నెల్లూరు

ఉగాది కవితలు అదుర్స్ (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపులో ప్రచురించిన ఉగాది కవితలన్నీ దేనికదే పోటీగా ఉంది. చిగిర్చాల్సిన సమయం కోసం అంటూ పాతూరి అన్నపూర్ణ గారు, మేలుకొలుపు అంటూ మోపూరు పెంచల నరసింహం గారు రాసిన కవితలు రెండూ బాగున్నాయి. దేనికదే ప్రత్యేకంగా సాగింది. మంచి భావాలను అందించిన రచయితలకు ధన్యవాదములు.
- అయితా చంద్రశేఖర్, రేబాల
- ఉడుతా భవాని, కందుకూరు

నిజమైన ఉగాది కథ చాలా బాగుంది
మెరుపులో ప్రచురించిన జ్ఞానేశ్వర్ గారి కథ నిజమైన ఉగాది చాలా చక్కగా కుదిరింది. పరిమళమ్మ జీవితం ఆధారంగా రాసిన కథ నేటి సమాజానికి దగ్గరగా వుంది. పరిమళమ్మ తన పిల్లలకు తన ఆస్తి ఇవ్వకుండా తాను తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. తనతో పాటే వుండేవాళ్లను, ఆమెకు తోడుగా వుండే మొక్కలనే తన చిరకాల మిత్రులుగా భావించడం కథకు అందాన్ని తెచ్చిపెట్టింది. కథను మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆహ్లాదకరంగా మలిచిన రచయిత డాక్టర్ జ్ఞానేశ్వర్ గారికి అభినందనలు.
- శ్యామలాదేవి, కావలి
- జి శ్రీనివాస్, సింగరాయకొండ
- పమిడి శ్రీనివాస్‌చౌదరి, చిత్తూరు

కార్టూన్లు బాగున్నాయి
మెరుపులో ప్రచురించిన రెండుకార్టూన్లు బాగున్నాయి. నాథ్ గారి కార్టూన్, రామశేషు గారి కార్టూన్లు నవ్వులు పూయించాయి.
- చంద్రశేఖర్, నాయుడుపేట
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net