నెల్లూరు

ఉమ్మడి కుటుంబాల విలువ తెలిపిన పూసలు వీడిన హారం ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో ఓ మంచి కథను అందించారు రచయిత అవ్వారు శ్రీ్ధర్‌బాబు గారు. చదివిన వెంటనే ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడాలి అనిపించినా ఫోన్ పనిచేయలేదు. కథలోని పాత్రల చిత్రీకరణ బాగుంది. ఉమ్మడి కుటుంబాల్లోని విలువలను చక్కగా వివరించారు. నిజంగా ఉమ్మడి కుటుంబాలన్నీ నేడు పూసలు వీడిన హారంలా మారిపోయి ఎవరి కుటుంబం వారిది అన్న చందంగా మారిపోయింది. ఒకింత బాధగా అనిపించినా వాళ్లనూ తప్పుపట్టలేం ప్రస్తుత ఆధునిక సమాజంలో. గత జ్ఞాపకాలను గుర్తు చేసిన రచయితకు ధన్యవాదములు.
- సుచరిత, వెంకటగిరి
- భానుప్రియ అమ్మూరు, తిరుపతి
- సుధాకర్ పాడి, కనిగిరి

జవాన్‌కు సెల్యూట్
మెరుపులో కుర్రా ప్రసాద్‌బాబు గారు గొప్ప కవితను అందించారు. నిజంగా మనం ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది మన గొప్పతనం ఏమాత్రం కాదు దేశ సరిహద్దుల్లో అహర్నిశలూ కావలి కాస్తున్న మన దేశ వీరులు జవాన్లది. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గొప్ప కవిత ద్వారా జవాన్లకు సెల్యూట్ చేశారు రచయిత. హేట్సాప్ ప్రసాద్ గారు. నిజంగా దేశం కోసం వారు చేసే సేవకు ఏమిచ్చినా వెలకట్టలేం. జై జవాన్..జైజై జవాన్..
- లలితప్రియ, వేదాయపాళెం, నెల్లూరు
- అయినాబత్తిన సూర్యకాంత్, గిద్దలూరు
- కల్యాణ్, కాకుటూరు (ఈమెయల్)
**
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net