ఉత్తర తెలంగాణ

ఎవరికి ఎరుక? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ మృదు మధుర స్వరం
తాత్కాలికమే సుమా!
ఎప్పుడు అది మూగబోతుందో
పెన వేసుకున్న
ఆత్మీయతానుబంధాలు
ఏవౌతాయో ఎవరికి ఎరుక?
ఇప్పుడున్న రహదారులన్నీ
మృత్యు లోగిళ్లవుతుంటే..
బయటికి వెళ్లిన వారు
తిరిగి ఇంటికి చేరుతారన్న
భరోసాలేదు!
నీ ఆశను శ్వాసను.
విశ్వంతరాల్లో
ఎప్పుడు ఏకం చేసుకుంటాయో తెలియదు!
నీ ప్రయాణం
నిత్యం ప్రశ్నార్థకమవుతుంటే..
మృత్యు ద్వారాలు స్వాగతం పలుకగా
ఆపడం ఎవరి తరం?
అందుకే మిత్రమా..తస్మాత్ జాగ్రత్త!
ఆత్మీయులకు శోకం మిగిలించక
అప్రమత్తంగా ఉండు!

- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551
**
కాలం

ప్రకృతి ప్రథమ సంతానం కాలం
ప్రాణికోటిది మలిపుట్టుక!
జీవితానికే కాలం
కాలానికి లేదు జీవితం!
కొలతలకు అతీతమైన కాలంతోనే
దేనికైనా కొలతల బేరీజు!
గుట్టు తెలియని కాలంతో
దేని గుట్టు అయినా రట్టు!
మహా విచిత్రమైనది కాలం..
అది ఒక బ్రహ్మాండమైన భ్రమ
ఒక జ్ఞాపకం.. ఒక మరపు
భిన్న విభిన్నాల సమ్మేళనంతో
నడిచే తత్వం!
ఏ ప్రాణి జీవితమైనా గడిచేది
ఆలోచనలు, ప్రణాళికల అమలులో
సంవత్సరాలు శ్వాసిస్తూ లెక్కిస్తూ కాదు!
చావు లేనిది.. కాలం
సకల మార్పులకు మూలం!
పక్షిలా ఎగిరే కాలానికి
పగలు, రాత్రులే..తెలుపు, నలుపు రెక్కలు!
పరుగెత్తుకు వెళ్లేవి మధుర దినాలు
పాకుతూ వెళ్లేవి గడ్డు గంటలు
మహా విచిత్రమైనది కాలం!

- ఆచార్య కడారు వీరారెడ్డి, హైదరాబాద్, సెల్.నం.7893366363
**

మిణుగురులు

భూమీద రెండు వేల జాతులతో మిణుగురుల సందోహం
ధృవప్రాంతాల్లో మినహా సర్వత్రా పరివ్యాప్తిచెందిన కీటకాలు
వాటి అత్యవసర కార్యకలాపాలన్నీ చిక్కటి చీకటిలోనే
ఆహారం ఆవాసం పునరుత్పత్తి,ఆత్మరక్షణోపాయాలు
కాంతిని వెదజల్లే ప్రకృతి సిద్ధ దృగ్విషయంలో
విభిన్న ప్రవృత్తులు ఎనె్నన్నో మినహాయింపులు
కొన్ని మిణుగురులకైతే కాంతి వెదజల్లే శక్తేలేదు
కొన్ని జాతుల్లో డింబకాలు, గుడ్లు సైతం మెరుస్తాయి
జంతువుల్లో కొన్ని ఏక కణ జీవుల నుండి చేపలవరకు
చీకటిలో మెరిసే ప్రక్రియ ప్రకృతికే అద్దిన అదనపు అందం
మిణుగురుల ఉదరభాగం క్రింద చూసికలాంటి ఉపాంగం
అందులో జరిగే రసాయన చర్యలే కాంతికి మూలం
వెదజల్లే కాంతిలో సప్తవర్ణాలు కనబడక పోయినా
పసుపు, లేత ఎర్రరంగు, ఆకుపచ్చ నారింజ రంగులు ఉంటాయి
ఇచ్ఛాపూర్వకంగా వెలువరించిన కాంతి వలయాలు
క్రమంగా పచ్చగా వెలసిపోయి తెల్లగా చల్లగా ఉన్నా
వర్ణం మారిపోవడంలో అలసత్వం చూపడం తుదిమెరుపు
చిమ్మచీకట్లో చిమ్మెట్ల పాటల గాత్రకచేరి వేళ
మిణుగురుల చల్లని సమష్టి కాంతి పుంజాలు దారిచూపుతాయి
అదృశ్యం ప్రకృతి సంబరంతో వెలిగించిన కొవ్వొత్తుల దీపతోరణాలే!!

- ఆచార్య పసుల వెంకటరెడ్డి
వరంగల్, సెల్.నం.9849695603
**

ధృవతార

అలసత్వం చేయకు నేస్తమా!
అలుపెరుగని పోరాటం చేస్తే
దాసోహమంటుంది సమస్తం
ఉక్కు కండరాలు ఇనుపనరాలున్న నీవు
కొండల్ని సైతం పిండి చేయగలవు
పిరికి పందలై మూలన కూర్చుంటే
ముసలి నక్కైన నిన్ను చూసి మొరుగుతుంది
పూటకు పిడికెడు తిండి లేకుండా చేస్తుంది
నీ శక్తిని నీవు తెలుసుకుని మసులుకుంటే
స్వయం శక్తితో ఎదుగుతుంటే
సమస్యలన్ని మటుమాయం
సర్వ సంపదలన్ని నీ సొంతం
చీ దరించుకున్న వారే ఆదరిస్తారు
నీ అడుగు జాడల్లో నడుస్తారు
ఆదర్శంగా నిన్ను తోసుకుంటారు
అడుగడుగున నిన్ను మెచ్చుకుంటారు
మేను వంచిన నాడు మేరు పర్వతాన్ని అధిరోహిస్తావు
ఆకాశమంత ఎదుగుతావు
ధృవతారగా విశ్వంలో నిలుస్తావు

- జాధవ్ పుండలిక్ రావు పాటిల్
గోపాల్‌నగర్, భైంసా, నిర్మల్ జిల్లా
సెల్.నం.9441333315
**

మొక్కకి మొక్క..!

ప్రతి ముద్దకి తానే పురుడు పోస్తున్నప్పుడు
ప్రతి శ్వాసకి తానే ఆయువునిస్తన్నప్పుడు
ప్రతి గూడుకి తానే ఊతమవుతున్నప్పుడు
ప్రతి గుండెను తడిమి ఊరడిస్తున్నప్పుడు
చెట్టూ నీ బంధువైందని మరిచాలా..!!
చేరదీసి పోషించాలని
ఎప్పుడైనా తలిచాలా..??
ప్రతి అందం ప్రకృతిలో పోలుస్తున్నప్పుడు
ప్రతి బంధం ప్రకృతిగా నిలవాలన్నప్పుడు
ప్రతి చెట్టు ప్రగతిమెట్టని కీర్తిస్తున్నప్పుడు,
తన ప్రతి దశ ఓ ఉపదేశంగా
నువ్వు భావిస్తున్నప్పుడు
చెమ్మగిల్లిన ఆ ప్రకృతినోసారైనా చూసావా..??
చేటు చేస్తున్న నీ దుర్భుద్దికి తలవంచాలా..??
అవునులే.. అంత తీరిక నీకెక్కడిదిలే..!!
నీ దురాలోచన, దుర్మార్గం..
దూరాలోచనని మరిచింది
నీ దుర్నీతి దుర్గుణం -
దురదృష్టాన్ని కొనితెచ్చింది
ఒక్కసారి ఆలోచించు
నీ ప్రతి ఆలోచన ప్రత్యుపకారమైతే
ప్రకృతికెందుకు ఈ బలవన్మరణం
నీ ప్రతి నివేచన ప్రత్యామ్నాయ వనరైతే
పర్యావరణానికెందుకు ఈ జీవన్మరణం
కన్నుకి కన్ను కాదు.. గన్నుకి గన్ను కాదు
మొక్కకి మొక్కని పెంచే
కొత్త సిద్ధాంతాన్ని రచించు
కోటి మొక్కలతో ఓ హరితవనాన్ని సృష్టించు.

- బొడ్డు మహేందర్, చెన్నూర్, మంచిర్యాల జిల్లా, సెల్.నం.9963427242