నెల్లూరు

రసాయన రసం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఒక రాజు.. కాదు కాదు చక్రవర్తి
ఆరుగురు కొడుకులకు తండ్రియతడు
అలవాటుగా వచ్చు ఉగాది పండుగనాడు
ఆరు రుచుల పచ్చడిని ఆరగింప
అంపె ఆరుగురిని ఆరు దిక్కులకు
తోపులన్ని చదను చేసి నివాసాలతో
నింపినారు
దొరకలేదు మామిడికాయని
తిరిగి వచ్చె మొదటివాడు
మేరు చెట్లను నరికి మార్గములు పెంచినారు
కానరాలేదు చింతయని చింతతో తిరిగివచ్చే
ద్వితీయుడు
పంటకాలువలు పొడిబారిపోయి
చుక్కనీరు లేక
పచ్చిమిరపైన పండలేదని వచ్చె మూడవకొడుకు
సాగరాన్ని తొలిచి చేపల చెరువులు వచ్చి పడె
ఉప్పుకట్టలు వేయ జాగాలేదని వచ్చె
నాల్గవ పుత్రుడు
మొదలంట నరికి మాను, కొమ్మల
కలప ముక్కలకు
తలుపు చెక్కలకు వాడ వేపపూత లేదని వచ్చె పంచమ సుతుడు
చిల్లర కష్టాలకు చెరకు నూర్ప శ్రామికులు
దొరకక ఇసుమంత గుడము తయారవలేదని అరుదించె కనిష్ఠుడు
ప్రకృతి ప్రసాదలన్నిటిని ఛిద్రము చేసి
బొక్కసాలను నింపుకున్నానని
వగచు పతిని చూసి
మేధావియైన ముద్దుల చిన్న భార్య
బీరు జలము తీసి
అందునొకింత సోడియము కలిపి
ఆస్కార్బికామ్లము, మాజాలను జతచేసి
క్షారరసము తోడ చక్రిన్‌ను కూడా కలిపి
కొంతమరగించి గుజ్జు చేసి
ఆపైన చల్లబరచి
షడ్రుచుల రసమునిచ్చె రాజుకు
దిగులుతీర
కాలానుగుణముగ నర్తించు కలికిని చూసి
ముదమంది మహాప్రియముగ
స్వీకరించెనా రాజు
ప్రకృతి పాడైననేమి ప్రపంచీకరణ
యిచ్చిన మేథస్సు
పిచ్చిమారాజు మనసుకు ఊరటనిచ్చు
ఉగాది పచ్చడినిచ్చె
ఎంతమారెనో కదా ఈ లోకం
ఇంక ఎందుకయ్యా మనకు శోకం
*
- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706
**
నా చిట్టిగుండెకు
*
ఎన్ని అగచాట్లో..!
పిడికిలంత ఉండు
సున్నితమైన చెండు
అనుభూతులు మెండు
ప్రాణానికి కమాండు...
సంతోషంలో
గంతులేస్తుంది
బాధేస్తే కృంగి పోతుంది
ఉత్సాహంలో ఉరకలేస్తుంది
భయమేస్తే వణుకుతుంది
ఆటలాడితే
ఆయాసపడుతుంది
కోపమొస్తే ఆవేశపడుతుంది
దానంలో దాసోహమంటుంది
సేవలో తడిసి తబ్బిబ్బవుతుంది
కరుణిస్తే కరిగిపోతుంది
ఆప్యాయతలో ఆలింగనం ఇస్తుంది
ఆదరణలో ఆవిరైపోతుంది
త్యాగంలో ఉసురు తీసుకుంటుంది
ప్రేమకు బానిసవుతుంది
చిట్టిగుండెకు ఎన్ని అగచాట్లో..!
*
- యర్రాబత్తిన మునీంద్ర
నాయుడుపేట
చరవాణి : 8331844527
**
మాయమవుతున్న
‘నీతి’
*
మిస్టర్ ఎక్స్‌ని మిస్టర్ వై
అవినీతిపరుడంటాడు,
మిస్టర్ వైని మిస్టర్ ఎక్స్
అవినీతిపరుడంటాడు
దినపత్రికలు చదివే జనం
దొందూ దొందూ అనుకుంటారు,
నవ్వుకుంటారు
అవినీతి పెరిగిపోతూ వుంటుంది
నీతి కరిగిపోతూ వుంటుంది
నిఘంటువుల్లో ‘నీతి’ అనే
పదానికర్థం
అంతులేకుండా పోతుంది!
కొత్త అర్థం పుట్టుకొస్తుంది..!
*
- గంగిశెట్టి శివకుమార్,
చరవాణి : 9441895343
**

ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సం సందర్భంగా....
**
స్వయం ప్రకాశం
*
ప్రకాశమా! అది సర్వతోముఖ
స్వయం వికాసమా!
శాతవాహన కాకతీయుల
రాష్టక్రూటుల రెడ్డిరాజుల
కాటమయ్యల కీర్తి తరగల క్షీరసాగర మథనమా!
జానపదులకు జోల పాడెడు జనరంజక ప్రాభవమా!
తెల్లదొరల తూటాలకు రొమ్మొడ్డిన ప్రకాశం
రామదండును నడిపించిన
దుగ్గిరాల గోపాలం
ఊసర క్షేత్రాలను సువర్ణకేదారాలుగా మార్చిన మోక్షగుండం
తరతరాల త్యాగధనులకు తరగని గని ప్రకాశం
కవి కులనాథుడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ దీపిక ఎఱ్ఱన
అంబర చుంబి శిరస్సర ఝరీ
శీతశైలం పెద్దన
‘‘దనుజ మర్దన, కందుకూరి జనార్దన’’ అన్న రుద్రన
సులక్షణ సార సంగ్రహ సారంగం తిమ్మన
అరసం రమణ, దిరసం స్వప్న
‘‘నది చెప్పని కథ చెప్పిన’’ నాగభైరవ
సంగీత ఝరుల స్నానమాడించిన త్యాగయ్య శ్యామయ్య, అద్దంకి, బండారు,
సి.యస్.ఆర్, చినవౌలానా
కవి కోకిల, నటగాయక శుక శారిక
నందన బృందావనం ప్రకాశం
చెన్నకేశవ, మణికేశ్వర, బైరన్నల
అనుగ్రహం
మనే్నరు, మూసి,
పాలేరుల స్తన్యం
రాళ్ళపాడు, మోపాడు, గుండ్లకమ్మల
సస్యశ్యామలం
నల్లమల వెలుగొండాది సతత హరితారణ్య సౌభాగ్యం
ఒంగోలు నందులు, చీమకుర్తి చీకటి దివ్వెలు
మార్కాపురం పలకలు, మరెన్నో నిధినిక్షేపాలు
ప్రకాశం ప్రాభావానికి
నిలువెత్తు దర్పణాలు
తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పే కేతనాలు..!
*
- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి, సెల్: 9490227114