రాజమండ్రి

వివేకానందుడు చెప్పిన వీరశివాజీ గాథలు (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు.
125 సంవత్సరాల అనంతరం ఆనాడు జరిగిన ఒకానొక ఘటన అక్షరరూపం దాల్చిన రచన ఇది. 1890లో వివేకానంద దేశసంచారం చేస్తూ చెన్నపట్నం వచ్చి మైలాపూర్‌లో విడిది చేశారు. స్వామి వారి పట్ల భక్తి, గౌరవం, అభిమానం ఉన్నవారు రోజూ ఆయనని చూసేందుకు వచ్చేవారు. సాయం సమయాలలో అలా వచ్చిన వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు విషయాలపై ప్రసంగించేవారు. అలా వెళ్లిన అభిమానుల్లో ప్రముఖ వైద్యుడు నంజుండరావు ఒకరు.
ఒకానొక ప్రసంగంలో వివేకానందస్వామి ఛత్రపతి శివాజీని స్తుతిస్తూ భూషణ కవి రాసిన ‘శివభావనీ’ అనే కవితా ఖండికలోని పంక్తులను గానం చేస్తుండగా నంజుండరావు ‘శివాజీ మోసగాడు, దోపిడీదారు, గజదొంగ, హంతకుడిగా ముద్రపడిన వ్యక్తి. అతనిని ప్రశంసించడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
స్వామీజీ పాడడం మానివేశారు. ముఖం జేవురించింది. ‘‘ఏమిటి డాక్టర్! హిందూ సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీకి మించిన నాయకుడు ఎవరున్నారు. ఆయనలాంటి తపస్వి, భక్తుడు మరొకరున్నారా? పురాణాలలో చెప్పినట్లు మహత్కార్యాల్ని నిర్వహించడానికి అవతరించినవాడు. హిందూ జాతి ఆత్మ చైతన్యానికి ప్రతినిధి. భారతమాత కన్న సుపుత్రులలో అగ్రగణ్యుడు. నీవు విదేశీయులు రాసిన చరిత్ర పుస్తకాలు చదివిన దానికి ఫలితం ఇది. శివాజీ కారణజన్ముడు’’ అంటూ వివేకానందుడు అన్నారు.
దాంతో శివాజీ గొప్పదనం ఆయనకి అవగతం అయింది. శివాజీపై కొన్ని అపప్రదలు ఎలా వచ్చాయి? అతని వాస్తవ జీవితం ఎలా గడిచింది. శివాజీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన అఫ్జల్‌ఖాన్ వధ మున్నగు విషయాలను వివరించమని డాక్టర్ నంజుండరావు కోరగా వివేకానందుడు వినిపించిన శివాజీ గాథ 88 పుటల లఘు గ్రంథంగా అవతరించింది.
వివేకానందుని హృదయంలో శివాజీకి గల స్థానం ఎటువంటిదో ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి తెలుగు పాఠకుడు చదవాల్సిన గ్రంథం. దీనిని శ్రీ శివాజీ మెమోరియల్ ట్రస్ట్, శ్రీశైలం వారు ప్రచురించారు.

- ఎ. సీతారామారావు,
విజయనగరం-535002.
ఫోన్ : 08922 237122.
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net