విశాఖపట్నం

హేవలంబకి స్వాగతం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనములన్ని కష్టించి వర్షమంత
ఆకులను రాల్చి అడవంత అలసిపోయె
అంతలోనె వసంతుడు అచటకేగి
విసర గాలులు వేగంగా వింజామరల
మోడుబారిన చెట్లన్ని మోజుపడుచు
చిగురుటాకులు తొడగంగ చింతలొదలి
మావిచిగురులు బహుమెక్కి మత్తుకెక్కి
కోయిలమ్మలు కూయంగా కోమలంగ
భవకవుల మనములన్ని భావమొంది
కలము సవరించి కథలు, కవితలు రాసి
పురము జనులకు వినిపించ పూనిరపుడు
హితము కూర్చరాగపుడు హేవలంబి
షడ్రుచుల పచ్చడి పంచి స్వాగతించి
మనము నుల్లసం బొందంగ మనుషులంత
ఇళ్లు గుడులు సింగారించె ఉల్లసంగ
పండగలు జరుపుకొనిరి బహు ప్రీతి
అడ్డదిడ్డముగను అది గమనించెడు నేత
పచ్చడింత తినుచు పాలన సరి
చూసి సాగి రండి సాదరముగ నేడు
జరుగు ముందుకునిక జనుల కొరకు

- పోతనపల్లి పాపయ్య (పాపరాజు),
విజయనగరం. సెల్ : 9392289409.
**

ఓ హేవలంబ

మము దీవించ రా
వస్తున్నాయ్ వస్తున్నాయ్ ఎన్నో ఉగాదులు
ఊరిస్తూ ఊరిస్తూ గడిచిపోతున్నాయి ఎన్నో ఏళ్లు
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు
దేశం మారిపోతున్నట్లు
భ్రమలు కల్పిస్తున్నారు
నాడు ఎన్నో సంస్కరణలన్నారు
నేడు ఠపీమని పెద్ద నోట్ల రద్దన్నారు
మధ్య తరగతికి ఎంతో మేలన్నారు
పెద్దోళ్ల పప్పులిక ఉడకవన్నారు
బడుగు జీవులు ఆశతో బతుకుతున్నారు
బడాబాబులు దర్జాగా
కాలరెగరేస్తూనే ఉన్నారు
సగటోళ్లు మూడు నెలలు
లైన్లో అగచాట్లు పడ్డారు
బలిసినోళ్లు లైను గియిను లేక సర్దేసుకున్నారు
కొన్ని రేట్లు తగ్గుతున్నట్లనిపిస్తున్నాయి
బడుగు జీవుల్లో కొత్త ఆశలు రేగుతున్నాయి
కొన్ని ధరలు తగ్గుతున్నట్లనిపిస్తుంటే
పెట్రోలు, డీజిలు రేట్లు పెరుగుతున్నాయి
కొంత మార్పు వస్తుందనుకుంటే
కొత్త సామాజిక రుగ్మతలు పెరుగుతున్నాయి
ఆశావాదులం కాబట్టి నమ్ముతూ ఉందాం
ఈ దేశం ఎప్పటికైనా
మారుతుందని ఆశిద్దాం
పాలకుల తీపి మాటలపై ఆశ పెట్టుకుందాం
అవి మాటల గారడీ కాకూడదని ఆశిద్దాం
అరవై ఏళ్లు చేతులు కట్టుకుని కూర్చున్నాం
ఇంకో రెండేళ్లు ఓపికతో ఊహల పల్లకిలో గడిపేద్దాం
దుర్ముఖి చేసిన మంచి చెడ్డలను బేరీజు వేద్దాం
హేవిలంబ మనకి మంచి చేస్తుందని ఆశిద్దాం

- సహి
తురగా వేంకటే నాగేశ్వరరావు,
వినాయక నగర్, విశాఖపట్నం-44.
సెల్ : 9703033953.
**
వెళ్లి వస్తా మరి

మనసులో చెలరేగుతున్న భావాలను
కళ్లతోనే చెప్పేసి వెళ్లి వస్తా మరి
అమ్మానాన్నల గుండె లోతుల్లో బాధ తీర్చలేక
ఆలి మనోవేదన అర్ధమైనా చేసేదేమీ లేక
చిన్నారుల కన్నీళ్లను తుడిచి
నా హృదయ వేదన కాన రాకుండా
కళ్లలోనే కన్నీళ్లు దాచేసుకుని
వచ్చీ రాని చిరునవ్వును కురిపిస్తూ
మనసుని ఒడిసి పట్టుకుని
నాదైన నా కుటుంబాన్ని వదిలిపెట్టి
మనదైన భారతమాత రక్షణకు వెళ్లి వస్తా మరి
అడవి తల్లి ఒడిలో తల దాచుకుంటూ
గజగజ వణికించే చలిలో
మంచు దుప్పటి కప్పుకుంటూ
కళ్లని ఆవహించే కునుకును
వద్దని ఆపుకుంటూ
కళ్ల ముందు కదలాడే
కుటుంబాన్ని తలచుకుంటూ
నా సహచరులతో కలసి
కన్నీళ్లతోనే దాహాన్ని తీర్చుకుంటూ
గడియ గడియకు గుండెల్లో కలిగే
గగుర్పాటును గమనిస్తూ
నన్ను మోసే భారతావని
రుణం తీర్చుకునేందుకు
ఆకు కదిలే చప్పుడు నుండి
అఘమేఘాల మీద
దండయాత్రకు వచ్చేందుకు
పరాయి దేశ ముష్కరులు
పనే్న పన్నాగాలను ముందే పసిగడుతూ
భరతమాత ముద్దుబిడ్డగా
యుద్ధసీమలో విజయభేరి మోగించి
విజయపతాకాన్ని ఎగురవేసి
వచ్చేందుకు వెళ్లి వస్తా మరి

- సరిత,
విజయనగరం.