నెల్లూరు

దిశానిర్దేశం చేసిన రియల్ పరదాల (స్పందన )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజుల్లో ధనవంతుల పిల్లల పరిస్థితి ఎలా వుంది, వాళ్ల ప్రవర్తన వల్ల సమాజంలో ఎటువంటి దుష్ప్రరిణామాలు సంభవిస్తాయో కళ్లకు కట్టినట్లు వివరించిన కథ రియల్ పరదాల. రచయిత ఆలకుంట రెడ్డిప్రసాద్ గారిని ముందుగా అభినందించాలి చక్కటి సందేశాత్మక కథను ఎంతో నేర్పుగా తీర్చిదిద్దినందుకు. కథలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా డబ్బు సంపాదించి తన కుమారుడి ప్రవర్తనలో వచ్చిన చెడు ప్రవర్తనపై ఆలోచించి చివరికి తాను మారిన విధం చాలా బాగుంది. అవినీతిపరులు ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే వారిలో సత్ప్రవర్తన వస్తుంది అని చెప్పేందుకు ఈ కథ ఓ చక్కటి ఉదాహరణ. అలాగే డబ్బును పిల్లలకు విచ్చలవిడిగా విలాసాలకు అందిస్తూ, దాని విలువ తెలియకుండా బిడ్డల్ని పెంచే తల్లిదండ్రులకు ఈ కథ ఓ చెంపపెట్టు.
- శైలేంద్రకుమార్, నాయుడుపేట
- బండి పద్మావతి, ఆత్మకూరు

సాహిత్యం విలువ తెలిపిన కవిత
ప్రముఖ రచయిత బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి గారు చాలాకాలం తరువాత రాసిన చిరుకవిత సాహిత్యం. ముఖ్యంగా సమాజంలో సాహిత్యం ఎలా వుంది అనే కోణంలో చిరు పదాలతో తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈరోజుల్లో సాహిత్యాన్ని కులాలకు, మతాలకు ముడిపెడుతున్నారు ఇది వాస్తవం. అసలు సాహిత్యం అంటే ‘‘వాదాలు వివాదాలకతీతంగా అక్షర ఉషస్సు తేవాలి..విలువల దారి చూపుతూ మానవతాగమ్యం చేర్చే అనంత తపస్సు కావాలి’’ అంటూ సాహిత్యం విలువ తెలిపిన రచయితకు ధన్యవాదములు.
- కృష్ణకుమారి, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, ఒంగోలు
- మల్లీశ్వరి, భక్తవత్సలనగర్, నెల్లూరు

బడిబాటలు కవిత బాగుంది
బడిబాటలు కాదు చిన్నారులతో ఆటలు అంటూ కొండూరు వెంకటేశ్వరరాజు గారు రాసిన కవిత ప్రస్తుతం పాఠశాలల్లో చిన్నారుల దుస్థితిని కళ్లకు చూపింది. నిజంగా పాఠశాలల్లో పిల్లలు అల్లాడిపోతున్నారు.
- పద్మజ సూరె, కావలి