దక్షిన తెలంగాణ

పురస్కారాలు బాధ్యత పెంచుతాయ (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతలను పెంచుతాయని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం పొందారు. అంతేగాక..అనేక సాహితీ సంస్థల నుండి పురస్కారాలను అందుకున్నారు. వరంగల్ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఆమె ‘ఒద్దిరాజు సోదరుల జీవితం - సాహిత్యం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందారు. కవితలు, కథలు, వ్యాసాలు రాసిన అనుభవం ఆమెకున్నది. ‘మెరుపు’ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరింప యత్నించింది. ముఖాముఖి వివరాలు ఆమె మాటల్లోనే..

ఆమీరు ఎన్నో ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు?
నా ఇరవై ఐదవ ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించాను. నా సృజన వెలుగులోకి రావడానికి దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలం పట్టింది. మా పెద్దన్నయ్య విప్లవ కవి పెండ్యాల కిషన్‌రావు ప్రోత్సాహంతో కవయిత్రిగా మారాను.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వం ఒక కళ.. దాన్ని ఉపాసించాలి. హృదయభావాలను భావ సౌందర్యంతో అక్షర సొబగులద్ది.. అభివ్యక్తీకరింపబడేదే కవిత్వం..

ఆ మీ ముద్రిత గ్రంథాల వివరాలు తెలుపుతారా?
‘కొండపల్లి శేషగిరి రావు గారి జీవిత చరిత్ర’, ‘పెండ్యాల రాఘవ రావు జీవిత ప్రస్థానం’ అనే జీవిత చరిత్రలు, ‘అర్రతలుపులు’, ‘నిర్నిద్రగానం’ అనే కవితా సంపుటాలు, ‘వ్యాసహారిక’ అనే వ్యాస సంకలనాన్ని వెలువరించాను. ‘అమెరికాలో ఆరునెలలు అనే యాత్రా చరిత్ర’, చిత్ర శిల్ప కళా రమణీయకం, ‘నా ప్రజా జీవితం’ వంటి గ్రంథాల రూపకల్పనలో నా భాగస్వామ్యముంది.

ఆ మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలు ఎవరు?
చిన్ని మాటల్లో పెద్ద భావాలను ప్రకటించిన దాశరథి గారి ప్రభావం నాపై ఉంది. మా నాన్న రాఘవరావు గారి వ్యక్తిత్వం కూడా నాపై ప్రభావం చూపింది.

ఆ మీకు నచ్చిన గ్రంథాలేవి?
చాలా వున్నవి. ఏ ఒక్కటో చెప్పడం కష్టం! పి.వి.నరసింహారావు గారి ‘ది ఇన్‌సైడర్’, ‘లోపలి మనిషి’ నాకు బాగా నచ్చింది.

ఆ మీరు ఒద్దిరాజు సోదరులపై పరిశోధన చేయడానికి
ప్రోత్సహించిందెవరు?
మా శ్రీవారు వేణుగోపాలరావు వృత్తిరీత్యా ఇంజనీరు అయినా సాహిత్యంపై మంచి అవగాహన ఉంది. ఆయన ప్రోత్సాహంతో పాటు ఒద్దిరాజు కుటుంబ సభ్యుల సహకారం నాకెంతో లభించింది.

ఆ రాజకీయంగా మీ కుటుంబ నేపథ్యాన్ని తెల్పండి?
మా బాపు పెండ్యాల రాఘవరావు గారు అజ్ఞాతంగా ఉండి నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించారు. ఆయన సాయుధ పోరాట వీరుడు.. ఆనాడు హరిజనోద్ధరణకు విశేష కృషి చేశారు. వరంగల్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పిడిఎఫ్ తరపున పోటీ చేసి దేశంలోనే రెండో మెజారిటీ ఓట్లు సాధించారు. ప్రజల గళాన్ని పార్లమెంటులో సమర్థంగా వినిపించిన ఘనత ఆయనకుంది.

ఆ మీ మామగారి చిత్రకళా విశేషాలను తెలుపుతారా?
మా మామ కొండపల్లి శేషగిరి రావు గారు చిత్రకళలో జాతీయ స్థాయి ఖ్యాతినార్జించారు. ఆనాడు రవీంద్రనాథ్ ఠాగోర్ స్థాపించిన శాంతినికేతన్‌లో చిత్రకళను అభ్యసించారు. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి అనేక మందిని చిత్రకారులుగా తీర్చిదిద్దారు. భారతీయ చిత్రకళకు జీవం పోసి అందరి మన్ననలు పొందారాయన!

ఆ నేటి తరాన్ని సాహిత్యం వైపు దృష్టి
మళ్లించాలంటే ఏం చేయాలి?
హైస్కూలు, కళాశాల స్థాయిలో విద్యార్థులను సాహిత్యం వైపు దృష్టి మళ్లించాలంటే అధ్యాపకులు నెలలో కొన్ని సాహిత్య సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలి. వారిలోని సృజనను వెలికి తీసి కుడ్య పత్రికలు నిర్వహించాలి.

ఆ నేటి కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు, సూచనలు ఏమిటి?
నేను సలహాలు, సూచనలిచ్చేంత పెద్దదాన్ని కాను.. అధ్యయనంపై దృష్టి సారించి రచనలలోని మెలకువలు తెలుసుకుంటూ తమ కలాలకు పదును పెట్టుకోవాలి.

ఆ నేడు మారుతున్న సమాజంలో ఇంకనూ
స్ర్తివాద కవిత్వం అవసరమంటారా?
అవసరమే! సమాజం ఎంత మారినా.. స్ర్తిల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది కదా!

ఆ సాహిత్య పురస్కారాలపై మీ అభిప్రాయం ఏమిటి?
సాహిత్య పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచుతాయి. అవసరమే..అయితే ప్రతిభకు పట్టం కట్టాలి. పారదర్శకత పాటించాలి.
ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి
రావాలంటే ఏం చేయాలి?
మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించాలి. కవులు, రచయితలు సైతం కుల మతాలకు అతీతంగా నిజాయితీగా పనిచేయాలి.
**
చిరునామా:
డాక్టర్ కొండపల్లి నీహారిణి
16-559, శ్రీ సాయి హోమ్స్
అల్మాస్‌గూడ, పో: బడంగ్‌పేట
సరూర్‌నగర్ మండలం
రంగారెడ్డి జిల్లా - 500058
సెల్.నం.986636008
**

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి,
సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544