విశాఖపట్నం

బహుదూరపు బాటసారి( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్రావు మాష్టారు ఒగ గవర్నమెంటు స్కూలు టీచరు. చాలీ చాలని జీతం. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. వచ్చే జీతం చాలక సంసార సాగరం ఈదలేక సతమతమవుతూ ఉంటాడు. పెద్ద కొడుకు ఎదిగి చేతికి అంది వస్తాడనుకొనేసరికి ప్రేమ. పెళ్లి అనే ముసుగులో అత్తారింటికి అల్లుడయ్యి ఇల్లరికం వెళ్లిపోయాడు. మాష్టారు జీవితములో ఇది కోలుకోని దెబ్బ. అప్పటికీ కూతురు పెళ్లీడుకొచ్చింది. రెండో కొడుకు సత్యారావు 8వ తరగతి చదువుచున్నాడు. ఇంట్లోని పరిస్థితులు గమనించుతున్నాడు. అన్న చేసిన దుర్మార్గం తను చేయకూడదని ఆ వయస్సులోనే ఆదర్శభావాలతో నిశ్చయించుకున్నాడు. ఒకప్రక్క చదువు మానేయలేదు. ఆ యింటి ఆడపడుచుకు ఓ చిన్న సంబంధము చూసి, పెళ్లి అయిందనిపించారు. పెళ్లి చేసి తిరిగి వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుల్లో అరవై వేల రూపాయలు అప్పు తేలింది.
ఇంతలో తండ్రికి రిటైర్‌మెంట్ వచ్చిన డబ్బు అప్పులకే సరిపోయింది. సత్యారావు ఎలాగో స్నేహితుల ద్వారా విశాఖపట్నము పోర్టులో ఓ చిన్న టెంపరరీ ఉద్యోగము సంపాదించుకున్నాడు. టెన్ల్‌క్లాస్ పరీక్షలకు వెళ్లలేదు. పరీక్షల ఫీజుకు డబ్బులు లేక చదువు ఆగిపోయింది. మదిలో ఎనె్నన్నో భావాలు, రోజు జీవితములో జరుగుతున్న సంఘటనలు అప్పడప్పుడు అతనికవ రచయిత భావాలు తెల్లకాగితాలకే పరిమితి అవుతుండేయి. సత్యారావుకు వచ్చే జీతము, ఇంటి ఖర్చులకు అరకొరగా సరిపోతుండేయి. వెంకట్రావు మాష్టారు ఆ ముసలితనములో ప్రాంసరీ నోట్లు, అలా వ్రాస్తూ తన రెండో కొడుకు సత్యారావు ఏదో ఉడత సహాయము చేస్తుండేవాడు. తమ్ముడు చంటి మెల్లగా ఇంటర్మీడియట్ వరకు లాకొచ్చాడు.
చంటి కూడా ఇంట్లో పరిస్థితులు అర్థము చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వెంకట్రావు మాష్టారు మరణం ఆ కుటుంబములో అందరికీ ఆశనిపాతము అయింది. ఊర్లో అతని మంచితనము అందరు పొగిడి ఎంతో సానుభూతి చూపి కొంత ఆర్థిక సాయం చేశారు. నిండు ముతె్తైదువులా ఉన్న తన తల్లిని విదవలా చూడడము వాళ్లకి ఇంకా మింగుడుపడడము లేదు.
జీవిత కాల గమనములో రోజులు, వారాలై, వారులు నెలలు సంవత్సరాలు దాటుచున్నవి. తల్లి పట్టుదలలో సత్యారావు ఓ యింటివాడయ్యాడు. తమలాగే సత్యారావు భార్య పుట్టింటవారు ఓసాదా సీదా గుమాస్తా కుటుంబం మధ్య తరగతి కుటుంబీకుల గాధలు సత్యారావుకు తెలుసు కాబట్టి సత్యారావు తన భార్య ఏంతెచ్చిందా, ఏం తేలేదో కూడా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న ఆడపడుచు యొక్క సతాయింపులు సత్యారావు భార్యను క్రుంగతీసేవి. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదని తన భార్యకు నచ్చచెప్పి సముదాయించేవాడు.
ఇంతలో తన తమ్ముడు చంటికి ఆర్.టి.సిలో కండక్టరు ఉద్యోగం వచ్చింది. పోనీలే తమ్ముడు కూడా కలిసి వచ్చాడు అనుకున్నాడు సత్యారావు. కండక్టరు ఉద్యోగం రాగానే ఎక్కడలేని సంబంధాలు వచ్చేవి. ఉన్నంతలో ఓ మంచి సంబంధం చేశాడు తమ్ముడికి సత్యారావు. పెళ్లయిన ఆరు నెలలు తిరగముందే వేరు ఇంటి కాపురం పెట్టించింది ఆ కొత్తకోడలు. ఎవరి స్వార్థం వారిది. ఇంతలో సత్యారావు తల్లి, అనారోగ్యం, మందులు ఖర్చులు తడిపి మోపిడి అయ్యాయి. మధ్య తరగతి సగటుజీవి టీలో పడ్డ ఈగలా గిలగిలా గింజుకుంటున్నాడు సత్యారావు. ఇంటిలో పెద్దదిక్కుగా ఉన్న తల్లి హఠాన్మరణం సత్యారావును బాగా కృంగదీసింది. కనిపెంచిన తల్లి తన ఇంట్లో నడయాడక పోవడం అతను జీర్ణించుకోలేకపోయాడు. ఏం చేస్తాం! కాలం ఆగదు కదా?
సత్యారావు ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే కుటుంబ నియంఅతం ఆపరేషను చేసుకుంటదామనుకున్నాడు. కాని కొడుకుకోసం ఇంకా ఇంకా చూద్దామనుకున్నాడు. కాని మూడోసారి ముచ్చటగా ఆడపిల్లే పుట్టింది. ముగ్గురు ఆడపిల్లలతో సంసారం, తమ్ముడు వేరే కుంపటి, సత్యారావుని మానసికముగా క్రుంగదీసేవి. కానీ ఏం చేస్తాడు. విధిలిఖితం జరిగేది జరగకమానదు కదా! సంసారం తన జీవితములో చదరంగం అయ్యింది. కాలము తన పని తాను చేసుకుంటూ పోతుంది. సగటు మనిషి జీవితం అప్పులతో సతమతమవుతుంటాడు. సంసారం ఒక మహాసాగరం, ఎంత ముందుకు సాగి ఈదుదామని అనుకున్నా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అలల్లా వచ్చి ఖర్చులు పెరిగి, పిల్లల పెళ్లిళ్లు తన గుండెలమీద కుంపట్లా పెరగసాగాయి. పిల్లల చదువులు పదవ తరగతి వరకు వచ్చి ఇక ముందుకు వెళ్లలేక ఆగిపోయాయి. గంతకు తగ్గ బొంతల్లా ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు ఓ యజ్ఞంలా, అప్పుల బాధల ఊబిలో ఇరుక్కుపోయి మెల్లగా ఏదో అయిందనిపించారు.
పిల్లలను కంటాము కాని వారి తల రాతలను మనముకంటామా? ఇప్పడే అసలు పిల్లల మనస్సులోని అంతరంగాలు బయటపడ్డాయి. ఇంతకాలం కనిపెంచి పెద్దచేసిన తన పిల్లలే తనకు శత్రువులయ్యారు. ఏ జన్మలో ఏచసిన పాపమో గాని వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి తన ఉద్యోగం వలంటరీ రిటైర్‌మెంటు పెట్టి కొద్ది కొద్దిగా తీర్చాడు. కాని తన పిల్లలు వారి అహంకారాల వలన తమ కాపురాన్ని తమే చెడుగొట్టుకొంటున్నారు.
పెద్దమ్మాయి సరళ కాపురం కొంత నయాన్నో భయాన్నో చెప్పి ఓ దారిలోనికి తీసుకొని వచ్చాడు సత్యారావు. రెండో అమ్మాయిది ప్రేమ వివాహము అయినా కట్నం తీసుకోకపోయినా అడపదడపా వారి కుటుంబ ఖర్చులు కూడా తనమీదే పడ్డాయి. నిరుద్యోగ కుటుంబం. ఒక అక్క,, ఓ తమ్ముడు అతనికి. ఇంక మూడోఅమ్మాయికి ముచ్చటగా కట్నం పోసి చేసిన పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. పెళ్లి చేసిన మూడు నెలలకే తన చిన్న అల్లుడు ఓ యాక్సిడెంట్‌లో పోయాడు. చిన్న తనములో వైదవ్యం. ముఖాన్న బొట్టు చెరిపేసుకొని వచ్చిన కన్న కూతుర్ని చూసి ఏడవని రోజు లేదు ఆ దంపతులకు, ఏది ఏమైనా కాలము ఆగదు కదా. గుడ్డిలో మెల్లలా అప్పుడప్పుడు కూడబెట్టిన డబ్బుతో ఓ చిన్న యిల్లు కనుక్కోవడం మంచిదయింది.
కొడగట్టిన దీపంలా వచ్చిన పెన్షన్ చాలక చిన్న చిన్న ట్యూషన్స్ చెపుతూ తన భార్యకు తోడుగా ఉన్న కుట్టుమిషనుతో ఆ ఇల్లును సంసారనౌకను మునిగిపోకుండా అలా జీవితము నెట్టుకొస్తున్నాడు సత్యారావు బహుదూరపు బాటసారిలా.
మధ్యతరగతి జీవితాలు ఎంత ముందుకు సాగుదామని అనుకున్నా ముందడుగులు పడవు. సామాన్యముగా ఎప్పటికప్పుడు ఏదో సమస్య. పిల్లలకు సర్దిచెప్పి, చక్కదిద్ది ఓ దారిలో పెట్టడం ఎంతో గగనమై పోతుంది అతని జీవితానికి. సమస్యలు వస్తూనే ఉంటాయి. జీవితాలలోనికి అవి చక్కదిద్ది సరైన న్యాయం చేయలేక పోతున్నాననే బాధతో సత్యారావు ఎప్పుడొ దిగువలు పడుతుండేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కాలగమనం తన పని తాను చేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. తరాలు మారినా సమస్యలన్నీ మధ్య తరగతి కుటుంబీకులీకే వస్తాయి. అతన్ని జీవితన గమనములో కొట్టుకు పోవలసిందే. జీవన చదరంగములో ఏ పావు ఎక్కడికి జరుగుందో అతినకే తెలియదు. కాలచక్ర గమనములో ఓ సంసారికి, నడిమంత్రపు సిరి వచ్చి పడితే గాని తప్ప ఆ సంసారములో సరిగమలు రెండెండ్ల బండిలా ప్రయాణం ముందుకు సాగివలసిందే. సత్యారావా జీవితములో ఎనె్నన్నో ఓడిదుడుకులు చూస్తూ గమ్యం తెలియని బాటసారిలా వార్దక్యాన్ని ఆస్వాదిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. తనకున్న పరిధిలో తన చుట్టూ ఉన్న ఓ చిన్న ప్రపంచంలో ఉన్న చిన్నా పెద్దా గ్రామస్తుమందరిని కమలుపుకుంటూ ప్రభుత్వానికి మద్దతుగా స్వచ్చ్భారత్ ఆదర్శాలను అందరికీ విపులముగా విశదీకరిస్తూ ఓ అడుగు ముందుకు వేసి కాలువలోని పూడికలను రహదారులకిరువైపు మొక్కలను నాటిస్తూ ఆ ఊరికి ఓ మంచి పెద్దమనిషిలా అతని తండ్రిలా ఆ వూర్లో అందరితో కలసి జీవనయాత్ర వార్దక్యపు ఛాయలను అదిగమిస్తూ ముందుకు సాగిపోతున్నాడు సత్యారావు ఓ సంపూర్ణ మనిషిలా.

- వేగి నూకరాజు 7702141014