రాజమండ్రి

అక్కడికి వెళ్లగానే...(మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధరం తువాలుతో
అక్షరం ముఖం తుడుచుకొన్నట్లుంటుంది
మాటలు కంటే చూపులే
చేతులు కంటే మనసులే ముందుగా హత్తుకుంటాయి

పుస్తకాల రెక్కల చప్పుడుకు
మెదడు చిగురాకులా కదిలిందీ అక్కడే
పత్రాల ఎదల్లో మాటువేసిన హరిత వర్ణం
ప్రపంచమంత విస్తరిస్తోన్న దృశ్యం చూసిందీ అక్కడే

పుస్తకాన్ని మస్తకాన్ని సమానంగా ప్రేమించే చోట
కనురెప్పల చూరు మీంచి జారే కన్నీటికి
కవిత్వమంత ఆనకట్ట నిర్మించుకుందీ అచ్చోటనే...

ఇంటి దూలానికి వేలాడదీసిన ఓజోను లాంతరులా
పుత్తడి ఊహలకి పురుడు పోసే మంత్రసానిలా
ముఖ చిత్రమే కాదు మనోపత్రం కూడా...

పుస్తక మస్తకం తెరవగానే
వందలకొద్దీ అనుభవాల్ని వెంట తెచ్చుకొన్నట్లు
వేలవేల విజ్ఞాన గుళికల్ని మింగినట్లు
ఏ పుటలో ఎనె్నన్ని పచ్చని జ్ఞాపకాలుండేవో...

పిప్పర్మెంట్ యిచ్చి
పిల్లగాని సముదాయించినట్లు
అక్కడ మళ్లీ కొత్త పుస్తకాల
మెతుకుల వాసన కురిసేదెపుడో...
కళ్ల వెంట అక్షరాలూ
అక్షరాల వెంట కళ్లూ, కృతులు కృతులుగా
ప్రేమిస్తూ, ప్రేరేపిస్తూ, వేధిస్తూ, ఓదారుస్తూ
జ్ఞాపకాల తుంపర్లని తుడచుకుంటూ
తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిగానే...
(పాత పుస్తకాల గది చాన్నాళ్లకి తెరిచినప్పుడు...)
*
- ఎస్.ఆర్.్భల్లం
తాడేపల్లిగూడెం, సెల్: 9885442642
**
మంచు బండి
*
ఎండలో
చల్లని మంచు బండిని వీధిలో
లాగుతున్న కొత్త మనిషి
వాడి బండి గంట పిలుపు
బతుకు గదిల్లోంచి
ఒక్కొక్క ఐస్ క్రీమ్ తీస్తుంటే
మనసు చల్లబడిపోతుంది
వాడి చల్లని మాట స్పర్శకన్నా
హాయైన భరోసా ఇంకేముంటుంది!
మంచు పరిమళాల్ని
పిల్లల నుండి ముసలి వాళ్లవరకూ
హృదయాల్ని తాకుతోంది
వాడొచ్చాకే
వీధి కొత్త అనుభూతులు నదిగా
ప్రవహిస్తుంది
నాలుక తియ్యని దుప్పటిని
కప్పుకుంటుంది
మంచులో చల్లగా తడిసిపోడానికి
కనురెప్పల క్రింద
మంచు సముద్రం దృశ్యకేంద్రమై
అలరారుతోంది
క్షణక్షణం
వీధిలో ఉదయించే మంచు సూర్యుడు
రంగురంగుల
ఇంద్ర ధనుస్సులాంటి ఐస్‌క్రీములతో
మధుర జ్ఞాపకాలను
పంచుతున్నాడు
ఎండాకాలాన్ని జయించాలని
మంచు హృదయంతో
కాలం ఎండ కాగితంపై
మంచు సంతకం చేస్తున్నాడు
ఆనందాన్ని క్షణకాలమైనా
కడుపులో
పువ్వులా నవ్వాలని.
*
- నల్లా నరసింహమూర్తి
కురసాల వారి వీధి,
అమలాపురం,
సెల్: 92475 77501
‘కవన’ కార్మికుడు
**

కవి- నిరంకుశుడా?
*
కాదు కాదు
నిష్కల్మషుడు!

సమస్యకు స్పందించే
సున్నితుడు!

సమాజాన్ని సవరించాలనే
సహృదయుడు!

వినోదాన్ని విజ్ఞానాన్ని
వర్షించేవాడు!
పొగడ్తకు పడిపోయే
పిల్లవాడు!

అభిమానులు తప్ప
ఆస్తిపాస్తులు లేని
అమాయకుడు!

తిన్నా తినకున్నా
స్థితప్రజ్ఞుడే!

ఆలుసు చేయకండి
అభిమానించండి
అభినందించండి!
*
- కౌలూరి ప్రసాదరావు,
వేళచింతలగూడెం,
ప.గో.జిల్లా- 534316,
సెల్: 7382907677