దక్షిన తెలంగాణ

నాలో నేను (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలోని అనుభూతులు
నాలోని ఆలోచనలు
ప్రశాంతత కోరుకుంటున్నాయి
ప్రలోభాలకు లొంగకుండా
ప్రమోదాలతో పొంగిపోకుండా
విశ్వాసమనే శ్వాసతో
అనంతమైన ఆకాంక్షలతో
ప్రతీక్షణం తలపోస్తుంటున్నాయి
విశాల భావాలను విరబూయిస్తూ
అభ్యుదయపథాన పురోగమిస్తూ
ప్రతీ అడుగులోనూ జాగ్రత్తదపడుతూ
ప్రతీ ఆలోచనలోనూ
ప్రపూర్ణతని కోరుకుంటున్నది
నిజాయితీని నాలో నింపుకొని
నిఖార్సయిన జీవితాన్ని
నిలబెట్టుకోమంటున్నది
నిండు జాబిల్లి పండువెనె్నలలా
తెల్లని పిండారబోసిన దృశ్యాన్ని
కళ్లముందు సాక్షాత్కరించుకుంటున్నది
మలినమంటని మధురోహలతో
మనిషితనంతో మనుగడ సాగిస్తూ
సంఘజీవనంలో నావంతు పాత్ర పోషిస్తూ
నలుగురి తలలో నాలుకలా నిలబడుతూ
నా పుట్టుకని సార్థకం చేసుకోమంటున్నది
నా జీవితానికి ఆదర్శమనే నగిషీలు చెక్కుకుని
సమాజం గౌరవించే స్థితిని
నిలబెట్టుకోమంటున్నది
ఆదారివైపు అడుగులు వేస్తూనే
నలుగురిని నాతోపాటు నడిపించమంటున్నది

- దాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్, సిద్ధిపేట జిల్లా
సెల్.నం.9440155240
**
చెలిమి గంధం

కలిసిన మనసులలో
నిలిచి ఉండే స్నేహం
పూలలోని పరిమళం లాంటిది
కలవని అభిరుచులతో
కలిసిన స్నేహం
పరిమళం లేని పూవువంటిది
కలిసిన మనసులను
విడదీయడం కష్టం
కలవని మనుష్యులను
కలపాలనుకుంటే నష్టం
స్నేహం ఎప్పుడూ
గాలి వీచినంత సహజంగా
వెనె్నల కాచినంత సహజంగా ఉండాలి!
నదీ ప్రవాహంలా నిరంతరం సాగిపోవాలి!!
- అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557
**
నీవు నీవుగా..!

నీకు నీవే ప్రత్యేకం
నీకు నీవుగా జీవించు
నీలో వున్న ‘నిన్ను’ను ఆవిష్కరించు
నీవు నీవుగా వుండడానికి సిగ్గుపడకు
నీ స్వభావమే
నీవేమిటో నిర్వచిస్తుంది
నీ ప్రత్యేకతను ఘోషిస్తుంది
ఎంత గొప్ప వారినైనా
అనుసరించు..అనుకరించకు..
నీలో వున్న ‘నిన్ను’ను చంపేయకు
మరొకరిలా జీవిస్తూ మరణించకు!
నీలాగే.. ప్రతి మనిషి ఒంటరే
అందుకే
నీకు నీవే ప్రత్యేకం!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హబ్సిగూడ, హైదరాబాద్
సెల్.నం.7893366363
**
పచ్చి నిజం

జాగృతావస్థ సుషుప్తావస్థ
ప్రతి జీవికి ఇది సహజం
మొదటిది జాగృతావస్థ
పేరుకు మాత్రమే జాగృత..అవస్థ
అన్నీ అజాగ్రత్తలే
బ్రతుకు తెరువు రథచక్రాల క్రింద
నలిగి మూలగటమే!!
మరి నుషుప్తావస్థో
వర్ణనాతీతం
బ్రహ్మైక్యం పొందనూ వచ్చు
అనంత లోకాల్లో విహరించనూ వచ్చు
పొందరానివన్నీ గుప్పిట పట్టనూ వచ్చు
అనూహ్య ఆనందంలో తేలి ఆడనూ వచ్చు
ఎంత మేటిదో ఈ సుషుప్తావస్థ!
- నాగినేని లీలాప్రసాద్
మంచిర్యాల
సెల్.నం.9247335387
**
మనిషి

మనిషి తన ఆవేశాలకు బంధి అవుతున్నాడు
తన ఆలోచనలకు బందీ అవుతున్నాడు
అంతరంతరాలలో తనకు తానే
ముడుచుకుపోతున్నాడు
తన ఉనికిని కూడా మర్చిపోయేటంత
గాఢమైన వ్యసనాలలో కూరుకుపోతున్నాడు!
ఏదో కావాలని ఎండమావుల వెంట
పరుగుతీస్తున్నాడు!
దేనికోసం ఈ ఆరాటం..
ఆనందం కోసమేగా, అదెక్కడో
బయట ఉందని దాన్ని సాధించాలనీ..!
నిజానికి ఆనందం
తన అంతరంగంలోనే ఉందని మర్చిపోతున్నాడు!
తన లోపల ఉన్న మనిషిని వదిలేసి,
తన నుంచి తాను వేరుపడి
తన అపజయాలకు తానే
ప్రతిబింబం అవుతున్నాడు!
తన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని
మరిచిపోతున్నాడు!
హాయి గొలిపే వర్షాకాలపు సాయంత్రం
అందమైన సూర్యోదయ మల్లెతోట నుండి వచ్చే
పిల్లగాలి పరిమళం
బోసినవ్వుల పాపాయి అమాయకత్వం
ఏది అందంగా ఉండదూ!
వీటిని అనుభవించడానికి
మనిషి అనుభూతుల్ని కోల్పోతే!..?
- టి.వసంత
నిజామాబాద్, సెల్.నం.8499929946
**
వందనం

స్వాతంత్య్ర దినోత్సవం
జాతీయ జెండాకు వందనం!
సైనికుడి త్యాగం
దేశానికి గౌరవ ఆభరణం!
ప్రతి పౌరుడు దేశానికి..
వెలుగులను పంచే
దీపం అవ్వాలి!
భారతమాతకు
అండగా నిలవాలి!
మన భారత దేశం
విశ్వంలో ప్రథమంగా ఉంచాలి
జాతీయ జెండాకు
వందనం సమర్పించాలి!
- ఎం.డి.ఖాలిద్
కరీంనగర్
**
జీవితమే ఓ పద్మవ్యూహం

జీవితం నిజమైన పద్మవ్యూహం
సమాజం ఒకొక్కరికి ఒక యుద్ధ క్షేత్రం
దినమంతా యుద్ధం రాత్రంతా విశ్రాంతి
చీకటి వెలుగుల రణరంగాన్ని చూపిస్తుంది జీవితం
బాల్యంలో పద్మంలాంటి జీవితాన్ని ముద్దాడుతుంది
పలకా బలపంతో యుద్ధగీతాలను నేర్పుతుంది
వ్వనంలో ప్రేవను కామం చేసేస్తుంది
సంసారంలో సరిగమలతో మృదంగం మ్రోగిస్తుంది
బంధువులు బంధనాలతో బ్రహ్మరాక్షసులౌతారు
ఆస్తిపాస్తుల యందు అలజడి సృష్టిస్తారు
హక్కుదారుల భూముల్ని అమాంతం మింగేస్తారు
కొనుగోలు జరిగాయని అబద్ధాలు ఆడుతారు
కపట వేషాలతో కత్తులు విసురుతారు
అప్పులు తీసుకొని అసలు కూడా ఇవ్వరు
మిత్రులు కూడా కనబడరు
అంపశయ్యపై ఉంటేనే ఆరాధకుడంటారు
శిలువనెక్కిన వాడి మోమును తేజస్సులా చూపెడుతారు
శాంతికి చిహ్నంగా బుద్ధుని బొమ్మను పెడతారు
ప్రశాంతంగా ఉంటే ప్రపంచం మునిగినట్లు చేస్తారు
అబద్ధాలు అలవాటుగా మాట్లాడుతారు
మోసాలు మునుపెన్నడు లేనట్లుగా చేస్తారు
నమ్మకస్తులను లక్క గృహాల్లో కాల్చేస్తారు
అహంకార క్షేత్రంలో సింహంలా గర్జిస్తారు
పద్మంలాంటి జీవిత రేకుల్ని చిదిమేస్తారు
ప్రశాంత చిత్రంను చీడపురుగుల్లా చెడగొడ్తారు
మంచివాళ్లను శిలువనెక్కించే వరకు నిద్రపోరు
పద్మంలాంటి జీవితాన్ని కౌరవుల్లా తుంచేస్తారు
జీవితమే పద్మవ్యూహం అని గ్రహించరు
వెయ్యి రేకులుగా వికసించడం జీవిత స్వభావం
పరిమళాలను ప్రపంచానికి పంచడం జీవితగమ్యం
జీవితాన్ని సహస్రదళ కమలంలా ధర్మరి
వికసింపజేయడం మన ధర్మం!
- డి.ఎం.రవిప్రసాద్,
హైదరాబాద్, సెల్.నం.9390170836