నెల్లూరు

హామీ పత్రం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం కావడంతో కరెంటు చాలాసేపు తీసేస్తున్నారు. టి.వి. చూద్దామన్న ఆశలేదు. కొత్తగా పెళ్ళైన అన్నపూర్ణకు ఏమి తోచడం లేదు. ఇరుగు పొరుగుతో మాట్లాడే అలవాటు ఎక్కువగా లేదు. నిన్నమొన్నటివరకు తల్లిచాటు బిడ్డగా కాలేజీ చదువైపోవడంతో వెంటనే పెళ్ళైపోయింది.
భర్త కృష్ణమూర్తి ఆఫీసు నుండి రాగానే చెప్పింది తనకేమి తోచడం లేదని. సరేనని ఆఫీసు నుండి వచ్చేటప్పుడు నాలుగైదు రకాల పత్రికలు కొనుకొచ్చి ఇచ్చాడు.
భర్త ఆఫీసుకు వెళ్ళగానే పత్రికలు చదవడం మొదలు పెట్టింది. ఎంతో ఆసక్తిగా వున్న కథలు, కబుర్లతో కాలమే తెలియటం లేదు. రెండు రోజులకొకసారి కృష్ణమూర్తి ఏవో బుక్స్ తెచ్చిస్తూండేవాడు.
ఓ రోజు ఓ పత్రికలో ఓ ‘కథల పోటీ’ గురించిన వివరాలు రాసి ఉన్నాయి. ఆ ప్రకటన అన్నపూర్ణని అమితంగా ఆకర్షించింది. తనుగూడా ఏదో కథ రాసి పత్రికకు పంపించాలనుకుంది. కాని ఏలా మొదలు పెట్టాలో ఏంవ్రాయలో అర్థం కాలేదు.
వెంటనే చిన్నప్పుడు ఏదో పత్రికలో చదివిన కథ గుర్తు తెచ్చుకొని రాసింది. అయితే దానికి ‘హామీ పత్రం’ జత చేయాల్సివుంది. తన కథకు ఎవరు హామీ ఇస్తారు? డాక్టరా, స్కూలు హెడ్మాస్టారా లేక కాలేజీ ప్రిన్సిపాలా ఎవరి చేత రాయించాలో తెలియలేదు.
పోనీ భర్తని అడుగుదామంటే తన కథ అచ్చయిన తరువాత సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. వెంటనే మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఎమ్.ఆర్.ఓ. ఆఫీసుకెళ్ళింది.
ఎమ్.ఆర్.ఓ.ని కలిసి ‘హామీ పత్రం’ ఇవ్వమంది. మొదట ఎమ్.ఆర్.ఓ. ఆశ్చర్యపోయాడు.
‘‘ఇంతవరకు ఎవరూ కథల హామీపత్రం కోసం నా దగ్గరకు రాలేదు. బహుశా దీని అవసరం నాతో ఉండకపోవచ్చు. అయినా మీరు అడిగారుకాబట్టి రాసిస్తున్నాను’’ అని హామీ పత్రం రాసిచ్చాడు. దాంతోపాటు కథ పోస్ట్ చేసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకొంది.
ఓ నెల రోజుల తరువాత ఆ విషయం భర్తకు చెబితే మొదట తెల్లముఖం వేసిన కృష్ణమూర్తి తన భార్య తెలివితేటలకు ఏడ్వలేక నవ్వుతూండిపోయాడు.
పత్రికాఫీసు నుండి ఓ ఉత్తరం వచ్చింది.
‘‘మీరు రాసిన కథ తీరు బాగానేవుంది కాని, ఓ పది సంవత్సరాలు పుస్తకాలు బాగా చదివి అప్పుడు రాయడం మొదలు పెడితే మీలో ఉన్న వర్థమాన రచయిత్రి బయటకు రాగలదు.
ఇక మీదట మీరు కథలు రాసి ఏ పత్రికకు పంపి వారి కాలాన్ని వృధా చేయకండి ఇట్లు ఎడిటర్, అని చదివి అన్నపూర్ణ నిరాశతో తను వ్రాయటం కన్నా ఇకమీదట బాగా చదవాలి. ఎప్పటికైనా రచయిత్రి అవుతాను అనుకొంటూ తన పనిలో నిమగ్నమైంది.
*

- అనురాధ రామకృష్ణ, నెల్లూరు. సెల్: 9394837565