విశాఖపట్నం

నా తెలుగు జీవనది కావాలి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా తెలుగు పలికితే
చెరుకు రసం నాలుకను తాకినట్లు
మంచి ముత్యాలు నేలకు రాలినట్లు
లేగదూడను ఆప్యాయంగా ముద్దాడినట్లు ఉంటుంది
నా తెలుగు వింటే
అమ్మ ఒడిలో హాయిగా నిద్రించినట్లు
మండు వేసవిలో శీతల పానీయం సేవించినట్లు
చెట్టు కింద చల్లని నీడలో ఊయలూగినట్లుంటుంది
నా తెలుగు రాస్తే
బోసినోటి పాపాయి చెక్కిళ్లు నిమిరినట్లు
వీణా తంత్రులను సుతారంగా మీటినట్లు
శీతాకాలపు ఉదయం ఎండలో
చలి కాచుకున్నట్లుంటుంది
నా తెలుగు చదివితే
సప్తవర్ణాల హరివిల్లు సొబగులను తిలకించినట్లు
వెనె్నల రాత్రిలో రెక్కలు కట్టుకుని విహరించినట్లు
పూలపాన్పుపై సేదదీరినట్లుంటుంది
పలికినా, విన్నా, రాసినా
నా తెలుగు సుమధురంగా హాయిగా ఉంటుంది
అందుకే నా తెలుగు
యుగయుగాలు ప్రవహించే
జీవనది కావాలి

- గొట్టాపు శ్రీనివాసరావు,
గడసాం.
సెల్ : 9542019064.
**
శిల్పసుందరి

నేనొక శిల్పాన్ని ప్రేమిస్తున్నాను
కానీ అది నన్ను ప్రేమించడంలేదు
నన్ను అది ఆరాధిస్తుంది ఆదరిస్తుంది
అది శిల్పం కాదు శిల్పంలాంటి సుందరి
జీవితమంతా గడిచింది
ఆమె ప్రేమలో గడుస్తుంది నేటికీ
నన్ను భరిస్తుంది అన్ని విధాలా
నేను నేటికీ ప్రేమిస్తున్నాను
ఆ ప్రేమ నన్ను, ఆమెని నడిపిస్తుంది
నడుస్తూనే ఉన్నాం జీవితాంతం
అదే నా కవితలో ఉన్న కవితా శిల్పం
నేను నా కవితా శిల్పాని ఆదరించకపోతే
నేను, నా కలం, బలం అంతా వృథా
నేను బతికేది దాని కోసమే
ఆ శిల్ప సుందరి నన్ను ప్రేమించడంలేదు
ఎందుకంటే దానికి భాష రాదు, ప్రాణం లేదు
దానిని నేను ప్రేమిస్తూనే ఉంటాను జీవితాంతం
- పోతనపల్లి పాపయ్యశాస్ర్తీ (పాపరాజు),
సెల్ : 9392289409.
**

పరిశ్రమ

రైతు శ్రమిస్తాడు వ్యవసాయ పరిశ్రమలో
రౌతు శ్రమయించును కదా
గుర్రపు స్వారీ పరిశ్రమలో
బంట్రోతు శ్రమించడా
ద్వారపు కావలిగా
విద్యార్థి పరిశ్రమిస్తాడు విద్యార్జనలో
కవి పరిశ్రమిస్తాడు నవ్య కవితా సాధనలో
ప్రేమికుడు పరిశ్రమిస్తాడు
ప్రేయసి వలపు గెలుచుకొనుటలో
కార్మికుడు పరిశ్రమిస్తాడు కార్ఖానాలో

- బాందేపురపు సంతోష్‌కుమార్,
నారాయణరాజు పేట గ్రామం,
భీమిలి, విశాఖపట్నం.
సెల్ : 9581332369.
**
మానవత్వ
కుసుమాలు

బడుగు జీవుల బతుకులను
పాతాళంలో పదిల పరచాలని
కుట్రలు, కుతంత్రాలతో
పేదల ఇంటి దీపాలను ఆర్పుతూ
దోపిడీ దొంగల ముఠా దర్జాగా అందలమెక్కి
దేశ ప్రయోజనాల గుండెలపై కట్టిన
అన్యాయపు వేదికపై ఎగరేసిన
అక్రమార్కు జెండా రెపరెపల సోయగం
కాలుతున్న గుడిసెల్లో నుండి
కూలుతున్న మేడల శిథిలాల కింద నుండి
వినిపిస్తున్న మూల్గులు మన ఉత్తరాంధ్ర
వలస గుంపుదిలా ఉంది
స్వార్ధ ప్రయోజనాలకు సలాం అంటూ
చట్టాలను చుట్ట చుట్టి
చుట్టాలకు కట్టబెట్టిన వేళ
రాలుతున్న విద్యుత్ ఉల్కల ధాటికి
మాయం కాబోతున్న
సోంపేట, కాకరాపల్లిలకు
కంచెగా నిలిచిన సుతిమెత్తని గుండెల్లో
మరణ మృదంగం వాయిస్తూ
మృత్యుదేవత నృత్యం చేయడానికి
సిద్ధపడిన వేళ ఎర్రతివాచీగా మారిన
మానవత్వ కుసుమాలు
మానవ స్వార్ధపు విత్తుకు
జనించిన కులమత మొక్కకు
ప్రేమగా మంచి రసాయనాలు వేసి
మహా వృక్షంగా పెంచిన వేళ వీస్తున్న
ఉగ్రవాద విష గాడ్పులకు బలి అయి
సామూహిక చితుల నుండి
బయటపడాలని వెర్రి కేకలతో
కాలుతున్న కళేబరాలు

- సి.హెచ్.వి. లక్ష్మి,
సెల్ : 9493435649.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.