విశాఖపట్నం

దురాశ దు:ఖానికి చేటు (కథలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమనాథపురంలో సోమయ్య అనే ఒక సోమరిపోతు ఉండేవాడు. అతని భార్య సోమమ్మ ప్రతిరోజూ కూలిపనికి వెళ్లి, ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుని వచ్చేది. ఆ ఊళ్లోనే భీమయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు. సోమమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక మంచి హృదయంతో సోమమ్మని పిలిపించి ‘‘నీ భర్త ఏ పనీ చేయకుండా అలా ఊరికే ఉంటే ఇల్లెలా గడుస్తుంది. అందుకే రెండెకరాలు కౌలుకు ఇస్తాను. సాగు చేసుకుని బతకండి’’ అన్నాడు. సోమమ్మ సంతోషించి భర్తకి ఈ విషయం చెప్పింది.
భార్యాభర్తలు ఆ భూమిని సాగు చేసుకోసాగారు.
భార్య ప్రోత్సాహంతో ఆ భూమిలో పంట వేసి పండించసాగాడు సోమయ్య.
వారి కష్టం ఫలించి పంట బాగా పండి లాభాలు వచ్చాయి.
ఆ డబ్బుతో పాడి ఆవులు, మేకలు, బండెడ్లు కొన్నారు దంపతులు. కొన్నాళ్లకు మేకలు పిల్లలు పెట్టాయి. వాటిని అమ్మేసారు. పాడి ఆవుల పాల ద్వారా వచ్చిన డబ్బులు, వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో ఒక డాబా ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు సోమయ్య, సోమమ్మ పిల్లలతో సంతోషంగా కాలం గడపసాగారు. ఇదిలా ఉండగా డబ్బును కళ్లజూసిన సోమయ్యలో దురాశ బయలుదేరి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. అధిక వడ్డీకి అడిగిన వారికి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జూదం ఆడి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆ పని కూడా చేయసాగాడు. అయితే కష్టపడి సంపాదించిన నాటి రోజుల కంటే అత్యాశతో ఇలా చేయడం వల్ల సోమయ్యకు కష్టాలు మొదలు అయ్యాయి. వడ్డీకి డబ్బు తీసుకున్న వారంతా అప్పులు ఎగేసి ఊర్లోని పారిపోయారు. జూదంలో ఓడిపోయి నష్టం కళ్లజూసాడు. భీమయ్య తాను ఇచ్చిన భూమిని వెనక్కి తీసేసుకున్నాడు. దాంతో ఇల్లు గడిచే దారి లేక సోమయ్య ఆవులు, మేకలు, ఇల్లు, బండెడ్లు అన్నీ అమ్మేసాడు.
ఈ విధంగా అత్యాశకు పోయి చేతికందిన భాగ్యాన్ని కోల్పోయిన సోమయ్య దురాశ దు:ఖానికి చేటు అని తెలుసుకున్నాడు.
*
- చెన్నా లక్ష్మణరావు,
పాచిపెంట, విజయనగరం జిల్లా.
**

బతుకు బస్టాండ్

విశాల్ ఆఫీసుకు బయలుదేరాడు.
ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్లి పాతగాజువాక బస్టాప్‌లో బస్సు ఎక్కడం అతనికి అలవాటు.
అయితే ఆరోజు అతను వెళ్లే సరికి ఎప్పుడూ ఉండే బస్టాప్ హఠాత్తుగా అదృశ్యమైపోయినట్లు అక్కడ కనిపించలేదు.
విశాల్ ఆశ్చర్యపోయాడు.
ఉదయం తొమ్మిది కూడా కాకపోయినా ఎండ మండిపోతుంది.
ఆ చుట్టుపక్కల అందరికీ ఎండ నుండి రక్షణ కల్పించేది ఆ బస్టాపే.
అయితే ఒక్కసారిగా కనిపించకపోవడంతో చాలా మంది ఆ ఎండలోనే అపసోపాలు పడుతున్నారు.
విశాల్ చుట్టూ చూసాడు.
అక్కడికి కాస్త దూరంలో ఒక పాన్‌షాప్ కనిపించింది.
అటు నడిచాడు. ‘‘బాబూ ఇక్కడ బస్టాప్ ఉండాలి కదా ఏమైంది?’’ అంటూ అతన్ని అడిగాడు.
దానికి షాపులోని వ్యక్తి ఒకసారి విశాల్ వైపు చూసి ‘‘గట్టిగా మాట్లాడకండి. ఇది ఈ ఏరియా ఎమ్మెల్యే పని. బస్టాప్ వెనకాలే ఎమ్మెల్యేగారు ఫ్లాట్స్ కడుతున్నారు. ఇసుక, సిమెంట్, రాళ్లు వంటి సామాన్లు లారీలతో లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని ఈ బస్టాప్‌ని ఇక్కడి నుండి తీసేశారు’’ అన్నాడు షాపులోని వ్యక్తి.
‘‘అదేంటి ఇక్కడ బస్టాప్ తీసేస్తే ప్రజలకి ఇబ్బంది కదా. చూడు ఎలా ఎండలో నిల్చుని బాధ పడుతున్నారో’’ అన్నాడు విశాల్.
‘‘పెద్దవాళ్ల వ్యవహారాలు మనకెందుకు సార్? మనం ఏం చేయగలం చెప్పండి’’ అని తన పని తాను చూసుకోసాగాడు ఆ వ్యక్తి.
అయితే అతనిలా విశాల్ ఊరుకోలేకపోయాడు.
తిన్నగా గాజువాక పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు.
‘‘సార్ నా పేరు విశాల్. ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను’’ అంటూ పరిచయం చేసుకున్నాడు.
‘‘అయితే’’ అన్నాడు ఎస్సై.
‘‘సార్ ఇక్కడికి దగ్గరలో ఉండే బస్టాప్‌ని ఈ ఏరియా ఎమ్మెల్యే తీయించేసాడు. బస్టాప్ వెనకాల ఫ్లాట్స్ కడుతున్నారని, ఇసుక, సిమెంట్, ఐరన్ వంటివి తరలించడానికి బస్టాప్ అడ్డంగా ఉందని దానిని తీయించేశారు. మీరే ఎలాగోలా ఆ బస్టాప్‌ని అక్కడ తిరిగి ఏర్పాటు చేయించండి సార్. అది లేకపోవడం వల్ల ప్రజలు ఎండకీ, వానకి ఇబ్బంది పడతారు’’ అంటూ వివరించాడు.
ఎస్సై చెప్పినట్లు కంప్లైంట్ రాసి ఇచ్చి డ్యూటీకి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం లంచ్‌కి వెళుతుండగా అతనికి ఫోన్ వచ్చింది.
‘‘ఏమండీ మీరు అర్జెంటుగా రండి’’ దాదాపు ఏడుస్తూ చెప్పింది అతని భార్య.
‘‘ఏమయింది?’’ కంగారుగా అడిగాడు విశాల్.
అయితే అట్నుంచి ఫోన్ కట్ అయిపోయింది.
కంగారుగా ఇంటికి బయలుదేరాడు విశాల్.
ఇంటికి వెళ్లేసరికి అక్కడి వాతావరణం చూసి షాక్ తిన్నాడు.
ఇంట్లోని సామానంతా బయట పడేసి ఉంది.
ఆ సామాన్ల మధ్యలో అతని భార్య కూర్చుని ఏడుస్తూ కనిపించింది.
‘‘వచ్చారా? మనల్ని ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు ఓనర్’’ చెప్పింది.
విశాల్ పక్కనే ఉన్న ఓనర్ ఇంటికి వెళ్లాడు.
‘‘చెప్పండి’’ అతన్ని చూసి నిర్లక్ష్యంగా అన్నాడు ఓనర్.
‘‘సార్ ఇన్నాళ్లు కలిసిమెలసి ఉన్నాం. ఇప్పుడు సడన్‌గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోగలం?’’ బతిమాలుతున్నట్లు అన్నాడు విశాల్.
‘‘నేనేం చేయనయ్యా? నేను ఇల్లు అమ్మేసాను. కొనుక్కున్న వాడు అర్జెంటుగా ఇల్లు కావాలని అడుగుతున్నాడు. మరొక్క నిముషం ఆలస్యం చేయకుండా ఇల్లు ఖాళీ చేయండి’’ అంటూ తలుపేసేసుకున్నాడు ఓనర్.
విశాల్‌కి అర్ధమయింది.
ఇది ఆ ఎమ్మెల్యే పనే.
మంచికెళితే రోజులు కావని అర్ధమయింది.
చేసేదిలేక ఒక లారీ మాట్లాడుకుని భార్యతో పాటు ఇంటి వేటలో పడ్డాడు విశాల్.
*
- నల్లపాటి సురేంద్ర, విశాఖపట్నం.
సెల్ : 9490792553.