ఓ ప్రవచనకర్త కొత్త సిద్ధాంతం
నిదురపోవడం నా వంతు‚
పూలపైన నడిచిపోవడం నీ వంతు
రేపటి రోజున పున్నాగచెట్టా?
అదెలా ఉంటుంది?
ఒక్క మొక్కని నీ ఇంట నాటరాదా?
జలజలా పూలవృష్టి కురిపిస్తూనే ఉంటుంది
ఇక ఇల్లంతా పరిమళాలు
వెదజల్లుతూనే ఉంటుంది!

- చివుకుల శ్రీలక్ష్మి, సెల్ : 9441957325.

**
పిచ్చుకా...

నీవెంత నేర్పరివే
చిన్నిచిన్ని
గడ్డిపూసల
ఎడ్డని నుండో
ఏరితెచ్చి
నేర్పుతో
గూడు కట్టే
కొమ్మకు
బంధాలు వేసి
గాలికి ఊయలలూగుతుంటే
కళాకారులంతా
నీ ముందు దిగదుడుపే
పిచ్చుకా నీవెంత నేర్పిరివే

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి. సెల్ : 9246666585.
**

జరగాలి సమన్యాయం

అవినీతి అంతానికి పడింది
ఒక ముందడుగు
ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడై
చెడుపై యుద్ధం చేయాలి ఒక పిడుగై
మార్పు కోసం పోరాడే ప్రతి ఒక్కరికి
అడుగులో అడుగై బాసట కావాలి తోడై
ప్రతి ఒక్కరు ఒక్కో అస్తమ్రై
చీకటిపై పోరాడాలి వెలుగై
ఇక ఉండకూడదు నల్లధనం,
అవినీతి, స్వార్ధం
అంతా కలసి నడవాలి
భారత్ మహాన్‌కై
అప్పుడే సిద్ధిస్తుంది
ప్రజాస్వామ్య సమాజం
నాడే జరుగుతుంది అందరికీ
సమన్యాయం

- నాగాస్త్రం నాగు, వడ్లపూడి,
సెల్ : 9966023970.
**

**
రచిస్తూ.. రచిస్తూ....

తెల్లటి దుప్పటి కప్పిన
వెచ్చని బూరుగదూది పరుపుపై
పసి నవ్వుల బాలుడిలా
నిండు చంద్రుని ఒడిలో
నేను ప్రేమ పాలు కుడుస్తున్నట్లు
అమరలోకం నుండి నాట్యకన్యలు
నాకోసం అర్రులు చాస్తూ
ఆహ్వానం పలుకుతున్నట్లు
ఆకురాయితో మనసు కొడవలికి
పదును పెట్టి
చీకటి కొండల్ని పగులగొడుతూ
మాటలకందని కలల
ప్రపంచంలోకి నేను ప్రయాణిస్తున్నట్లు
రాగాల రెక్కలపై నిత్యనూతన
నిఘాగీతాల్ని రచిస్తూ
ఫీనిక్స్ పక్షిలా నింగిలోకి
నేను ఎగిరిపోతున్నట్లు
మానవత్వపు వెర్రివెతుకులాటలో
నిదురపోలేదు
కన్నీరు చెమ్మను తుడిచి
నిశ్శబ్దంగా నాలోంచి తప్పుకున్నట్లు
చూపుల చౌరస్తాలో నిలబడి
నాణ్యమైన మనిషితనాన్ని అనే్వషిస్తూ
ఆత్మీయ వియోగపు దు:ఖభారంతో
కోల్పోయిన శీతల స్పర్శల్ని
నేను వెతుక్కుంటున్నట్లు
లేచి, కళ్లు నులుముకుని
బాసింపట్టు వేసుకుని
నడి మంచం మీద కూర్చున్నాను
తన దేహాన్ని విస్తరించుకుని
కిటికీలోంచి చేతులు చాచి
నా ముఖాన్ని లాగి
ముద్దు పెట్టుకుంటున్నాయి
లేత గోధుమ వనె్న సూర్యకిరణాలు

కె. విల్సన్‌రావు