విశాఖపట్నం

కార్పొరేట్ కల్చర్ (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటరాఘవపురంలో మునసబుగా పని చేసాడు నవనీతంనాయుడు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో అతని ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. అతని మనవడు నవీన్. అతను ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ చేస్తున్నాడు. అక్కడే అశ్విని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు ఇంట్లో వాళ్ల నుండి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాదని అతను భావించాడు. అయితే విషయం తెలిసిన నవనీతంనాయుడు మండిపడ్డాడు. ‘‘ఇంటా వంటా లేని పనులు చేస్తావా?’’ అంటూ మనవడి మీద విరుచుకుపడ్డాడు. పెద్దత్త కూతురు స్వప్నని చేసుకోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే నవీన్ తాత వ్యతిరేకతను పట్టించుకోలేదు.
‘‘చిన్నప్పటి నుండి స్వప్నని ఆ దృష్టితో చూడలేదు. మీకు ఓకే అయితే పెళ్లి ఇక్కడ జరుగుతుంది. లేదంటే ముంబయిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను’’ అని ఖరాఖండిగా చెప్పేసాడు.
దాంతో నవనీతంనాయుడికి తగ్గక తప్పలేదు.
* * *
అశ్విని తండ్రి రిటైర్డ్ నావల్ ఆఫీసర్. అతను పెళ్లి పల్లెటూరిలో వద్దన్నాడు. దాంతో వైజాగ్‌లోని ఒక హోటల్లో పెళ్లి ఏర్పాటు చేశారు. అలా జరగడం నవనీతంనాయుడికి నచ్చలేదు. పెళ్లికి ఇరువైపుల ఇరవై మంది మాత్రమే బంధువులు వచ్చారు. పెళ్లి కాగానే అంతా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. వాళ్లతో పాటు నవీన్‌ని తీసుకుపోయారు. నెల రోజుల తర్వాత నవీన్ భార్యని తీసుకుని వచ్చాడు. గంట కుటుంబ సభ్యులతో గడిపి హోటల్‌కి వెళ్లిపోయాడు భార్యతో. అశ్విని అందరితో బాగానే మాట్లాడింది. అయితే ఆమెకి ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టం ఉన్నట్లు మాత్రం లేదు.
* * *
నవీన్ ముంబయిలో ఒక ఇండస్ట్రీ ప్రారంభించాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వాళ్లు డెహ్రాడూన్ స్కూల్లో చదువుతున్నారు.
నవనీతంనాయుడికి తొంభై రెండేళ్లు వచ్చాయి. ఆ మధ్య నవీన్ తండ్రి గుండెపోటు వచ్చి చనిపోయాడు. తల్లి దిగులుతో మంచం పట్టింది. అది జరిగిన వారం రోజులకి నవీన్ వచ్చి మొక్కుబడిగా అందరినీ పలకరించి వెళ్లిపోయాడు.
కార్పొరేట్ కల్చర్ మనవడిని ఎంత మార్చేసిందో నవనీతంనాయుడికి అర్ధం అయింది. సొంత తండ్రి చనిపోయిన వారం తరువాత వచ్చి మర్నాడే వెళ్లిపోయిన అతని దగాకోరుతనం నవనీతంనాయుడికి నచ్చలేదు. కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకున్నాడు.
‘‘నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. పొరపాటున కూడా నా చావు కబురు నవీన్‌కి చెప్పకండి. వాడి సానుభూతి నాకు వద్దు’’ అని ప్రమాణం చేయించుకున్నాడు.
ఒక కార్పొరేట్ నల్లిని అలా నలిపేసి సంతృప్తిపడ్డాడు అతను.

- ఎం.వి. స్వామి, చోడవరం, విశాఖ జిల్లా - 531036. సెల్ : 9441571505.