నెల్లూరు

రసాయన రసంలోని సారం బాగుంది (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత శింగరాజు శ్రీనివాసరావు గారు ఏది రాసినా ఓ ప్రత్యేకమైన భావం వుంటుంది. అలాగే ఈసారి మెరుపులో మెరిసిన రసాయన రసం కవితలో గొప్పభావాన్ని అద్భుతంగా చొప్పించారు. రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకుల కథ అందరికి తెలిసిందే. అదే తరహాలో గొప్పకవితను రాజుగారు మనకు అందించిన విధం బాగుంది. కవితలో ఉగాది పచ్చడి భవిష్యత్ తరాలకు ఇక దొరుకుతుందో, దొరకదో అనే బాధను రచయిత చక్కగా ఆవిష్కరించారు. బీరు, ఆమ్లాలు, ఇతర ఆధునిక పదార్థాలతో ఉగాది పచ్చడి ఇక తినడటానికి మనం కూడా సిద్ధపడాలి. అంతే. కాలం మారుతోంది...కలికాలం కదా.
- సజ్జా చంద్రిక, సింగరాయకొండ
- బొప్పూడి నారాయణమ్మ, నాయుడుపేట
హామీపత్రం బాగుంది
హామీపత్రం అంటే ఏమిటో తెలియని రచయిత్రి కథ రాయడం, పత్రికకు పంపడం. వారు హామీపత్రం అడగటం వంటి సారాంశంతో రచయిత్రి అనురాధా రామకృష్ణ రాసిన కథ చాలా బాగుంది. అసలు హామీపత్రం ఎవరు ఇస్తారు.. ఎమ్మార్వో గారు ఇస్తారా అని రచయిత్రి అనుకుని ఆయన దగ్గర హామీపత్రం తేవడం ఏంటి మన కర్మకానీ..ఇలాంటి వాళ్లు కూడా కథలు రాసేస్తే ఉన్న కొద్దిమంది పాఠకులు కూడా మాయవౌతారు.
- రామారావు, కలిగిరి
- పమిడి రవికుమార్ చౌదరి, తిరుపతి
నిజంగా మాయమవుతున్న నీతి
మాయమవుతున్న నీతి కవితను చదివిన తరువాత అసలు సమాజం ఎలా వుందో ప్రతి ఒక్కరికీ అర్ధమైపోతుంది. అవినీతి పెరిగిపోతూ వుంటుంది..నీతి కరిగిపోతూ ఉంటుంది. ఈ వాక్యం ఎంత గొప్పగా ఉంది. అయినా మనకెందుకులే అనుకునే జనం. రచయిత శివకుమార్ గారికి ధన్యవాదములు.
- శైలజ, వాకాడు
**
రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net