నెల్లూరు

ఎవరాపగలరు? ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అనంత కాలగమనమును
ఆ విధాత సృష్టి రచనా విధానాలను
విశ్వాంతరాళములలోని ఖగోళ రహస్యాలను
రెండు అయనాల భ్రమణాలను
చెప్పకుండానే శిశిరం దాటి
వసంతఋత్వాగమనమును
ఎవరాపగలరు?

సప్తాశ్వరథములను బూని ఈ మార్తాండుని
తూర్పు పడమర సరిహద్దుల లీలలు
కాలములు, సెకనులు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, వారంతారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాల గణికలను, ఘంటికలను
ఆకాశములో వచ్చు దివ్యకాంతుల శోభలను
ఎవరాపగలరు?

నిన్నటిదాకా ఆకులురాలి, మోడువారి,
మంచు దుప్పట్టు కప్పుకొనిన భూమాత కొత్త ఊపిరిలూదుకుంటూ
మెల్లమెల్లగా ఆకుపచ్చ ధద్ర)నమును
పురుడు పోసుకొంటూ
గిరులు, ఝరులు, తరులు, నదీనదాలను
దాటుకొంటూ
గండు కోకిల గానాలు తోడు తెచ్చుకొంటూ
వెండి వెనె్నల పరువాలు కలుపుకుంటు
గుండు మల్లెల పరిమళాలు పులుముకుంటు
కవి కోకిల గీతాలాపాలు వెంట దెచ్చుకుంటూ
పూలబాణాలు ఒక చేత, ఇక్షుఖండ
చాపమొక చేతంటుకొంటు
చైత్రమాస రథమెక్కి వసంతుడు వచ్చి
తెలుగు వాకిట్లో ఆనందోత్సవాలు పరువాలను
ఉగాది పండగ రూపము ఆగమనమును
ఎవరాపగలరు?

మామిడితోరణాల ఆహ్వాన పత్రములను
చెరుకు గడెలలోని తియ్యందనమును
నింబవృక్ష (వేప) పూత చిన్నిచిన్ని అందాలను
బెల్లపు గడ్డలలోని మాధుర్యమును
చింతలోని పులుపు దనమును
వెరసి ఉగాది పచ్చడిగ మారటాన్ని
ఆరు రుచులు జీవితములోని
తీపి, చేదుల సమాహారములనే
చెప్పి చెప్పక పండగల అంతరార్థములను
వాటి శుభ, లాభ ఫలాలను అందకుండ
ఎవరాపగలరు?

యుగయుగానికి నూతన అభిరుచులు
దినదినానికి నూతన సంబరాల ఆశయాలు
గంటగంటకు కొంగ్రొత్త ఆశల ఆనందాలు
మార్పులు చేర్పులు అవసరమనునటుల్
మన్మథ నామవత్సరం పండుటాకువలె
రాలిపోయి
చేదు, దుఃఖ సంఘటనలు మానిపోయి
దుర్ముఖి నామవత్సరానికి
కొత్త చిగురులు మొలిచినటుల
మనిషి హృదయంలోని కోటి రాగాల ప్రభవాన్ని
ఎవరాపగలరు?

మనిషి ఆశావాది
రేపటి వెలుతురు కోసం
రేపటి ఉజ్వల భవిత కోసం
పంచాంగ శ్రవణం
పండితుల భవిష్యత్ దర్శనములు విని
ఆశీస్సులు పొందెదరుగాక,
ప్రకృతి - మనిషి -
మనిషి - ప్రకృతులు అవినాభావ సంబంధాలు
ఎవరాపగలరు?

సమస్తా సుఖినోభవంతు
సకల సౌకర్య ప్రాప్తిరస్తు
ధన, కనక, వస్తు, శాంతి ఆయుఃరారోగ్య
సంభవమస్తుయనే
పెద్దల, పంతులుగార్ల శుభాశీస్సులను
ఎవరాపగలరు?

- లక్కరాజ శ్రీనివాసరావు
అద్దంకి, చరవాణి : 9849166951

***

ఆకుపచ్చని స్వప్నం

రోజూ చూస్తూనే.. ఉన్నాను
బతుకు కొమ్మకు
ఆకుపచ్చని ఆకు..దృఢంగా
అంటుకొని రెపరెపలాడుతూ ఉంది..
గాలి, ధూళి, నీరు, నిప్పును సైతం
తట్టుకొని..ప్రభాతవేళ
జాలువారుతున్న తుషార బిందువులతో
వింత కాంతులీనుతూ ఉంది
రోజూ.. చూస్తూనే ఉన్నాను
ఎండుతూ.. పండుతూ.. రాలుతున్న
ఆకుల నడుమ
ఆకుపచ్చటి రాజసంతో
సోయగాలను వెదజల్లుతూనే ఉంది
ఓ రోజు.. ఎవరూ తుంచకనే..
ఎవరూ తెంపకనే..
హఠాత్తుగా.. నేలను తాకింది
వేన వేల..అణు విప్ఫోటనాల విషాదాన్ని
ఆకు నీడన తలదాచుకున్న
చిగురుటాకుల్లో..నింపుతూ
చిమ్మచీకట్లు వెదజల్లింది
ఆకు అదృశ్యమైన.. ఆ దృశ్యంతో
భారమైన హృదయాలు
తల్లడిల్లాయి
(అర్ధాంతరంగా అదృశ్యమైన
ఆత్మీయ మిత్రులకు నివాళిగా)

- కుర్రా ప్రసాద్‌బాబు, ఒంగోలు,
చరవాణి : 9440 660 988