విజయవాడ

హోమియో వైద్యప్రదాత, బహుభాషా కోవిదుడు హానిమన్! (అక్షరాంజలి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగతికి హోమియో వైద్యాన్ని ప్రసాదించిన క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానిమన్ బహుభాషా కోవిదుడిగానూ ప్రఖ్యాతి చెందారు. 1755 ఏప్రిల్ 10న జర్మనీలోని మీసేన్ గ్రామంలో జన్మించారు. ఆయనది నిరుపేద కుటుంబం. నిరంతర కృషి, తన మేధా సంపత్తితో 20 సంవత్సరాల వయస్సు నాటికే హానిమన్ 8 భాషల్లో పాండిత్యం సంపాదించారు. ఎన్నో కష్టాలుపడి 1799లో వైద్యవిద్యను పూర్తిచేశారు. పదేళ్ల పాటు జర్మనీలోని వివిధ పట్టణాల్లో వైద్యసేవలు అందించారు. రోగులను బాధపెట్టే ఆనాటి వైద్య విధానాలు నచ్చక శాస్త్ర అధ్యయన, పరిశోధన , గ్రంథానువాదాలతో జీవితం గడపసాగారు. 1790లో ‘కల్లెన్’ రాసిన ‘వస్తుగుణ దీపిక’లో ‘సింకోనా’ మందు చలిజ్వరాన్ని తగ్గించి రోగికి బలాన్ని ఇస్తుందని చదివి, అది తను తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందామనుకున్నారు హానిమన్. ఆ సింకోనా బెరడు రసాన్ని కొద్ది మోతాదులో తీసుకున్నారు. ఆయనకు చలిజ్వరం వచ్చింది. తరువాత తన కుటుంబ సభ్యులు, మిత్రులకు దాన్ని వాడితే వారికీ చలిజ్వరం వచ్చింది. వెంటనే వారు (సహజంగా) చలిజ్వరంతో బాధపడుతున్న రోగులకు సింకోనా రసం ఇచ్చి వ్యాధి నివారణ పొందటం గమనించారు. తన పరిశోధనా ఫలితాన్ని ‘ఒక ఔషధ పదార్థాన్ని ఆరోగ్యవంతునికి ఇస్తే ఏయే వ్యాధి లక్షణాలు కలుగుతాయో, అలాంటి వ్యాధి లక్షణాలున్న రోగికి ఈ ఔషధం ఇస్తే నివారణ కలుగుతుంది’’ అనే సూత్రం ప్రతిపాదించారు. ఇదే హోమియో వైద్యానికి మూలమైన ‘సారూప్య ఔషధ సిద్ధాంతం’.
ఈవిధంగా కొన్ని ఔషధాలను స్వయానా తయారుచేసి హోమియో వైద్యం చేయనారంభించారు హానిమన్. కొందరు రోగులు తొలుత వ్యాధి నుండి నివారణ పొందినప్పటికీ మరలా వ్యాధిగ్రస్తులై ఆయన వద్దకు రాసాగారు. తను కనుగొన్న వైద్యవిధానంలో లోపాలున్నాయేమోనని భావించి వైద్యం మానేశారు హానిమన్. అంతటితో ఆగక 12 సంవత్సరాలు అహోరాత్రులు పరిశోధనలు చేసి మరలామరలా తిరగబెట్టే వ్యాధులకు మూలకారణాలైన సోరా, సైకోసిస్, సిఫిలిస్ అనే మూడు మియాజములు (రోగ తత్వాలు) తెలుసుకున్నారు. వీటివల్లనే మానవులకు అనేక వ్యాధులు కలుగుతున్నాయని, ఈ తత్వములు నివారించే శక్తిమంతమైన దీర్ఘ ఔషధాల (క్రానిక్ డ్రగ్స్)ను ఆయన కనుగొన్నారు. తనే స్వయంగా మందులు తయారుచేసి సేవాభావంతో వైద్యం చేయసాగారు. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది రోగులు వచ్చి స్వస్థత పొందసాగారు. ఈయన ప్రశస్తిని చూసిన ఇతర వైద్యులు ఔషధ విక్రేతలు అసూయాద్వేషాలతో హానిమన్‌ను ‘లీఫ్జిగ్’ పట్టణం నుండి వెళ్లగొట్టారు. అయినా ఆయన అధైర్యపడక ఫ్రాన్స్ దేశానికి చేరి అక్కడ రోగులకు వైద్యం చేయసాగారు. హానిమన్ 80వ ఏట భార్య చనిపోయింది. మెలనిడి హెర్విల్లీ అనే వనిత ఆయన సేవాతత్పరత, ప్రతిభను చూచి పెళ్లాడింది. ఫ్రాన్స్‌లో హోమియో వైద్యం చేయటానికి అనుమతి సంపాదించింది.
తన 88వ ఏట 1843 జూలై 2న హానిమన్ పరమపదించారు. ఆయనను తరిమికొట్టిన లీఫ్జింగ్ వాసులు 20 సంవత్సరాల తరువాత ఆయనపై గౌరవంతో తమ పట్టణంలో హానిమన్ శిలా విగ్రహం ప్రతిష్ఠించి తమ తప్పును సరిదిద్దుకున్నారు. యశస్వి డా. హానిమన్ విజ్ఞానవంతుడివి కావాలంటే సాహసవంతుడివి కావాలనే ఉన్నతాశయంతో నిత్య సత్యానే్వషియై ప్రపంచానికి తన హోమియో వైద్యశాస్త్రాన్ని ప్రసాదించి ప్రాతఃస్మరణీయుడయ్యాడు. ఆయన ‘ఆర్గనాను’ హోమియో వైద్యశాస్త్ర తత్వగ్రంథం భారతీయులకు భగవద్గీత మాదిరిగా వైద్య శాస్త్రానికి తలమానికమైనదని విజ్ఞులు చెపుతుంటారు. ఇంకా ‘మెటీరియా మెడికా ఫ్యూరా’, ‘క్రానిక్ డిసీజెస్’ అనే గ్రంథాలు కూడా ఎప్పటికీ అవశ్య పఠనీయాలే! రోగికి ఉన్న అన్ని బాధలకు ఒక్క ఔషధం తక్కువ మోతాదులో ఇవ్వటం ఈ వైద్యం ప్రత్యేకత. అనేక సామాన్య, దీర్ఘవ్యాధులకు ఇందులో చక్కటి ఔషధాలు ఉన్నాయి. కండ్లకలక, మెదడువాపుతో బాధపడేవారు ఎందరో హోమియో ఔషధాలు వాడి రోగ నివారణ పొందటం మనకు తెలిసిన విషయమే!
(డా. హానిమన్ 262వ జయంతి
సందర్భంగా..)
*
దేశం పాపిరెడ్డి, గుంటూరు.
చరవాణి : 9849048242
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net