విశాఖపట్నం

మనిషీ ఎటు పయనం?( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకల్పబలం, సహృదయతే
మనిషికి సర్వవేళలా మది నిండాలి
కార్యదక్షత తోడైతే
కార్యోన్ముఖుడైతే
ఉన్నతాశయ శిఖర పయనంలో
విజయఫలం లభ్యం
నిండు మనిషికి ఆవశ్యం
శుభ సూచి
మఖవరస్సుతో
నిత్య సంతోషిలా
విరాజిల్లాలి
నిత్యానంద స్వరూపమే
నిత్య శుభాశీర్వచనమే
మనిషికి శుభాహ్వానం
మనిషి కృషియే పరమావధిగా
సర్వజన శ్రేయోగామిగా
నిస్వార్థ్భాముఖుడై
మనిషి పయనించాలి
బంగరు భవితవ్యంకై
వెలుగులద్దాలి

- యలమంచిలి శివాజీ,
పినగాడి రోడ్డు, పెందుర్తి,
విశాఖపట్నం-530047.
**

పులకింత

రాగాలు తీస్తూనే మైమరచిపోయావు
చిరుగాలి తరగలకే చిందులేశావు
ఏటికే నీవింక ఎనలేని హొయలు
వయసు ఊహలు నీలో వగలు వేసేను
ఏటిగట్టున నువ్వు ఎగసి పడకే ఎంకి
గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతలయ్యేను
నీటిలోన నావ నీవంక చూసేను
కన్ను కొట్టి చిలిపిగా చెంగులాగేను
మందారం నిను చూసి
మకరందమొలికించ
చిగురాకు నీ చెంప
చిలిపిగా తడిమేను
కనె్నపిల్లను చూడ ఉరకలేసును నది
నిను చూచి ముచ్చటగ
పరుగులెత్తేను మది
గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
నీ ధ్యాసతో నాకు పేణాలు తీయకే
నా మదిలో రేపమాకే సెగలు

- శివానీ, శృంగవరపుకోట.
**
నిత్య కల్యాణం

శాస్త్ర సాంకేతిక ప్రగతి మెరుగైన జీవనానికి
కావాలి చేయూత
నూతన ఆవిష్కరణలు అందించాలి
శాంతిమయ సమాజాన్ని
కానీ నేడు సెల్‌ఫోన్, వాట్సాప్, ఫేస్‌బుక్ అన్నీ
మానవాళి వినాశనానికే దారి చూపుతున్నాయి
అన్నింట్లోను మంచిని చూసే లోచూపు
లేకపోవడం వల్లే ఈ అనర్థాలు
అందుకే మిత్రమా ఆలోచన మార్చుకో
అభ్యుదయం బాటన సాగిపో
అప్పుడే నిత్యకల్యాణం పచ్చతోరణం
అవుతుంది ఈ జగం!

- పుష్ప గుర్రాల, విజయనగరం. 9949040924.
**
ప్రశ్న

గమనం గాలిని ప్రశ్నిస్తుంది
గాయం గుండెని నిలదీస్తుంది
యుగాలు స్వప్నాలుగా చిరకాలం ఉంటే
చెదిరిపోతున్న శరీరాలు
జీర్ణమవుతున్న జీవితాలు
ఏ నదిలో ప్రవహించాలి
ఏ శతాబ్దాన్ని ప్రశ్నించాలి
మనిషి నిర్మాణం మట్టిగా
పాతర అవుతుంటే
ప్రశ్నలు బందిఖానాల్లో మూలుగుతున్నాయి

- కోనే సతీష్,

శ్రీకాకుళం.
సెల్ : 7675924944.
**

మొగ్గ విలాపం

ఓ తల్లులారా ఓ స్ర్తిమూర్తులారా
మీరు చేస్తున్నన్నదేమిటి?
మీ పూజలకి, వ్రతాలకి, నోములకి
నన్ను పూజించిన ఫలం కావాలి
దానికై మీరు చేస్తున్న పాపం తెలుసా?
కడుపులో శిశువును హతమార్చిన రీతిన
విరిసీ విరియని నన్ను, వేళాపాళా చూడక
నన్ను నిద్రపోనివ్వరు, విచ్చుకోనివ్వరు
నా తల్లి కడుపు నుండి తుంచుతున్నారే
కోటి పుణ్యాలఫలం గంగలో కలిసినట్లు
నన్ను భగవంతునికి సమర్పించిన
పూజాఫలం దక్కుతుందా?
పుణ్యం కంటే పాపమే ఎక్కువ
చెట్టు నుండి నన్ను తుంచకండి
సంపూర్తిగా ఎదగనివ్వండి
నా ఉసురు పోసుకుని
మీరు నాశనం కాకండి
ఇది మొగ్గ విలాపం

- జి.ఎస్.కె. సాయిబాబా,
అనకాపల్లి. సెల్ : 9248173116.
**