రాజమండ్రి

ధైర్యలక్ష్మి(మినీ కథలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మికి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం రావడంతో చాలా ఆనందానికి లోనయ్యింది. తల్లిదండ్రులకు మిఠాయిలు, స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఆ ఆనంద క్షణంలో ఒక ఫోన్ కాల్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు విచారంలో మునిగేలా చేసింది!
ఆ ఫోన్ కాల్ సందీప్ నుండి వచ్చింది. లక్ష్మి క్లాస్‌మేట్ మరియు స్నేహితుడు.
లక్ష్మి నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్లు ఉన్నావ్ అన్నాడు ఫోన్‌లో సందీప్!
అవును దీప్.. క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కావటం ఎంతో అదృష్టం. పైగా లక్షలలో జీతం. నా తల్లిదండ్రులు ఆశయం నిలబెట్టాను.
నువ్వు నా ఆశయాలను మాత్రం చిదిమేశావు. వ్వాట్? అంది లక్ష్మి
నాటకాలు చాలు లక్ష్మి. టాపర్‌గా ఉండే నేను నీ వల్లే మూడు పరీక్షలలో తప్పాను. క్యాంపస్ ఉద్యోగం దూరమైంది.
నీ పరీక్షలు తప్పడానికి, నీకు ఉద్యోగం రాకపోవడానికి నేను కారణం ఎలా అవుతాను అంది కోపంగా లక్ష్మి.
నాతో పార్క్‌లకి వచ్చావు, సినిమాలకి వచ్చావు, నన్ను గట్టిగా పట్టుకుని బైక్ మీద తిరిగావు, నన్ను ముంచి నువ్వు ఉద్యోగం సాధించుకున్నావు.
లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. బొట్టు బొట్టుగా కాళ్లు పాదాలను తాకాయి.
దీప్... నీతో తిరిగిన మాట వాస్తవమే కానీ నీకు ఉద్యోగం రాకపోవడానికి నేను మాత్రం కారణం కాదు.
నువ్వే కారణం, నిన్ను వదలను అంటూ ఫోన్ పెట్టేశాడు సందీప్. ఆ క్షణం నుండి తీవ్రమైన మనోవ్యధకు గురయ్యింది. ఈ సమస్యకు పరిష్కారం అర్ధంకాలేదు.
రెండురోజుల తరువాత తన చెల్లికి చెప్పింది.
అమ్మ నన్ను క్షమించు అంటూ జరిగిన విషయం ఒక్కొక్కటి చెప్పింది. తల్లి మనసు అర్ధం చేసుకొని ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావ్ లక్ష్మి.
పోలీస్ కంప్లయింట్ ఇస్తానమ్మ!
వద్దు లక్ష్మి అలా చేస్తే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. తనని మార్చడానికి ప్రయత్నం చెయ్యి ధైరంగా పోరాడు. శత్రువుగా మారడానికి కారణం గుర్తించి మిత్రుడుగా మంచి చేసుకో.
వెంటనే సందీప్‌కు ఫోన్ చేసింది.
సందీప్ నిన్ను కలవాలి అంటూ ఓ రెస్టారెంట్ పేరు చెప్పింది.
లక్ష్మి రెస్టారెంట్‌కి వచ్చేసరికే కోపంతో కూర్చుని ఉన్నాడు.
లక్ష్మిర నవ్వుతూ కూర్చుని పలకరించింది. సందీప్ ఎలాంటి భావం ప్రదర్శించలేదు.
సందీప్ నువ్వు కోపంగా అసలు బాగోలేదు.
ఎప్పుడూ నవ్వుతూ ఉండే నీ ముఖం అసలు చూడలేకపోతున్నాను. ఇప్పుడు
నాకు కూడా నీ ముఖం చూస్తే అలానే అన్పిస్తుంది.
అసలు నీ సమస్య ఏంటో అర్థంకావడంలేదు.
నా సమస్య నువ్వే అంటూ స్వరం పెంచాడు. నన్ను ప్రేమించి నా చదువును నాశనం చేశావు.
సున్నితంగా చెబితే అర్ధం చేసుకోరు అంటూ ధైర్యం మాట్లాడింది లక్ష్మి.
చూడు సందీప్ నిన్ను ప్రేమిస్తున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు. నువ్వే ఊహించుకొన్నావు. నేను నీ బైక్ మీద కాదు తరుణ్ శ్రీ్ధర్ బైక్‌ల మీద తిరిగాను. ఇది కేవలం స్నేహమైన భావంతోనే. అంతమాత్రాన అది ప్రేమనుకుంటే ఎవరిది తప్పు.
అదంతా నాకు అనవసరం లక్ష్మి, నీ వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది.
షటప్... అంది కోపంగా నాలుగేళ్లు పరిచయం మనది. పాతికేళ్లు జీవితం నీది. నా మీద ప్రేమ కన్నా నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు ఉండి ఉంటే ఈ పాటికి కెరీర్ విజయవంతమయ్యేది. అసలు నిన్ను ఎవరు చదవద్దు అన్నారు, ఎవరు ఎగ్జామ్స్ బాగా రాయొద్దు అన్నారు, నా గురించి ఆలోచన ఎవరు పెట్టుకోమన్నారు. ఫ్రెండ్స్ అనగా షికార్లకి వెళతాం, సినిమాలకి వెళతాం. అలాగే కష్టపడి చదువుతాం, షికార్లు, సినిమాల మీద ఉన్న ధ్యాస చదువుమీద పెట్టకపోవడం నీ తప్పు.
చాలా కోపంగా చూశాడు సందీప్.
ఎప్పట్లానే ఫ్రెండ్స్‌గా ఉందామంటే చేతులు కలుపు లేనిపక్షంలో నీ చేతికి సంకెళ్లు వేయించడం నాకు చిటికెలో పని, భవిష్యత్ బంగారంగా మెరవాలిగానీ, జైళ్లో ఊచలు లెక్కపెట్టడానికి కాదు.
అంత ధైర్యంగా మాట్లాడుతుందని లక్ష్మి కూడా అనుకోలేదు. మనిషిలో ఉండే కోపంతో ఉండే ఆలోచనలు మొదట్లోనే కత్తిరించకపోతే పెరిగి పెద్దయి విచక్షణ కోల్పోతుంది. సందీప్‌తో ధైర్యంగా మాట్లాడింది!
‘సారీ లక్ష్మి నాదే తప్పు, నా అశ్రద్ధ వలన నేను పరీక్షలు తప్పాను.
నిన్ను ప్రయోజకుడిని చేసే బాధ్యత నాది అంది లక్ష్మి
ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు.
తను కూడా నవ్వింది.
ఆ తర్వాత ఎన్నో విషయాలు ఆ ఇద్దరూ చిరునవ్వులతోనే పరిష్కరించుకొన్నారు.
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర సెల్: 9490792553