రాజమండ్రి

తెలుగు భాషా సంపదల భావ పరిమళం!! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

75పేజీలు, వెల:75/-
ప్రతులకు:
కమల కృపామణి
12-129/1, అశోక్‌నగర్,
కొయ్యలగూడెం, పిన్: 534312
ప.గో.జిల్లా. సెల్: 9912131327
**
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే కృషిలో ఎందరో కవులు - చరిత్రకారులు తమవంతు సేవలందించారు. పరిణామ క్రమంలో భాష - వికాసం సాంస్కృతిక వైభవాల్ని - ఒక దీర్ఘ కావ్యంగా డాక్టర్ వూటుకూరి వరప్రసాద్ ‘తెలుగు పరిమళం’ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఏ భాషైనా తన జాతీయతని కోల్పోరాదు. మాతృభాష కళ వంటిది - పరభాష కళ్లజోడు వంటిదన్నది అక్షర సత్యం. అలా మరోసారి నిలిపే ప్రయత్నాన్ని ప్రసాద్ తన భాషాభినివేశంతో - ప్రాథమిక లక్ష్యాన్ని అక్షరబద్ధం చేయడం అభినందనీయం.
పహ్లావరాజుల కాలంలో పల్లవించిన తెలుగు, కృష్ణా - గోదావరుల సారస్వతాల్ని ప్రవాహర్ప్రతల్ని - గేయ ఛందం అందాల్ని రస రమ్యాక్షరాల ఝరిని చేశారు.
వేంగీ, చాళక్య, కాకతీయ ప్రభువుల పాలన, చారిత్రిక నేపథ్యాలు సందర్భా చిత్రంగా, పురాణ గాధలు, క్షేత్ర ప్రాశస్థ్య పుస్తకాల్ని అందించారు.
కవనసరస రసధునలు-గలగలలు / గళగళంలో నిగళమై పలికింది - రుచి మధుర శ్రుతులుగా సాగింది నా భాష జన శ్రుతులు పల్లవిగా - అనుభూతి అను పల్లవిగా - అనుభవాల చరణాలు భావైక్యతా కిరణాలు - లాంటి లయ గతి గమకాలతో ఈ దీర్ఘకావ్యం అలరిస్తుంది. పురాణాలు స్మృతుల్లోనూ ఐతరేయమతుల్లోనూ జాతకాలు మార్చినట్టి జాతక కథల్లోనూ ఆంధ్రజాతి ఔన్నత్యం అలరారుతూ ఉంది.
‘ఆంధ్రం’ మా భాషగా పిలువబడింది. నాగ యక్ష ద్రవిడ గణాలతో చెలిమి మంచితనంతో పంచారు వారికి మన బలిమి - ఉత్తరా పధంలో అధికారం చేబూని అలా దాక్షిణాత్యులు, గోదావరి కృష్ణల సంస్కృతులు ఆకళింపు చేసుకున్న పలు చారిత్రాత్మకమైన అంశాల్ని విషయావగ్రహణం చేస్తుందీ రచన.
కవిత్రయం నుంచి నేటి ఆధునికుల వరకూ వారి రచనా వైశిష్ట్యాల్ని అంశా మాత్రంగా స్పృశించడం రచయిత నేర్పుకు, పాఠక ప్రతిక్రియకు దోహదపడే రీతిగా సాగుతుంది. సాహిత్యంలోని సామాజికాంశాల్ని - తెలుగు కవనసీమలో ఆవిష్కరించిన ఆయా స్థల కాలాల కవుల భాషా సేవను ఉద్యమ నిర్మాణాన్ని తెలిపారు. వర్తమాన సాహిత్య ధోరణుల్ని ఉదహరిస్తూ - తరాల తంట్లాటలోని ‘ఆర్తి’ని / గుక్కపెట్టి ఆలపిస్తున్నారు / తమ మాండలికంలో తమ భావనల్ని పంచుతున్నారు.
రాష్ట్భ్రావృద్ధికి రయముగా సాగుతున్నా / భాషాభివృద్ధికి భావితరానికి మనమిచ్చే నజరానా - అంటూ రచయిత ఆకాంక్షగా అచ్చ తెలుగులో అనువర్తిద్దాం. జీవనోత్సాహాన్ని - జీవితోత్సాహంగా తెలుగు భాషా పరిమళాల్ని దశ దిశాలా గుబాళింప చేద్దాం. అభినందనలతో మాతృభాషాభిమానాన్ని చాటుదాం.

- వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులు సెల్: 9441148158