నెల్లూరు

రాయివిలువ ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయి రప్ప అంటామే గానీ
రాళ్లకూ విలువుంటుందని
జరిగిపోయిన రాతియుగంలో
రాళ్లు రాజేసిన నిప్పు నిజం చెప్తుంది
రాతి పనిముట్లు, ఆయుధాలు
ఇందుకు సాక్షీభూతమై నిలుస్తాయి

రాతిని తక్కువ అంచనా వేయకు
రాముడిపాదం తాకిన రాయి అహల్యగా మారింది
రాయి రాయి కలిపిన వారధే
లంకానగరానికి దారితీసింది
రాయిని తొలిస్తే రోలు అవుతుంది
రాయిని మలిస్తే శివలింగవౌతుంది
రాయిని తీర్చిదిద్దితే దేవతా విగ్రహమై
చేతులెత్తి మొక్కిస్తుంది

శిల్పి చేతి నైపుణ్యానికి తార్కాణం
హంపి ఏకశిలారథం ప్రసిద్ధికెక్కింది
రాతి స్తంభాలలో సరిగమల
సంగీత సప్తస్వరాలు ధ్వనింపచేసే
ఖ్యాతి మనకే దక్కింది

నీడ జాడ పాడనీ గోపురం
సూర్యకిరణాలు అర్కుని పాదాలు తాకే
కోణార్క దేవాలయం
గాలిలో వేలాడే రాతిస్తంభం
జక్కన్న మలచిన బేలూరు, హలిబేడు
శిల్పసౌందర్యం విశ్వఖ్యాతి పొందింది
తాజ్‌మహల్ నిర్మాణానికి సొగసులద్దినవి
రాళ్లే కదా
మొహింజదారో, హరప్పా నాగరికత
తెలిపింది రాతికట్టడాలే కదా
ఎల్లోరా ఎలిఫెంటా గుహల్లో శిల్పాలు దేవతలు,
యుగపురుషుల చరిత్రలు
తరతరాలకు అందించాయి

రాతిపలకలలో రాతిబలపాలు
ఓంకారాలు దిద్దించి
అక్షరాభ్యాసం చేయిస్తాయి
సున్నపురాళ్లు ముత్యాలముగ్గులై అందాల్నిస్తాయి
గులకరాళ్లు నలిగి నీ వాహనానికి
రహదార్లు వేస్తాయి
రైలు పట్టాల కింద కంకర రైలుబండిని
కంపన, ప్రతికంపనలు
నియంత్రించి ఋజుమార్గంలో నడిపిస్తాయి
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో స్తంభాల కింద పోసిన కంకర విద్యుత్ అవరోధాలను అరికడతాయి
మార్బుల్ రాయితో చెక్కిన ప్రతిమలు
అపురూపమై కనువిందు చేస్తాయి

రాయిరాయి పేరిస్తే గోడ అవుతుంది
గోడలు దగ్గరై ఇంతింతై ఇల్లై నిలుస్తుంది
నాలుగు రాళ్లు వెనకేసుకోవడం అంటారేగాని
ఈనాడు రాళ్లే సంపదలు కలిగిస్తున్నాయి
క్వారీరాళ్లతో అపురూప ఆభరణాలు
రూపుదిద్దుకుంటాయి

రాతి యుగం నుండి
నడుస్తున్న యుగం వరకు
రాళ్లు చెప్పే కథలు ఎనె్నన్నో ఉంటాయి
శిలాశాసనాలు ఇతిహాసపు అట్టడుగు
కోణాలు స్పృశించి
చారిత్రాత్మక నిజాలు వెలికితీస్తాయి

అందుకేనేమో రాయి రప్ప కాదని
ఎన్నో విలువైన లోహాలున్నా
రాయి దేవుడై గర్భగుడిలో
మనల్ని మొక్కిస్తుంది

- కంచనపల్లి ద్వారకానాథ్
విజయలక్ష్మి వీధి, తిరుపతి
చరవాణి : 9985295605

**
అవును..

నిజమే కదా!
అమ్మాయంటే
లక్ష్మీ అంటారు.. అబద్ధం
అమ్మాయంటే
సరస్వతి అంటారు.. అబద్ధం
అమ్మాయంటే
దుర్గ అంటారు.. అబద్ధం
అమ్మాయంటే
మహాలక్ష్మీ అంటారు.. అబద్ధం
మన దేశంలో దేవతలకు గుళ్లు కట్టినట్లు
ఆడపిల్లలను గుండెల్లో పెట్టుకుని
చూసుకుంటారంటారు
ఇది ముమ్మాటికి అబద్ధం
మరి నిజమేమిటి? అంటారా..
దేవతలకు గుళ్లు.. ఆడపిల్లలకు సమాధులు
సమాధి దేనికి? అంటారా..
అమ్మాయి గౌరవానికి,స్వేచ్ఛా సమానత్వానికి,
ఆమె ప్రతి హక్కుకు, ఆమె ప్రతి అవకాశానికి..
ఇదేనా స్ర్తికి ఇచ్చే విలువ
ఇదేనా.. ఇదేనా..
ఈ దుస్థితి మారదా?

- ఆలకుంట రెడ్డి ప్రసాద్
వాల్మీకిపురం, చిత్తూరుజిల్లా
చరవాణి : 9848672587
**

కవిత
**
ఏది శాశ్వతం

హితులు ఎవరు..!
సుతులు ఎవరు..!
మాయ మాయ..అంతా మాయ..!
జగమే మాయ
మనిషి బతుకే మాయ
ఎవరికెవరు పుత్రుల్..మిత్రుల్
నీ పాపమెంత..! పుణ్యమెంత..!
ఎవరికెరుక..!
ఆటుపోట్లు... సూటుపోట్లు
హృదయపోట్లు ఎవరి కోసం
విమర్శరాని..! ప్రశంసరాని
నీ ప్రశంసతో..!నా దుఃఖాల్
నీ విమర్శతో..! నా సుఖాల్
తీరవు.. తీరవు.. తీరవు..
వస్తేరా..! పోతే..పో..!
ఎవరు రమ్మన్నారు..
ఎవరు పొమ్మన్నారు
నీవు రాకపోతే..కాలమాగునా..
అంతే కదా..!
ఆగితే ఆగని..! సాగితే సాగని
భయాల్ లేవు..! బాధల్ లేవ్..!
దేహ జీవాల మధ్య
మమతలు లేవ్..!
నాకెరుక
కావుకావు ఏవీ శాశ్వతం..!
రుచులెందుకు శుచులెందుకు
ఘడియ కూడ నమ్మకం లేని
దేహముల్
కోపమ్‌ల..శాపమ్‌ల
కష్టములకు భయమేల
సుఖములకు సుఖమేల
కావు కావు శాశ్వతం
నీకెరుకలే ఓ నీలకంఠ..!

- జాని తక్కెడశిల
బెంగళూరు చరవాణి : 9491977190
**

వెళ్లిపోయిన వాన

పచ్చని పైర్లు, పొలాలు
సెజ్‌లయి పోయాయి
రాజధానులై పోయాయి
రియల్ ఎస్టేట్లయి పోయాయి!
ఇక వర్షంతో పని ఏముందీ?
వ్యవసాయం చేసేవాడెవడు?
కాయకష్టం నమ్ముకునే వాడెవడు?
అందుకే వర్షం
అంతులేకుండా పోయింది
తనతో ఎవరికి పనిలేదని!

- గంగిశెట్టి శివకుమార్
చరవాణి : 9441895343
నెల్లూరు