విశాఖపట్నం

జీవన వ్యూహం ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకు శ్రావణ్ ఉద్యోగం కోసం దుబాయ్‌కి, కూతురు ప్రమీల భర్త వినోద్‌తో కలసి అమెరికాకి వెళ్లిపోవడంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు ఉమాపతి, అనురాధ.
ఓరోజు ఉమాపతి సెల్‌కి కొడుకు శ్రావణ్ వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు.
‘గౌరవనీయులైన నాన్నగారికి ...
నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మంచి ఉద్యోగం, ఉద్యోగానికి తగ్గట్లు జీతం. అంతా బాగుంది. అమ్మ అన్నట్లు నేను ఇక్కడ ఎటువంటి కష్టాలు పడడంలేదు. నాకు ఇక్కడ మంచి హోదా ఉంది. ఎందుకు నాన్నా చిన్నప్పటి నుండి అమ్మకు నాపై కోపం. నేనేం చేసినా తప్పు అంటుంది. దుబాయ్ వెళ్లొద్దు మంచిది కాదు అని అప్పుడు నన్ను ఎంతో విసిగించింది. కానీ నువ్వు నన్ను అర్ధం చేసుకుని పంపించావు. నా జీవితం అనుకున్న దాని కంటే ఇంకా బాగుంది. నగరంలోని టాప్ కాలేజీలో నన్ను చదవవద్దని, అక్కడ నేను చదవలేనని అమ్మ ఎప్పుడూ కోప్పడుతూ ఉండేది. అక్కడే చదివి ఉన్నతంగా ఎదిగాను. అమ్మ అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో నాకు అర్ధం కాదు. కాలేజీ కుర్రాళ్లతో తిరగవద్దు చెడిపోతావు అని ఎన్నిసార్లు చెప్పిందో గుర్తు లేదు. కానీ మీరు వారించేవారు. అయితే అమ్మ అనుకున్నట్లు నేను కాలేజీ చదువు సమయంలో చెడిపోలేదు. అమ్మ మీలా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పటికైనా అమ్మకి చెప్పండి ఎల్లవేళలా వ్యతిరేక భావాలతో జీవించవద్దని. నా ఎదుగుదలని చూసి మీరెంత సంతోషపడుతున్నారో అమ్మకి చెప్పి తనని సంతోషంగా ఉండమని చెప్పండి’
ఇట్లు మీ కుమారుడు
శ్రావణ్.
ఇదిలా ఉంటే వంటింట్లో పని చేస్తున్న అనురాధ వాట్సప్‌కి కూడా కూతురు ప్రమీల నుండి మెసేజ్ వచ్చింది.
‘అమ్మా...
నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నాన్న అనుకున్నట్లు వినోద్‌ది మామూలు జాబ్ కాదు. చాలా పెద్ద స్థాయి గల ఉద్యోగం. ఎందుకమ్మా నాన్నకి నీ అంత మంచి మనసు లేదు. వినోద్‌ని నువ్వు చక్కగా అర్థం చేసుకున్నట్లు నాన్న ఎందుకు అర్థం చేసుకోరు? నా చదువు విషయంలో కూడా నాన్న ఎప్పుడూ సరిగ్గా ఆలోచించేవారు కాదు. నేను ప్రేమించిన వినోద్ విషయంలో ఏదో ఒక రాద్ధాంతం చేసేవారు. రాత్రిళ్లు కాలేజీ నుండి ఆలస్యంగా వస్తే ఏదో ఒకటి అనేవారు. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగేవి. కానీ నువ్వు అర్ధం చేసుకుని ఆయనకి మరింత కోపం రాకుండా రక్షించేదానివి. వయసు ఇరవై దాటినా ఇంకా చిన్నపిల్లలకి చెప్పినట్లు చెప్పేవారు. అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చేది. నా ప్రేమ విషయం ముందుగా నీకే చెప్పాను. తర్వాత నాన్నగారికి తెలిసినా శాంతియుతంగా జరగాల్సింది చిన్నచిన్న అవాంతరాలతో జరిగిపోయింది. నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను. ఇప్పటికైనా నా మీద తగ్గించుకుని ప్రేమను పంచమని చెబుతావని కోరుతున్నాను.
- ఇట్లు మీ కుమార్తె ప్రమీల’
వెంటనే మెసేజ్‌ను చూపించింది అనురాధ భర్త ఉమాపతికి. ఉమాపతి కూడా కొడుకు మెసేజ్‌ని చూపించాడు.
‘‘రాధా మన నిర్ణయాలు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇద్దరికీ మనం సమానమైన ప్రేమను చూపిస్తే ఇలాంటి అభివృద్ధి కనిపించకపోను. మనం ఇలా మనిషొకలా ఉండడం వల్లే పిల్లల భావాలు, వారి ప్రవర్తన, వారి స్నేహితులు, వారు ప్రవర్తిస్తున్న తీరు మనకి ఎప్పటికప్పుడు తెలిసి వచ్చి సరైన నిర్ణయాలు తెలుసుకునే వీలు కలిగింది. వారికి కూడా పాడింది పాటలా కాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే నేర్పు అబ్బేలా చేసింది’’ అన్నాడు ఉమాపతి.
‘‘అవునండి ఇద్దరం పిల్లల్ని ఏకరీతిన సమర్ధించినట్లు కాకుండా, ఒకరు పాజిటివ్‌గా, ఒకరు నెగటివ్‌గా ఉండడం వల్లే వాళ్లకి మంచేదో చెడేదో తెలిసి జాగ్రత్తగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు’’ అంది అనురాధ చిరునవ్వుతో భర్తని చూస్తూ.

- నల్లపాటి సురేంద్ర,
గాజువాక, సెల్ : 9490792553.

- నల్లపాటి సురేంద్ర