నెల్లూరు

అభిమతం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రమాస తొలి తిథి ఉగాది
మామిడి తోరణాలు,
మావి చిగురుల సవ్వళ్లు
ఉనికికి తెలియజేస్తున్నాయి
షడ్రుచులతో చక్కగా అమరి
రాబోయే సంవత్సరాదికిదే
మా స్వాగతం
దుర్మిఖికి వీడ్కోలు పలుకుతూ,
జీవన గమనంతో అనుభూతులు పంచటానికి
సిద్ధమవుతున్న
‘‘హేమలంబ’’
నీకిదే మా స్వాగతం
సామాజిక రుగ్మతల నుంచి
కాపాడుతూ
మళ్లీ మళ్లీ సమస్యల నుంచి
బయటపడేస్తావని
నమ్ముతూ
పలుకుతున్నాము స్వాగతం
మంచి ఫలితాలను అందరికి
ప్రతిఫలింపచేస్తావని వేడుకొంటూ
పలుకుతున్నాము స్వాగతం
పాత కష్టాలు తీరాయి అని
స్వేద తీర్చుకొంటే
నేను ఎక్కడికి పోలేదంటూ
వచ్చి పడుతూనే ఉన్నాయి కష్టాలు
కడలిలో కెరటాలు
ఆగకుండా వస్తూపోతున్నట్లే అనిపిస్తే
అయినా ఉన్నంతలో
పాతను మరచి
కొత్తను ఆహ్వానించడం
మన అభిమతం కావాలి
ఓ హేమలంబ నీకిదే
మా స్వాగతం.. సుస్వాగతం

- ఎస్.వి.సుబ్బారావు
చరవాణి : 9441685812
**
చిగిర్చాల్సిన సమయం కోసం....

రాలిపోతున్న పూలరేకుల్లా
అక్కడక్కడా
మానవదేహాల మరణాలు
గాయాలు వేరైనా కథనం ఒక్కటే
ఘటన ఏదైనా బాధ ఒకటే
గడచిన గంట వరకు మనతో
రూపం మార్చుకుని తిరిగి వస్తే
ప్రశ్నించే కళ్లకు జవాబు దొరకదు
కారే కన్నీళ్లకు అంతం వుండదు
బతకడం కత్తి మీద సాముగా మారింది
ఫొటోఫ్రేముల్లో జ్ఞాపకాల్లో మిగిలిపోతున్నారు
హింసోన్మాదానికి ఎన్నో వికృత రూపాలు
దేశాన్ని కాపాడే సైనికులకే లేని భరోసా
సామాన్యుల్ని అభద్రతలోకి నెట్టేస్తున్నది
అసహనం పెరిగిన ప్రతిచోటా
అంతర్యుద్ధాలు అడుగులు కదుపుతూనే ఉన్నాయి
చరిత్ర పునరావృతమయినట్లు
యుగధర్మం తన పని తాను చేసుకుపోతున్నది
ఐతే మనిషిలో చావనిది ఆశ ఒక్కటే
శాంతి పావురాల రెక్కల చప్పుళ్లకి
కరుడు కట్టి హృదయాలలో
ద్రవీభవనం మొదలవుతుందని
గుండెపాట మళ్లీ
కోకిలగానంతో జతకడుతుందని
వసంతం బ్రతుకును చిగిరింపచేస్తుందని
ఎదురుచూడడమే మనిషి పని

- పాతూరి అన్నపూర్ణ
9490230939
**
మేలుకొలుపు
ఉగాది అంటే ఉషస్సు
ఉగాది అంటే సప్తవర్ణాల ఇంద్రధనస్సు
ఉగాది అంటే పచ్చనితోట
ఉగాది అంటే కోయిలపాట
ఉగాది అంటే ఆమనిరాగం
ఉగాది అంటే
వసంతభామిని అనురాగం
ఉగాది ఉవిదగా నిలవగా
నెమ్మోము సమ్మోహనంతో
నేను చూడగా
నూతనోత్తేజంగా తేజరిల్లాల్సిన
ఆమె కళ్లు
నిరాశ నిస్పృహలతో వెలవెల
మరకతాలను వెక్కిరించే ఆమె మేను
దగాబడిన బీడులా బీటలువారి
నేను మ్రాన్పడి కారణమేమన
ఆమె కంఠం కన్నీటి సంద్రమైంది
నా చిట్టి నేస్తం కోయిల!
అది వూగే చిగురుటాకుటూగుటయ్యాల ఏది?
ఆనందభైరవి రాగమాలపించే ఆ తీయనిగొంతు ఏది?
కోయల కూర్చుని కొరికే
మావికొమ్మ చిగురేది?
చిత్రం... ఈ ప్రశ్నలకు జవాబులేవి?
సెల్‌ఫోన్‌ల కెక్కిన కోయల కంఠం
గుమ్మాలకు వేలాడే ప్లాస్టిక్
మామిడితోరణాలు!
ఎలాస్టిక్ ముగ్గులు!
కర్రీపాయింట్లో ఉగాది పచ్చడ్లు!
ఇప్పుడంతా విలువలన్నీ నాశనం
ఎక్కడ చూసినా అసహనం
లేదు సమాజంలో శాంతి
అందుకే తగ్గింది
నా కన్నుల్లో కాంతి22
దృశ్యమానమైన ధవళాక్షి
హేవళంబి హేమలంబయై
కావాలి మార్పు
చేయాలి కూర్పు
మారాలి మనస్సు
తేవాలి తేజస్సు
పాడాలి మేలుకొలుపు

- మోపూరు పెంచల నరసింహం, నెల్లూరు
చరవాణి : 7386362476