రాజమండ్రి

విశ్వవిజేతల మెరుపు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అంతరిక్షములోని కద్వితీయమ్ముగా
నూట నాలుగు ‘శాటిలైటు’లంపి
ఉద్వేగభరితమై ఉత్కంఠతో చూచు
వేలాది హృదయాల వేడ్క నింపి
గత రికార్డులనెల్ల గత చరిత్రగ మార్చి
అగ్ర దేశాల ముందడుగు వేసి
విశ్వవిజేతగా విఖ్యాతమై నిల్చి
జగతికే మనశక్తి చాటిచెప్పి

తే.గీ. ఖండఖండాంతరమ్ముల ఖ్యాతి తెచ్చి
భరతమాతకు ఘనకీర్తి నెరపినట్టి
శాస్తవ్రేత్తల నెల్లర సంస్తుతింతు
అతులిత ముదాన ‘ఇస్రో’కు అంజలింతు

సీ. ఆనాటి ఓటములార్తిన రగిలించి
తిరుగులేని విజయాల తీరు చూప
తప్పులన్ గ్రహియించి గొప్పగా శ్రమియించి
అన్ని దేశాలలో మిన్న కాగ
సాయమడిగినట్టి సాటి దేశాలకే
సముచిత రీతిన సాయపడగ
నూట నాలుగు ‘శటిలైటు’ లతి రయాన
నిర్ణీత సమయాన నింగికెగయ

తే.గీ. అవధులెరుగని ఆనందమయ్యె మాకు
వాడవాడల సరికొత్త పండుగయ్యె
శాస్తవ్రేత్తల నెల్లర సంస్తుతింతు
అతులిత ముదాన ‘ఇస్రో’కు అంజలింతు!

- చల్లా రామలింగశర్మ, చరవాణి : 9701112366
**

స్నేహం

అలిసే గుండెకు ఆసరానిచ్చేది స్నేహం
నలుగురిలో విలువను పెంచేది స్నేహం
ఆపదలో అక్కున చేర్చుకొనే
ఆపన్న హస్తం స్నేహం
నేనున్నాను నీకేం భయం లేదనేది స్నేహం
ఎడారిలో మంచు వర్షం లాంటిది స్నేహం
హోరు గాలిలో రక్షణ వలయం స్నేహం
అందుకే స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం

- పంపన సాయిబాబు
సెల్: 9652801014
**

కారణజన్ముడు
కందుకూరి

సీ. ఆంధ్రభాషాసేవకాద్యుడ! బాధ్యుడ!
సంస్కరణోద్యమ సాహసికుడ!
మధ్యయుగాల నమానుష ఛాందస
మూఢంపుటాచార మాడు పగుల
ద్వంద్వ ప్రమాణాల దంభాచరణములన్
స్ర్తిల నిర్బంధమున్ కూలవైచి
సమకాలపు సమాజ సత్ప్రతినిధిగయై
తెలుగులన్ నడిపిన ధీమతుండ

ఆ.వె. చిన్నతనము నుండె చిచ్చరపిడుగీవు
భయము నెరుగ నట్టి బాలకుడవు
బ్రతుకు జీవుడంచు పారిపోయెను కదా!
భూత వైద్యు డొకడు భీతి చేత

తే.గీ. దళితుడనకయె జాషువన్ ధైర్యపరచి
రాణ్మహేంద్ర పండితులెల్ల మ్రాన్పడంగ
వెన్నుతట్టుచు ప్రోత్సాహమున్నతముగ
అందజేసితి వాశీస్సు కందుకూరి!

సీ. ఒకప్రక్క సంస్కరణొకప్రక్క సాహితి
ఒకప్రక్క పోరాట మొకటె పరుగు
ఒకచేత ఛాందసు లొనరించు పన్నాగ
మిన్నాగులన్ త్రుంచి యున్నతునిగ
ఎన్నిరీతుల నీవు ఏమిచేసిన గాని
సంఘంపు సేవకై సాగినావు
ఉద్యమాల కెపుడు నూపురి యూదిన
నిత్య చైతన్యపు సత్యమతివి

నా తెలుగు జీవనది కావాలి
నా తెలుగు పలికితే
చెరుకు రసం నాలుకను తాకినట్లు
మంచి ముత్యాలు నేలకు రాలినట్లు
లేగదూడను ఆప్యాయంగా ముద్దాడినట్లు ఉంటుంది
నా తెలుగు వింటే
అమ్మ ఒడిలో హాయిగా నిద్రించినట్లు
మండు వేసవిలో శీతల పానీయం సేవించినట్లు
చెట్టు కింద చల్లని నీడలో ఊయలూగినట్లుంటుంది
నా తెలుగు రాస్తే
బోసినోటి పాపాయి చెక్కిళ్లు నిమిరినట్లు
వీణ తంత్రులను సుతారంగా మీటినట్లు
శీతాకాలపు ఉదయం ఎండలో
చలి కాచుకున్నట్లుంటుంది
నా తెలుగు చదివితే
సప్తవర్ణాల హరివిల్లు సొబగులను తిలకించినట్లు
వెనె్నల రాత్రిలో రెక్కలు కట్టుకుని విహరించినట్లు
పూలపాన్పుపై సేదదీరినట్లుంటుంది
పలికినా, విన్నా, రాసినా
నా తెలుగు సుమధురంగా హాయిగా ఉంటుంది
అందుకే నా తెలుగు
యుగయుగాలు ప్రవహించే
జీవనది కావాలి

- గొట్టాపు శ్రీనివాసరావు, గడసాం. సెల్ : 9542019064