దక్షిన తెలంగాణ

తస్మాత్ జాగ్రత్త! ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాయామం అంటూ కాయాన్ని
ఎన్నాళ్లు యాతన పెడతారు
డేగీసాల్లోనే ఉడికే జీవాలన్నీ
ఆండాల్లో కాగే సారాలన్నీ
నోటి గుహల ముందు సాగిల బడుతుంటే!
నడవని కాళ్లను
కదలని చేతులను
ఏవేవో చేసి నడిపించొచ్చు
‘వాకింగంటూ’ కాళ్లని బ్రతికిద్దామని
ప్రాణాయామమంటూ పొట్టని బ్రతికిద్దామని
ఈసురోమంటున్న ప్రాణాన్ని
వీధిలోమిషన్లు జిమ్ముకు బలిపెడుతున్నారు
స్లిమ్మింగంటూ, ట్రిమ్మింగంటూ
సప్పిడన్నాలు జనం ముందు తినడం
సావాసగాళ్ల మార్గాలలో
చికెన్ బిర్యానీలతో చిందులేయడం!
ఎదగని మెదడునీ, ఒదగని మనసునీ పెట్టుకుని
ఎవడు బ్రతికాడు మూడు యాభయిలంటున్న
కథానాయకులు సైతం కాలం మింగిన కాయాల్ని
భూమి పొరల క్రింద నిక్షిప్తం చేసిన క్షణం
వారి కీర్తి పతాక ఛువనోజ్వలమై వెలుగ లేదా!
పొల్యూషన్ అలలలో సర్ఫింగ్ చేసే
మిర్చీ బజ్జీలూ, ఛాట్ భండార్లూ
మనల్ని ఎరగా చేసి
మరిగే నూనెలో జీవచ్ఛవాలుగా మారుస్తుంటే..
అదరహో
వీధి బండ్లముందు చిందులేస్తున్నాం
తస్మాత్ జాగ్రత్త!!

- తుమ్మెర రాధిక
తొర్రూర్, వరంగల్ జిల్లా, సెల్.నం.9440626702
**
పాదుకా విలాపము
*
మనిషి భారాన్ని మొయ్యడమే బాధ్యత గానీ
హక్కుల ఆరాటం ఆనవాళ్లు కరువు
మనిషిని మోసినన్ని రోజులే జంట,
ఒక దానికి గాయమైనా పెంట పాలు
చెప్పులని చెప్పుకున్నా
పాదరక్షలని పాలిష్ రుద్దినా
రాగద్వేషాలు మా కంటవు
ముక్తికోసం యుక్తి నాశ్రయించిన భరతుడు
పాదుకా పట్ట్భాషేకముతో పరవశించిండు
మా గుండెలకు ముళ్లు గుచ్చుకున్నా
మనిషి కాళ్లకు మురిపాలు పంచుతాము
తప్పులో కాలేసిన వారి చెంప చెళ్లుమనిపిస్తే
మా ఎద బాధా జలధి తరంగమే
మానవ సేవయే మాధవ సేవ మా సూత్రాలు
అహర్నిషం సేవాదుయే మా గోత్రము
ప్రాచ్యుడైనా అప్రాచ్యుడైనా
మా అంగంగాన్ని పాదాల కింద పచ్చడి చెయ్యడమే
రోషకారణమేదైనా
ద్వేషం మా దరికి రాదు
దేవునికో దండం పెడదా మనుకుంటే
గుడి జాడలు అంటకుండా
నిషేధం కొరడా ఝుళిపిస్తుంది
మెడలో పూలదండ వేస్తే గౌరవం గాని
మా దండ వేస్తే పరాభవమా?
ఎందుకీ వివక్ష? ఏ శాస్త్రం పుక్కిలించింది?
మేము భరించిన మానవమాత్రుడు
మమ్ము మోస్తే నామోషీయా?
వాడుకుని మా ప్రాణాలు తోడెయ్యడమే కానీ
మా గురించి ఆలోచనాలోచనాలు విచ్చుకోవు

- ఐతా చంద్రయ్య
సిద్దిపేట, సెల్.నం.9391205299
**
నా హృదయ కుసుమమా!
*
ఓ ప్రియతమా!
నా హృదయ కుసుమమా!
నీవు లేని లోటుతో
ముసురుతున్నవి నాలో
బాధాకర ఛాయలు
నీ పాద సవ్వడి ఏ గాలితో కలసివచ్చి
నను పలుకరించి ఊరడిస్తుందని
కడు ఆశతో నేనున్న
ఏ మబ్బు తెరలోంచే
నీవు చినుకుగా రాలి
ఈ తపిస్తున్న ఎదను
చల్లబరుస్తావని నా ఆరాటం
ఏ పక్షుల గుంపుతో
నీవు రాసి పంపే ప్రేమలేఖ
నన్ను ఉల్లాసపరుస్తుందని
నా వేయికళ్ల ఎదురు చూపు
మధుర రాగంతో కోకిలవై వస్తావా
బహు వనె్నల చిందుల ఒయ్యారపు
మయూరంలా వస్తావా
సౌందర్యాలొలికిస్తూ
ఓ అప్సరసలా వస్తావా
ఎలా వచ్చిన నీవు
నా హృదయ కుసుమానివే!

- తోట సదానందం
మంచిర్యాల
సెల్.నం.9908594669
**
జీవితం
*
జీవితమంటే..
వడ్డించిన విస్తరి కాదు..
జీవితమంటే..
ప్రతి క్షణాన్ని ఆఖరి క్షణంలా తలవాలి
జీవితమంటే
ఎవరికి తెలుసు
ఇదే చివరి క్షణమనీ
అందుకే
జీవితమంటే
బ్రతికున్నాన్నాళ్లు
సేవ, సహాయం చేయడం
ఇతరులకు తోడ్పడటం
‘జీవిత సత్యం’

- గుండు రమణయ్య
పెద్దపల్లి, సెల్.నం.9440642809
**
ఆసిఫాబాద్!
*
మనది ఆసిఫాబాద్
గోండు రాజులు పాలించిన అవని
వీరత్వానికి ప్రతీక!
ఈ భూమి ‘హకీ’ ఆపక సూచిక!
‘చలనచిత్ర’ నటులను,
దర్శకత్వానికి, రంగస్థల నటులను కన్న నేల ఇది!
గిరి కోనల, జలపాతాల
లోగిల్ల భూమి మనది!
వన్య ప్రాణులకు ధరణి ఇది!
అటవీ సంపదకు నిలయమైన ధరణి ఇది!
ఉర్దూ, కొలామి, హిందీ, గుజరాతీ
మరాఠి, గొండి, తెలుగు భాషలకు
ఆలవాలమై ఈ ప్రాంతం పూలలో
దారంలా ఆధారమైనది
‘అశేష జాతుల’ ఆదరించిన భూమి ఇది!
వివిధ దేవళాలు వెలసిన భూమి
నిహారిక నది నిరంతరం ప్రవహిస్తున్న నేల ఇది!

- ఢిల్లీ విజయకుమార్ శర్మ
ఆసిఫాబాద్, కొమురం భీం జిల్లా
సెల్.నం.9618597139
**
త్యాగం పూలు
*
జీవితాన్ని ఎన్నిసార్లు చింపిపారేసానో నేను
పనికి రాని కాగితంలా
ఓ కవిత వ్రాసి
బాగులేదని ముక్కలు ముక్కలు చేసినట్టుగా
జీవితం పనికి రాకుండాపోయిందెందుకూ
చరిత్రకు ఓ అంధముంది
అభివృద్ధి, అనే్వషణ
అర్ధమయ పదార్థంలా
జ్ఞానం, విజ్ఞానం, తత్వం
ఓ పరిశోధన, ఓ పరిశీలన, ఓ మార్పు
జీవితానికో అర్ధముండాలి
అది త్యాగం, సేవ
మామిడి పండు ఎవరి కొరకు
తీపి పంచుతుంది
మల్లెతీగ ఏ గాలి కొరకు వాసనలిస్తుంది
కనిపించని చల్లగాలి
ఎవరి కొరకు కిటికీ తెరుచుకొని
మనసులోకి వస్తుంది
మేఘం వర్షమయి
చినుకు గుండె జీవమయి
వరద ప్రాణదానమయి
ఎవరి కొరకు
ఇప్పటి జీవితం ఈ లక్షణాలు మర్చిపోయింది
స్వార్థం, డబ్బు, నేను, నాది
ఇక్కడే చరిత్ర మైలురాయి ఆగిపోయింది!

- సిహెచ్.మధు
నిజామాబాద్, సెల్.నం.9949486122
**
గురుభక్తి
*
‘గురుబ్రహ్మ, గురువిష్ణు (యని)వని
గురువులకు మొక్కండి
గురువులే దైవాలని నమ్మండి
గురువు బాటలో నడవండి
గురువులే ఆదర్శమ్మని తలవండి..
గురుభక్తి చాటుకున్న తిమ్మరుసు
ఆచార్య సాందీపమునిని భక్తిగా కొలిచి
అతని పుత్రుని పునర్జీవితుని జేసిన
శ్రీకృష్ణ పరమాత్మల గాధలు
గురుముఖత నేర్వండి
గురుభక్తిని చాటండి
గురుదక్షిణ చెల్లించండి
గురు దీవెనలు వేన వేలుపొంది
ఉన్నతిని గాంచండి
పదిమంది మేలు కోరుతూ
అనాధలను, అభాగ్యులను ఆదుకుంటూ
జన్మధన్యత గాంచండి

- గరిశకుర్తి శ్యామల
హైదరాబాద్
సెల్.నం.9490189081